Showing posts with label Careers. Show all posts
Showing posts with label Careers. Show all posts

Friday, 6 April 2012

కెరీర్ గైడెన్స్.. ఫొటోగ్రఫీ


ఫొటోగ్రఫీ.. మాటలకందని భావాలను వ్యక్తపరచడానికి.. జీవితంలోని మధుర స్మృతులను ఫొటోల రూపంలో భద్రపరుచుకోవడానికి చక్కటి మాధ్యమం. అటువంటి అద్భుతమైన మాధ్యమాన్ని కెరీర్‌గా ఎంచుకోవాలనుకునే వారికి సరైన వేదికలుగా నిలుస్తున్నాయి ఫొటోగ్రఫీ కోర్సులు. ఆసక్తి, అభిరుచి, సృజనాత్మకత ఉన్న వారికి సరిపడే రంగం ఫొటోగ్రఫీ.
ప్రవేశం:
ఫొటోగ్రఫీకి సంబంధించి పలు కోర్సులను వివిధ ఇన్‌స్టిట్యూట్‌లు ఆఫర్ చేస్తున్నాయి. వీటిల్లో ఆరు నెలల షార్ట్ టర్మ్ కోర్సులతోపాటు డిప్లొమా, సర్టిఫికెట్, బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తిని బట్టి మాస్టర్ డిగ్రీ చేసే అవకాశం కూడా ఉంది. ఆఫర్ చేస్తోన్న ఇన్‌స్టిట్యూట్‌లను బట్టి అర్హత నిబంధనలు మారుతుంటాయి. కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు పదో తరగతి అర్హతతో డిప్లొమా సర్టిఫికెట్ కోర్సులను అందిస్తున్నాయి. అధిక శాతం ఇన్‌స్టిట్యూట్‌లు మాత్రం 10+2/ఇంటర్మీడియెట్ అర్హతతో బ్యాచిలర్, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి.

స్పెషలైజేషన్లు: 

ఇతర కోర్సులకు భిన్నంగా ఆసక్తి ఉన్న స్పెషలైజేషన్‌ను ఎంచుకునే వెసులుబాటు ఉండడం ఫొటోగ్రఫీ కోర్సులోని ప్రధాన ప్రత్యేకత. ఇందులోని స్పెషలైజేషన్లు..
  • ఫొటో జర్నలిజం
  • కమర్షియల్ ఫొటోగ్రఫీ
  • అడ్వర్టైజింగ్ ఫొటోగ్రఫీ
  • ఫ్యాషన్ ఫొటోగ్రఫీ
  • ఇండస్ట్రియల్ ఫొటోగ్రఫీ
  • వైల్డ్ లైఫ్ అండ్ నేచురల్ ఫొటోగ్రఫీ
  • ఏరియల్ ఫొటోగ్రఫీ
  • సైంటిఫిక్ ఫొటోగ్రఫీ
  • డిజిటల్ ఫొటోగ్రఫీ
  • ఫోరెన్సిక్ ఫొటోగ్రఫీ.
ఇటీవలి కాలంలో ఫ్యాషన్ ఫొటోగ్రఫీ, వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ పట్ల చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు.
స్కిల్స్:
ఫొటోగ్రఫీలో రాణించాలనుకునే కొన్ని స్కిల్స్ తప్పనిసరి. వీరికి సజనాత్మకత చాలా ముఖ్యం. దశ్యాన్ని అందంగా చిత్రీకరించడంలో కీలక పాత్ర వహించే బ్యాక్‌గ్రౌండ్ కలర్స్,లైటింగ్, ఆల్బమ్ సెట్టింగ్, ఫొటోషాప్ వంటి అంశాల్లో చక్కని అవగాహన ఉండాలి. సాంకేతికంగా ఈ రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి.
అవకాశాలు:
ఫొటోగ్రఫీ కోర్స్ చేసిన వారికి అవకాశాలకు ఎటువంటి ఢోకా లేదు. ఎంత సజనాత్మకత ఉంటే అంతగా ఎదగడానికి అవకాశం కల్పిస్తుంది. ఫొటో జర్నలిస్ట్‌లకు వివిధ పత్రికలు, టీవీ ఛానెళ్లల్లో అవకాశాలుంటాయి. ఎంచుకున్న స్పెలైజేషన్స్‌ను బట్టి వివిధ టెలివిజన్ చానెల్స్, మూవీ ప్రొడక్షన్ హౌజెస్, టీవీ ప్రొడక్షన్ హౌజెస్, అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు, ఇండస్ట్రియల్ హౌస్‌లు, సైంటిఫిక్ జర్నల్స్, ఫ్యాషన్ హౌస్‌లు, ప్రభుత్వ సంస్థలు తదితర విభాగాల్లో అవకాశాలుంటాయి. నేషనల్ జియోగ్రాఫిక్ ఛానెల్, డిస్కవరీ ఛానెల్, యానిమల్ ప్లానెట్ వంటి అంతర్జాతీయ మీడియా హౌస్‌లలో కూడా పని చేసే సౌలభ్యం ఉంటుంది.
కెరీర్:
ఆప్రెంటీస్,ఆసిస్టెంట్ కెమెరామెన్, కెమెరామెన్, ఆసోసియేట్ కెమెరామెన్ వంటి వివిధ హోదాలతో కెరీర్ ప్రారంభమవుతుంది. సామర్థ్యాన్ని బట్టి డెరైక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ స్థాయి వరకు చేరుకొవచ్చు. ప్రారంభంలో నెలకు రూ. 8-15 వేల వరకు వేతనం లభిస్తుంది. తర్వాత అనుభవం, సీనియార్టీ ఆధారంగా ఆరంకెల జీతాన్ని కూడా అందుకోవచ్చు. సొంతగా స్టూడియోలను ఏర్పాటు చేసుకోవడంతోపాటు ఫ్రీలాన్స్ ఫొటోగ్రాఫర్‌గా కూడా పని చే యవచ్చు.

ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు: 
మన రాష్ట్రంలో:

జవహరలాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్‌ఏఎఫ్‌యూ)-హైదరాబాద్కోర్సు: బీఎఫ్‌ఏ (ఫొటోగ్రఫీ)
అర్హత: ఏదైనా గ్రూపుతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత.
ప్రవేశం: యూనివర్సిటీ నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా అడ్మిషన్ కల్పిస్తారు. ఇందులో అబ్జెక్టివ్ టైప్, ఆప్టిట్యూడ్ టెస్ట్ రెండు దశలు ఉంటాయి. అబ్జెక్టివ్ టైప్‌లో..ఆర్ట్ సెన్సిటివీటీ, జనరల్ ఇంగ్లిష్, విజువల్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్, జీకే-కరంట్ అఫైర్స్ అంశాల్లో ప్రశ్నలను అడుగుతారు. ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో..డ్రాయింగ్, కలర్ విభాగాలు ఉంటాయి. ఒక ఆబ్జెక్ట్‌ను ఇచ్చి చిత్రించమనడం, ఇచ్చిన డ్రాయింగ్‌ను సరిపడ కలర్లతో పూర్తి చేయడం వంటి అంశాలపై ప్రశ్నలు అడుగుతారు.
కోర్సు: ఎంఎఫ్‌ఏ(ఫొటోగ్రఫీ)
అర్హత: బీఎఫ్‌ఏ(ఫొటోగ్రఫీ)
ఎంపిక: యూనివర్సిటీ నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా ప్రవేశం కల్పిస్తారు. ఇందులో కెమెరాలు-రకాలు, చరిత్ర, కంప్యూటర్, వీడియోగ్రఫీ, కమ్యూనికేషన్ తదితర విభాగాలతోపాటు జనరల్ నాలెడ్జ్ అంశాల్లో ప్రశ్నలు ఉంటాయి.
కోర్సు: బ్రిడ్జ్ కోర్సు (ఫొటోగ్రఫీ)
అర్హత: డిప్లొమా (ఫొటోగ్రఫీ)
ఎంపిక: యూనివర్సిటీ నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా ప్రవేశం కల్పిస్తారు.
వెబ్‌సైట్: www.jnafau.ac.in

శ్రీ వేంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ - హైదరాబాద్.(ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో శ్రీ వేంకటే శ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ మాత్రమే ఫైన్ ఆర్ట్స్ కోర్సులను ఆఫర్ చేస్తుంది).
కోర్సు: బీఎఫ్‌ఏ (ఫొటోగ్రఫీ)
అర్హత: ఏదైనా గ్రూపుతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత లేదా తత్సమానం
ఎంపిక విధానం: ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించే రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది. 120 మార్కులకు ఎంట్రెన్స్ ఉంటుంది. ఇందులో జనరల్ ఆవేర్‌నెస్, హిస్టరీ ఆఫ్ ఆర్ట్స్, సంబంధిత రంగంపై అభ్యర్థి ఆసక్తిని పరీక్షించే ఆప్టిట్యూడ్ టెస్ట్ వంటి అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. సాధారణంగా అడ్మిషన్ నోటిఫికేషన్ మే చివరి వారం/జూన్ మొదటి వారంలో వస్తుంది.
వెబ్‌సైట్: www.surabhieducationalsociety.com

జాతీయ సంస్థలు:ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా-పుణే
కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ సినిమాటోగ్రఫీ
అర్హత: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ
ఎంపిక విధానం: సంబంధిత రంగంతోపాటు జనరల్ నాలెడ్జ్, జనరల్ మెంట్ ఎబిలిటీ అంశాలతో రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి ప్రవేశం కల్పిస్తారు.
వెబ్‌సైట్: www.ftiindia.com.

సత్యజిత్‌రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్-కోల్‌కత.
కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ సినిమాటోగ్రఫీ
అర్హత: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమానం.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటరాక్టివ్ ఓరియెంటేషన్ సెషన్ అండ్ వైవా, మెడికల్ ఫిట్‌నెస్ ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది. రాత పరీక్ష..రెండుపేపర్లుగా ఉంటుంది. మొదటి పేపర్‌లో జనరల్ నాలెడ్జ్-మెంటల్ ఎబిలిటీ అంశాలను పరీక్షిస్తారు. రెండో పేపర్‌లో ఎంచుకన్న రంగానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు. ఇందులో సాధించిన మెరిట్ ఆధారంగా అభ్యర్థులకు వైవా సెషన్, అటు తర్వాత మెడి కల్ టెస్ట్ నిర్వహించి ప్రవేశం కల్పిస్తారు.
వెబ్‌సైట్: http://www.srfti.gov.in/.

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్)-న్యూఢిల్లీ
కోర్సు: ఫ్యాషన్ కమ్యూనికేషన్ కోర్సులో ఫ్యాషన్ ఫొటోగ్రఫీ స్పెషలైజేషన్‌ను ఆఫర్ చేస్తుంది.
వెబ్‌సైట్:
 http://www.nift.ac.in/delhi/

జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్-ముంబై
కోర్సు: అప్రెంటిషిప్ ట్రై నింగ్ కోర్సు ఇన్ ఫొటోగ్రఫీ
వెబ్‌సైట్: www.jjiaa.org

జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ-న్యూఢిల్లీ.కోర్సు: సర్టిఫికెట్ (ఫొటోగ్రఫీ)
వెబ్‌సైట్: www.jmi.ac.in

సెయింట్ జేవియర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్-ముంబైకోర్సు: సర్టిఫికెట్ (ఫొటోగ్రఫీ)
వెబ్‌సైట్: www.xaviercomm.org

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫొటోగ్రఫీ-ముంబై.వెబ్‌సైట్: http://focusnip.com/

అకడెమిక్ ఫర్ ఫొటోగ్రాఫిక్ ఎక్సలెన్స్-న్యూఢిల్లీ.వెబ్‌సైట్: http://apexindia.net/

యాంబిషన్ ఫర్ ఫొటోగ్రఫీ అకాడెమీ-చెన్నైవెబ్‌సైట్: www.ambitions4.com

డిజైన్ యువర్ కెరీర్ విత్ వెబ్‌ డిజైనింగ్‌

అగ్గిపుల్ల, సబ్బు బిళ్ల, గుండు సూది నుంచి విమానాలు, వజ్రాల వరకు ప్రతి వస్తువుకు సంబంధించి అనేక కంపెనీలు, ఫ్యాక్టరీలు వెలిశాయి. వాటి ఉత్పత్తులు, సేవల గురించి వినియోగదారులకు తెలియజేసేందుకు నేటి ఆధునిక ప్రపంచంలో ప్రత్యేక వెబ్‌సైట్‌ల రూపకల్పన అనివార్యమవుతుంది. ఈ నేపథ్యంలో వీక్షకులకు పూర్తిస్థాయి సమాచారాన్ని ఆకర్షణీయంగా, సరళంగా మౌస్‌ క్లిక్‌ల ద్వారా అందించడంలో వెబ్‌ డిజైనింగ్‌ కీలకపాత్ర పోషిస్తుంది. విస్తృత కెరీర్‌ అవకాశాలను అందిస్తున్న ఈ కెరీర్ పై ఫోకస్‌..

వెబ్‌డిజైనర్‌వెబ్‌సైట్‌ రూపకల్పనలో యూజర్‌(వినియోగదారుడు) ఇంటర్‌ఫేస్‌ డిజైన్‌కు బాధ్యత వెబ్‌ డిజైనర్‌దే. వెబ్‌సైట్‌కు సంబంధించిన లోగో, బ్యానర్లు, ప్రకటనలు, ముఖ్య సమాచారం ఇవన్నీ ప్రత్యేకంగా తీర్చిదిద్దడంలో వెబ్‌డిజైనర్‌ బాధ్యత వహించాలి. వినియోగదారుడికి ఆసక్తి కలిగించేలా వెబ్‌సైట్‌ను రూపొందించాలి. డిజైన్‌ను మెచ్చి ఎక్కువ లింక్స్‌ను క్లిక్‌ చేసేలా చూడాలంటే ఆకర్షణీయంగా డిజైన్‌ ఉండాలి. కావాల్సిన సమాచారమంతా వెబ్‌ పేజీల్లో నిక్షిప్తం చేయడానికి మార్కప్‌ లాంగ్వేజెస్‌పై పట్టుండాలి. కనీసం హెచ్‌టీఎంఎల్‌పై పూర్తిస్థాయి అవగాహన తప్పనిసరి. స్టాటిక్‌ వెబ్‌పేజీల్లో సమాచారమంతా ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. అవసరమైనప్పుడు మాత్రం మాన్యువల్‌గా డిజైనర్‌ మార్పులు చేస్తారు. అదే డైనమిక్‌ వెబ్‌సైట్‌లో వినియోగదారుడు ఇచ్చిన ఇన్‌పుట్‌ ప్రకారం సమాచారం మారుతూ ఉంటుంది.

వెబ్‌సైట్‌ ఆకర్షణీయంగా..ఇమేజెస్‌, సమాచారంలో నాణ్యతతేలిక పదాలతో సులభంగా అర్ధమయ్యేలా ఉండటం...యూజర్‌ ఫ్రెండ్లీగా ఉండాలి. అంటే దాన్ని క్లిక్‌ చేస్తున్నవారు సులువుగా ఆపరేట్‌ చేయగలగాలి. సెర్చ్‌ ఇంజిన్స్‌కు ఫ్రెండ్లీగా ఉండాలి... బ్యాక్‌ గ్రౌండ్‌, ఇమేజెస్‌, టెక్స్ట్‌ మ్యాటర్స్‌కు రంగుల కాంబినేషన్‌ బాగుండాలి... వెబ్‌ పేజీలు వేగంగా డౌన్‌లోడ్‌ కావాలి...అన్ని పేజీలూ ఒకే విధంగా ఉండాలి...నావిగే షన్‌ (రూట్‌ మ్యాప్‌) తేలికగా ఉండాలి.

బాధ్యతలు:సమాచారం అప్‌డేట్‌, రోజువారీ నిర్వహణ చేయూలి. డిజైన్‌ ఫంక్షనాలిటీకోసం కావాల్సిన ఇన్‌పుట్‌ అండ్‌ సపోర్ట్‌ను అందించాలి. క్లైంట్‌ అవసరాలు అర్థం చేసుకొని దానికి కావాల్సిన సమాచారం సేకరించి, కోరిన విధంగా వెబ్‌సైట్‌ డిజైన్‌ చేయాలి. బ్యానర్లు, టెంప్లేట్స్‌, లోగోలు అన్నీ డిజైన్‌ చేయూలి. డిజిటల్‌ ఇమేజ్‌ కోసం ఫొటోషాప్‌, ఫ్లాష్‌ టూల్స్‌ వినియోగంపై అవగాహన ఉండాలి.

అర్హతలు:
  • వెబ్‌ డిజైనర్‌గా కెరీర్‌ ప్రారంభించడానికి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉండాలి.
  • క్లైంట్లతో నేరుగా మాట్లాడటానికి మంచి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ తప్పనిసరి.
  • డిజైనింగ్‌ కాన్సెప్ట్‌పై పట్టుండాలి. సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ టెక్నిక్స్‌పై అవగాహన ఉండాలి.
  • వెబ్‌ డిజైనింగ్‌, డెవలప్‌మెంట్‌లో సరికొత్త పోకడలను తెలుసుకోవాలి.
  • హెచ్‌టీఎంఎల్‌, డీహెచ్‌టీఎంఎల్‌, సీఎస్‌ఎస్‌, జావా స్క్రిప్ట్‌, డ్రీమ్‌ వీవర్‌, ఫ్లాష్‌, ఫ్లాష్‌ యాక్షన్‌ స్క్రిప్ట్స్‌, ఫొటోషాప్‌పై పట్టుండాలి.
  • సర్వర్‌ సైడ్‌ స్క్రిప్ట్స్‌, డేటాబేస్‌ హ్యాండ్లింగ్‌పై ప్రాథమిక పరిజ్ఞానం తప్పనిసరి.
  • మైక్రోసాఫ్ట్‌ ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌, ఒపెరా, ఫైర్‌ఫాక్స్‌...లాంటి వెబ్‌ బ్రౌజర్లలో వెబ్‌ అప్లికేషన్‌ కస్టమరైజ్‌ చేయగలగాలి.
ఫ్లాష్‌ డిజైనర్‌ అండ్‌ గేమ్‌ స్పెషలిస్ట్‌ వెబ్‌సైట్‌ వీక్షకుల కంటికి ఇంపుగా, ఆకర్షణీయంగా యూనిమేషన్స్‌ను తీర్చిదిద్దాలి. మాక్రో మీడియూ ఫ్లాష్‌, యూక్షన్‌ స్క్రిప్టింగ్‌ ఉపయోగించి చాలా రకాల 2డీ, 3డీ డిజైన్లను అభివృద్ధి చేయాలి. ప్రొఫెషనల్‌ ఉత్పత్తుల డెమోలు, ప్రకటనలు, యూనిమేషన్లలో ఫ్లాష్‌ యూనిమేటర్ల సేవలు అనివార్యం. సృ జన, డిజైన్‌ ప్రత్యేకంగా అర్ధం చేసుకోవడం, వ్యాపార ఆలోచనలకు యూనిమేషన్స్‌/ప్రెజెంటేషన్స్‌ ద్వారా ప్రతిరూపమివ్వడం వీరి చేయూల్సిన పని. ఆన్‌లైన్‌ ఆటలు, కార్పొరేట్‌ ఇంట్రోలు, ఉత్పత్తులు అర్ధమయ్యేలా వివరంగా చెప్పడానికి మంచి రూపాన్నివ్వడం ఇవన్నీ యూక్షన్‌ స్క్రిప్ట్‌ ప్రోగ్రామర్ల పనులు. ఇందులో రాణించడానికి యూక్షన్‌ స్క్రిప్ట్‌ 2, యూక్షన్‌ స్క్రిప్ట్‌ 3, షేరెబుల్‌ కంటెంట్‌ ఆబ్జెక్ట్‌ రిఫరెన్స్‌ మోడల్‌(ఎస్‌సీఓఆర్‌ఎం) బాగా రావాలి. అదిరిపోయేలా ఆటల(గేమ్స్‌)ను అభివృద్ధి చేసి వెబ్‌సైట్లో పెట్టడం యూనిమేటర్ల ముఖ్య విధి. గేమ్‌ డెవలపర్లు క్లైంట్లు, ఇన్‌ హౌస్‌ టీంలను హ్యాండిల్‌ చేయూలి. ఆన్‌లైన్‌ ఆటల అభివృద్ధికి అద్భుతమైన యూనిమేషన్లు సృష్టించాలంటే ఎక్కువ సంఖ్యలో టూల్స్‌ వాడుకలో ప్రావీణ్యం ఉండాలి.

అర్హతలు:ఏదైనా విభాగంలో డిగ్రీ. ప్రస్తుతం వాడుకలో ఉన్న వెబ్‌ ప్రమాణాలు, యూజర్‌ ఇంటర్ఫేస్‌ తెలిసుండాలి. హెచ్‌టీఎంఎల్‌/ఎక్స్‌హెచ్‌టీఎంఎల్‌, జావా స్క్రిప్ట్‌, సీఎస్‌ఎస్‌, మాక్రో మీడియూ ఫ్లాష్‌, యూక్షన్‌ స్క్రిప్ట్‌, మాక్రో మీడియూ బ్రీజ్‌లపై లోతైన పరిజ్ఞానంతోపాటు వాటిలో పనిచేసిన అనుభవమూ ఉండాలి. 2డీ, 3డీ యూనిమేషన్‌ స్కిల్స్‌పై పట్టుండాలి. ఊహించడం, ఊహకు ప్రతిరూపమిచ్చే సామర్థ్యం ఉండాలి. కాన్సెప్ట్‌ తయూరుచేయడం, విజువలైజేషన్‌ స్కిల్స్‌ బాగుండాలి. మల్టీ మీడియూ ప్యాకేజీలపై పూర్తిస్థాయి పరిజ్ఞానం ఉండాలి. కోరెల్‌ డ్రా, సౌండ్‌ఫోర్జ్‌, ఫ్లాష్‌ యూక్షన్‌ స్క్రిప్టింగ్‌ (ఏఎస్‌ 2, ఏఎస్‌ 3), అంతర్జాతీయ క్లైంట్లతో యూనిమేటర్‌గా పనిచేసిన అనుభవం ఉంటే అదనపు ఆకర్షణ. మంచి అనలెటికల్‌ స్కిల్స్‌, ఆప్టిట్యూడ్‌ ఉండాలి. సొంతంగా ప్రొజెక్ట్‌ను నిర్వహించే సామర్థ్యం, బృంద సభ్యులతో మమేకమవ్వడం అలవాటు కావాలి. ముఖ్యంగా ఆన్‌లైన్‌ ఆటలంటే ఉత్సాహం ఉరకలేయాలి.

బాధ్యతలు:క్లైంట్‌తో మమేకమై వాళ్ల అవసరాలను విశ్లేషించడం, నాణ్యమైన పనితో పాటు సలహాలను చేర్చి కొత్త మార్గాల్లో గేమ్‌ అభివృద్ధి చేసి సమర్థంగా ప్రోగ్రామింగ్‌ చేర్చాలి. వీడియో, ఆడియో ఎడిటింగ్‌ చేయూలి. సులువుగా కొత్త టెక్నాలజీ ఉపయోగించడం, విజువలైజేషన్‌, ఎనాలసిస్‌, డిజైన్‌, డెవలప్‌మెంట్‌, టెస్టింగ్‌ దశల్లోనే ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయూలి. కనులకు ఇంపుగా గేమ్స్‌, యూనిమేషన్స్‌ చేయూలి. ఆడియన్స్‌ బాగా అనుభూతి చెందడానికి ఫ్లాష్‌, పీహెచ్‌పీ లాంటి టెక్నాలజీలపై పనిచేసేవారితో కూడా కలిసి పనిచేయూల్సి ఉంటుంది.

వెబ్‌మాస్టర్‌ అండ్‌ పోర్టల్‌ మేనేజర్‌వెబ్‌ ఆర్కిటెక్ట్‌, వెబ్‌ డెవలపర్‌, వెబ్‌సైట్‌ ఆథర్‌, వెబ్‌సైట్‌ అడ్మినిస్ట్రేటర్‌ ఇవన్నీ వెబ్‌మాస్టర్‌కు పర్యాయపదాలు. వెబ్‌సైట్‌ డిజైన్‌, అభివృద్ధి, మార్కెటింగ్‌ లేదా నిర్వహణ ఇవన్నీ ఇతడి బాధ్యతలే. వెబ్‌ ఆపరేషన్‌కు సంబంధించి అన్ని అంశాల్లోనూ బాధ్యత వహిం చాల్సింది వెబ్‌మాస్టర్‌. ఇంటర్నెట్‌ స్పెషలిస్ట్‌, నెట్‌వర్క్‌/వెబ్‌ ఇంజనీర్‌, వెబ్‌ అడ్మినిస్ట్రేటర్‌, వెబ్‌ అప్లికేషన్‌ ఇంజనీర్‌.. వంటి పేర్లతో వెబ్‌మాస్టర్‌ను పిలుస్తారు. పీెహచ్‌పీ, కోల్డ్‌ఫ్యుజన్‌, పెర్ల్‌, జావాస్క్రిప్ట్‌.. వంటి స్క్రిప్టింగ్‌ లాంగ్వేజ్‌లపై పట్టు, వెబ్‌సర్వర్స్‌ కాన్ఫిగరేషన్‌లో ప్రావీణ్యం ఉండాలి. వెబ్‌సైట్‌ వీక్షకుల యూక్సెస్‌, అపియరెన్స్‌, నావిగేషన్‌ విషయూల్లో బాధ్యత వహించాలి. వెబ్‌ పోర్టల్‌ మేనేజర్‌ వృత్తి కూడా దాదాపు వెబ్‌మాస్టర్‌ లాంటిదే అయినప్పటికీ స్వల్ప తేడాలుంటాయి. భిన్న వెబ్‌సైట్ల సమాచారాన్ని వెబ్‌సైట్లో వెబ్‌పోర్టల్‌లో పెట్టాలి. వెబ్‌పోర్టల్‌లో మాట్రిమెునీ, ఈమెయిల్స్‌, న్యూస్‌, స్పోర్ట్స్‌, షాపింగ్‌, ట్రావెల్స్‌ అండ్‌ టూర్స్‌ మేనేజ్‌మెంట్‌, స్టాక్‌ ప్రెసైస్‌ అండ్‌ బిజినెస్‌ డీటైల్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌.. వంటి సర్వీసులు అందుబాటులో ఉంటాయి. గూగుల్‌, యూహూ, రెడిఫ్‌లు ఇందుకు ఉదాహరణలు.

అర్హతలు:వెబ్‌సైట్‌ డెవలప్‌మెంట్‌పై మంచి పరిజ్ఞానం. కొత్త డిజైన్లు, ఐడియూలు, వెబ్‌ లాజిక్‌, వెబ్‌ స్ఫేర్‌ అడ్మినిస్ట్రేషన్‌లో అనుభవం, కోడింగ్‌ (హెచ్‌టీఎంఎల్‌, పీహెచ్‌పీ, డాట్‌నెట్‌, ఏఎస్పీ, డేటాబేస్‌, జావాస్క్రిప్ట్‌..పరిజ్ఞానం), నెట్‌వర్క్‌ ట్రబుల్‌షూటింగ్‌తో యునిక్స్‌, లైనక్స్‌ అడ్మినిస్ట్రేషన్‌, సీఏ సైట్‌మైండర్‌లో పని అనుభవం, వెబ్‌ డిజైన్‌ స్కిల్స్‌, టాగ్‌ లెవె ల్‌లో హెచ్‌టీఎంల్‌ పరిజ్ఞానం, డీహెచ్‌టీఎంఎల్‌, కామ్‌, క్లైంట్‌ సైడ్‌ జావా స్క్రిప్టింగ్‌లో అనుభవం, అన్ని ప్లాట్‌ఫాంల్లో బ్రౌజర్‌ కంపేటబిలిటీ విషయూల్లో పరిజ్ఞానం. ఇమేజ్‌ కన్వర్షన్‌, ఫొటోషాప్‌, అడాబ్‌ ఇమేజ్‌ ఇవన్నీ రావాలి.

బాధ్యతలు:వెబ్‌సైట్‌ తయూరీ, నిర్వహణ రెంటినీ సమర్థంగా నిర్వహించాలి. కొత్త విషయూలు చేర్చడం, పాతవి తొలగించాలి. సెర్చ్‌ఇంజిన్‌ను మానిటర్‌ చేయూలి. ట్రాకింగ్‌ లింక్స్‌ ఇవ్వాలి. ఎస్‌ఎస్‌ఎల్‌ సర్టిఫికెట్లు ఇన్‌స్టాల్‌ చేయూలి. వెబ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కాంపొనెంట్లు, బిజినెస్‌ అప్లికేషన్లు ఒకదానికొకటి ఇంటిగ్రేట్‌ చేయూలి.యూఆర్‌ఎల్‌ రీడెరైక్షన్లను మేనేజ్‌చేయూలి. వెబ్‌సైట్‌ కాంక్యురెన్సీ, సెక్యూరిటీని మేనేజ్‌ చేయూలి.

ప్రవేశం: వెబ్‌ డిజైనింగ్‌కు సంబంధించి ఐఐటీల నుంచి ఎన్‌ఐఐటీ వంటి పలు ప్రైవేట్‌ ఇన్‌స్టిట్యూట్‌లు కూడా వివిధ రకాల కోర్సులను ఆఫర్‌ చేస్తున్నాయి. వివరాలు..

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌-అహ్మదాబాద్‌, గాంధీ నగర్‌, బెంగళూర్‌ క్యాంపస్‌లు.వెబ్‌సైట్‌: http://www.nid.edu

ఐఐటీ-కాన్పూర్‌
కోర్సు:
 మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌
వెబ్‌సైట్‌: http://www.iitk.ac.in

ఐఐటీ-గౌహతి
కోర్సు:
 మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌
వెబ్‌సైట్‌: http://www.iitg.ac.in

లయోలా కాలేజ్‌, చెన్నై.
కోర్సు:
 బీఎస్సీ(విజువల్‌ కమ్యూనికేషన్‌)
అర్హత: 10+2 
కోర్సు: ఎంఎస్సీ(విజువల్‌ కమ్యూనికేషన్‌):
అర్హత: బీఎస్సీ(విజువల్‌ కమ్యూనికేషన్‌)/బీఎస్సీ(కంప్యూటర్స్‌)/బీఎఫ్‌ఏ
వెబ్‌సైట్‌: http://www.loyolacollege.edu

ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ -కాంచీపురం, తమిళనాడు.
కోర్సు:
 బీఎస్సీ(విజువల్‌ కమ్యూనికేషన్‌)
అర్హత: 60 శాతం మార్కులతో 10+2 
కోర్సు: ఎంఎస్సీ(విజువల్‌ కమ్యూనికేషన్‌):
అర్హత: 60 శాతం మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్‌.
వెబ్‌సైట్‌: www.srmuniv.ac.in

సత్యభామ యూనివర్సిటీ-చెన్నై
.
కోర్సు: బీఎస్సీ(విజువల్‌ కమ్యూనికేషన్‌)
అర్హత: 60 శాతం మార్కులతో 10+2 
వెబ్‌సైట్‌: http://www.sathyabamauniversity.ac.in/

అమిటీ స్కూల్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్‌.

కోర్సు: ఎంఎస్సీ(విజువల్‌ కమ్యూనికేషన్‌):
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌.
వెబ్‌సైట్‌: http://www.amity.edu

ఇంటర్నేషనల్‌ అకాడెమీ ఆఫ్‌ కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌, హైదరాబాద్‌ 
(జేఎన్‌టీయూ-సౌజన్యంతో నిర్వహిస్తోంది).
కోర్సు: ఎంఎస్సీ(మల్టీమీడియా)
అర్హత: 55 శాతం మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్‌.
వెబ్‌సైట్‌: http://www.iacg.info/

అన్నా యూనివర్సిటీ, చెన్నై. 
కోర్సు:
 ఎంఎస్సీ(ఎలక్ట్రానిక్‌ మీడియా): 
అర్హత: విజువల్‌ కమ్యూనికేషన్‌/మాస్‌ కమ్యూనికేషన్‌/జర్నలిజంలో డిగ్రీ.
వెబ్‌సైట్‌: http://www.annauniv.edu/

యూనివర్సిటీ ఆఫ్‌ మద్రాస్‌, చెన్నై.
కోర్సు:
 మాస్టర్‌ ఆఫ్‌ జర్నలిజం ఆన్‌లైన్‌ మీడియా
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌
వెబ్‌సైట్‌: http://www.unom.ac.in/

ఉపాధ్యాయ కొలువుతో... ఉన్నతమైన కెరీర్!

సమాజంలో ఉపాధ్యాయులంటే ఎనలేని గౌరవం. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ.. అంటూ తల్లిదండ్రుల తర్వాత స్థానం ఉపాధ్యాయులకిచ్చారు. ఈ వృత్తి.. సమాజంలో ఓ బృహత్తర బాధ్యత. ఉపాధి కల్పించే మార్గం కూడా. ఫలితంగా ఈ వృత్తిపై మక్కువ చూపే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఇటు ప్రభుత్వ రంగంలో వేల సంఖ్యలో ఖాళీలు భర్తీ చేస్తుండగా.. అటు ప్రైవేట్ రంగంలోనూ అవకాశాలకు ఆకాశమే హద్దుగా ఉంటోం ది. ఇటీవలి కాలంలో విద్యా రంగం విస్తరిస్తుండడం.. అమల్లోకి వచ్చి న విద్యాహక్కు చట్టం.. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో మరో ‘డీఎస్సీ’కి రంగం సిద్ధం చేస్తున్న నేపథ్యంలో.. కెరీర్ ఆప్షన్‌గా టీచింగ్ ప్రొఫెషన్‌పై ఫోకస్..

ప్రవేశం.. ఇలా:
ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించడానికి మార్గాలెన్నో. పదో తరగతి మొదలు.. డిగ్రీ అర్హతగా పలు విభాగాల్లో ఉపాధ్యాయ శిక్షణ కోర్సులు ఉన్నాయి. వీటిని పూర్తి చేయడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్, పీఈటీలుగా కెరీర్ ప్రారంభించవచ్చు. 

మాంటిస్సోరి ట్రైనింగ్:ప్రీ-ప్రైమరీ స్థాయి (3-5 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారులకు) లో బోధించేందుకు ఉద్దేశించిన కోర్సు మాంటిస్సోరి ట్రైనింగ్. చిన్నారుల్లో సృజనాత్మకతను వెలికితీయడం, బొమ్మల సహాయంతో వారిలో నైపుణ్యాలను పెంచేందుకు అవసరమయ్యే బోధనా పద్ధతుల్లో తర్ఫీదునివ్వడం ఈ కోర్సు ప్రత్యేకత. ప్రస్తుతం ఐదు దశల్లో ఈ కోర్సు ఉంది. అవి.. సర్టిఫికెట్ ఇన్ మాంటిస్సోరి ట్రైనింగ్; సర్టిఫికెట్ ఇన్ మాంటిస్సోరి ట్రైనింగ్(ఎర్లీ చైల్డ్‌హుడ్); డిప్లొమా ఇన్ మాంటిస్సోరి ట్రైనింగ్; హయ్యర్ డిప్లొమా ఇన్ మాంటిస్సోరి ట్రైనింగ్; ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ మాంటిస్సోరి ట్రైనింగ్; వీటిలో సర్టిఫికెట్ కోర్సులో ప్రవేశానికి కనీస అర్హత పదో తరగతి. ఆ తర్వాత ఒక్కో దశ శిక్షణ పూర్తి చేసుకుంటూ డిగ్రీతో సమానమైన ప్రొఫెషనల్ డిప్లొమా వరకు చేరుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఈ కోర్సును పూర్తి చేస్తే అవకాశాలు అపారమనేది నిస్సందేహం. గతంలో నగరాలకు పరిమితమైన కిండర్‌గార్టెన్‌లు ఇప్పుడు టైర్-2 పట్టణాల్లోనూ విస్తరిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 20వేలకు పైగా కిండర్‌గార్టెన్‌లు, నర్సరీ స్కూళ్లు ఉన్నాయి. వీటిల్లో అవకాశాలు పుష్కలం. ప్రతిభ, అనుభవం ఆధారంగా నెలకు రూ.5-10 వేలు వరకు వేతనం ఇస్తున్నారు. హైదరాబాద్‌లోని ఆంధ్ర మహిళా సభ, మాంటిస్సోరి-హైదరాబాద్ ఇన్‌స్టిట్యూట్ (http://www.indianmontessoricentre.org)ల్లో సంబంధిత కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 

డీఈడీ:ఇంటర్మీడియెట్‌తోనే ప్రభుత్వ ఉద్యోగాన్ని అందించే కోర్సు.. డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఈడీ). ఈ కోర్సులో ప్రవేశం కోసం డైట్ సెట్ రాయూలి. వ్యవధి: రెండేళ్లు. ప్రథమ సంవత్సరంలో.. విద్యామనో విజ్ఞాన శాస్త్రం, విద్యాతత్వ శాస్త్రం, జనరల్ అంశాలైన పూర్వ ప్రాథమిక విద్య-ప్రస్తుత విద్య, ఆరోగ్యం, విద్య- కంప్యూటర్ ఎడ్యుకేషన్, వయోజన విద్య తదితర సబ్జెక్టులు ఉంటాయి. రెండో సంవత్సరంలో.. తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ సబ్జెక్టుల బోధన పద్ధతులను బోధిస్తారు. కోర్సులో భాగంగా.. టీచింగ్ ప్రాక్టీస్ 75 రోజులు ఉంటుంది. ఇందులో 35 రోజులు ప్రాథమిక పాఠశాలలు, 10 రోజులు ప్రాథమికోన్నత పాఠశాలల్లో బోధించాలి. 30 రోజులపాటు పాఠశాలల్లో ఇంటర్న్‌షిప్ ఉంటుంది. రాష్ట్రంలో జిల్లాకు ఒకటి చొప్పున మొత్తం 23 ప్రభుత్వ ‘డైట్’ కళాశాలలు ఉన్నారు. ప్రతి కళాశాలకు 100 సీట్లు. ప్రైవేట్‌లో సుమారు రెండు వందల కళాశాలల్లో.. దాదాపు 10 వేలకు పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. డీఈడీ ఉత్తీర్ణులు ప్రభుత్వం నిర్వహించే ఉపాధ్యాయ నియామక పరీక్ష-డీఎస్సీలో సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్‌జీటీ) పోస్టుకు అర్హులు. 2012 నుంచి ఎస్‌జీటీ పోస్టులను కేవలం డీఈడీ అభ్యర్థులతోనే భర్తీ చేయాలనే నిర్ణయం ఈ కోర్సు చేసిన వారికి వరంగా మారింది. కారణం డీఎస్సీ ద్వారా భర్తీ చేసే పోస్టుల్లో ఎస్‌జీటీ పోస్టుల సంఖ్యే ఎక్కువగా ఉండటం.. డీఈడీ అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉండటంతో.. ఈ కోర్సు పూర్తిచేసిన వారికి ఎస్‌జీటీ పోస్ట్ ఖాయమని చెప్పొచ్చు.

ఎడ్‌సెట్:గ్రాడ్యుయేషన్ అర్హతతో ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించేందుకు అవకాశం కల్పిస్తున్న కోర్సు.. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ). వ్యవ ధి సంవత్సరం. ఈ కోర్సులో ప్రవేశానికి ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఎడ్‌సెట్) రాయాలి. డిగ్రీలో చదివిన ఆప్షనల్ సబ్జెక్టుల ఆధారంగా ఎడ్‌సెట్ ఉంటుంది. విద్యాతత్వ శాస్త్రం, విద్యా మనో విజ్ఞాన శాస్త్రం, పాఠశాల పరిపాలన-నిర్వహణ, కమ్యూనికేటివ్ ఇంగ్లిష్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్, ఎడ్యుకేషన్ టెక్నాలజీతోపాటు గ్రాడ్యుయేషన్ స్థాయిలో చదివిన గ్రూప్ సబ్జెక్టుల్లో రెండింటికి సంబంధించిన బోధన పద్ధతులు బోధిస్తారు. శిక్షణ సమయంలో 45 రోజులపాటు పాఠశాలకు వెళ్లి బోధన (ప్రాక్టికల్స్) చేయూలి. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో కలిపి దాదాపు 615 కాలేజీల్లో దాదాపు 65 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. బీఈడీ ఉత్తీర్ణులు.. ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయ పోస్టులకు అర్హులు. వీరిని స్కూల్ అసిస్టెంట్‌లుగా వ్యవహరిస్తారు. డీఎస్సీ ద్వారా ఎస్‌ఏ ఎంపిక జరుగుతుంది. 

ఫిజికల్ ఎడ్యుకేషన్:
ఎడ్యుకేషన్‌లో భాగంగా ఆటలు, వ్యాయామం వంటి ఫిజికల్ కార్యకలాపాలకు ప్రాధాన్యం ఉండాలి. అందుకే ప్రభు త్వం ప్రతి పాఠశాలకు తప్పనిసరిగా ప్లే గ్రౌండ్ ఉండాలని నిబంధన విధించింది. తదనుగుణంగా ప్రతి పాఠశాలలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్(పీఈటీ) ఉంటాడు. పీఈటీగా కెరీర్ ప్రారంభించాలంటే సంబంధిత కోర్సులు చేయాలి. మనరాష్ట్రంలో ఇందుకోసం రెండు రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అవి.. అండర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్(యూజీడీపీఈడీ)-అర్హత: ఇంటర్మీడియెట్ లేదా తత్సమానం; బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్(బీపీఈడీ)అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్. వీటిలో ప్రవేశానికి ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(పీఈసెట్) రాయాలి. రాష్ర్టంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో కలిపి 13 కళాశాలల్లో ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బీపీఈడీ చేసిన అభ్యర్థులు... హైస్కూల్స్‌లో ిపీఈటీలుగా కెరీర్ ప్రారంభించవచ్చు. డీఎస్సీ ద్వారా పీఈటీల ఎంపిక ఉంటుంది. 

లాంగ్వేజ్ పండిట్స్: తెలుగు, హిందీ వంటి లాంగ్వేజ్ సబ్జెక్టులను బోధించడానికి కొన్ని ప్రత్యేక స్కిల్స్ ఉండాలి. అటువంటి స్కిల్స్‌ను పెంపొందించడానికి ఉద్దేశించినవి లాంగ్వేజ్ పండిట్ కోర్సులు. వీటిల్లో ప్రవేశానికి లాంగ్వేజ్ పండిట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఎల్‌పీసెట్) రాయాలి. ప్రస్తుతం తెలుగు, హిందీ, ఉర్దూ భాషల్లో పండిట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. తెలుగు పండిట్-అర్హత: బీఏ (తెలుగు లిటచరేచర్/ఓరియెంటల్ లాంగ్వేజ్-తెలుగు/తెలుగు ఆప్షనల్ సబ్జెక్ట్/ఎంఏ-తెలుగు). హిందీ పండిట్: హిందీ ఆప్షనల్‌తో డిగ్రీ లేదా బ్యాచిలర్ ఆఫ్ ఓరియెంటల్ లాంగ్వేజ్-హిందీ/దక్షిణ భారత హిందీ ప్రచార సభ ప్రవీణ లేదా హిందీ ప్రచార సభ-హైదరాబాద్ విద్వాన్ కోర్సు లేదా రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు ఉన్న హిందీ (బీఏ స్థాయి)/తత్సమానం లేదా ఎంఏ(హిందీ). లాంగ్వేజ్ పండిట్ కోర్సులను చేసిన అభ్యర్థులు.. హైస్కూల్స్‌లో లాంగ్వేజ్ పండిట్‌లుగా చేరొచ్చు. తెలుగులో కోర్సు పూర్తి చేసిన వారిని టీపీటీలుగా, హిందీ అభ్యర్థులను హెచ్‌పీటీలుగా పిలుస్తారు. వీరిని కూడా డీఎస్సీ ద్వారా ఎంపిక చేస్తారు. 

స్పెషల్ ఎడ్యుకేషన్:గత దశాబ్ద కాలంగా ఆదరణ పొందుతున్న విభాగం స్పెషల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్. మానసిక, శారీరక వైకల్యాలతో బాధపడుతూ,సాధారణ పిల్లలతో సమానంగా పోటీ పడలేని చిన్నారులకు అవసరమయ్యే బోధనా పద్ధతుల్లో శిక్షణనిచ్చేదే స్పెషల్ ఎడ్యుకేషన్. ప్రస్తుతం ఈ కోర్సులో మెంటల్ రిటార్డేషన్, హియరింగ్,విజువల్, ఆటిజం, ఇంపెయిర్‌మెంట్, లెర్నింగ్ డిజబిలిటీ విభాగాల్లో డీఈడీ, బీఈడీ, ఎంఈడీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. స్పెషల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్‌ను ప్రత్యేకంగా పరిగణించిన ప్రభుత్వం ఇందుకు సంబంధించిన కరిక్యులం రూపకల్పన, కళాశాలల గుర్తింపు, పర్యవేక్షణ బాధ్యతలను రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు అప్పగించింది. ఈ కోర్సులను పూర్తి చేస్తే దేశ, విదేశాల్లో మెరుగైన అవకాశాలు లభిస్తున్నాయి. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, వివిధ స్వచ్ఛంధ సంస్థలు, ట్రస్టుల కింద నడిచే పాఠశాలలు, సర్వశిక్షా అభియాన్ పరిధిలోని పాఠశాలల్లో టీచర్‌గా; వివిధ ఆస్పత్రులు, రిహాబిలిటేషన్ సెంటర్లలో ఎడ్యుకేషన్ ఇన్‌స్ట్రక్టర్‌గా, రెగ్యులర్ ప్రీస్కూళ్లు, వివిధ పాఠశాలల్లో ప్రత్యేక విద్యార్థులకు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా సేవలందించవచ్చు. ఈసీఎస్‌ఈ/సీఎస్‌ఈల్లో రీసెర్చ్ ప్రాజెక్ట్‌ల్లో పనిచేయొచ్చు. అంగన్‌వాడీ పాఠశాలలు, ప్రైవేటు ప్రీ స్కూళ్లలో ప్రత్యేక శిక్షణ అవసరమైన చిన్నారులకు కోఆర్డినేటర్‌గా అవకాశాలు లభిస్తాయి. సొంతంగా ప్రీ స్కూల్‌ను నిర్వహించవచ్చు. జీతభత్యాలు ప్రారంభంలో నెలకు రూ.8000 - 12000 వరకు ఉంటాయి. రెండు, మూడేళ్ల అనుభవంతో నెలకు రూ.25000 వరకు అందుకోవచ్చు. మన రాష్ట్రంలో.. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది మెంటల్లీ హ్యాండీక్యాప్డ్ - సికింద్రాబాద్; స్వీకార్ రిహాబిలిటేషన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ హ్యాండీక్యాప్డ్ -సికింద్రాబాద్; ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం (www.andhrauniversity.info); శ్రీ పద్మావతి మహిళ విశ్వవిద్యాలయం-తిరుపతి (www.spmvv.ac.in); కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్-ఆంధ్ర మహిళ సభ-హైదరాబాద్ (www.andhramahilasabha.org.in) బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) కోర్సును అందిస్తున్నాయి. ఠాగూర్ హరిప్రసాద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ రిహాబిలిటేషన్ ఫర్ ది మెంటల్లీ హ్యాండీక్యాప్డ్, దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ ట్రైనింగ్ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ ఫర్ హ్యాండీక్యాప్డ్ తదితర 24 ఇన్‌స్టిట్యూట్‌లలో స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

అవకాశాలు:ప్రస్తుతం ఉపాధ్యాయ వృత్తి ఆకర్షణీయమైన ఉపాధి మార్గంగా మారుతోంది.ప్రభుత్వం తరచూ ‘డీఎస్సీ’ నోటిఫికేషన్ ద్వారా వేలల్లో టీచర్ పోస్టులను భర్తీ చేస్తుండటం ప్రధాన కారణం. అంతేకాక ఉద్యోగ భద్రత, కొత్త పీఆర్‌సీ ప్రకారం ప్రారంభంలోనే ఐదంకెల జీతం అందుకునే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయ విద్యాలయాలు, వివిధ ప్రభుత్వ సంస్థల ఆధీనంలో ఉండే స్కూల్స్‌లో కూడా అవకాశాలు ఉంటాయి. ప్రైవేట్ రంగం రోజురోజుకు విస్తరించి చిన్న పట్టణాల్లోనూ కాన్వెంట్‌లు, నర్సరీలు, కార్పొరేట్ విద్యాసంస్థలు ఏర్పాటవుతుండడం కూడా వీరికి కలిసొచ్చే అంశం. ప్రతిభ, అనుభవం ఆధారంగా ప్రైవేట్ సంస్థలు నెలకు దాదాపు రూ.15- రూ.20 వేల వరకు చెల్లిస్తున్నాయి.

ప్రమోషన్లు:ప్రభుత్వ ఉపాధ్యాయులుగా.. ఎస్‌జీటీ, ఎస్‌ఏగా కేడర్‌లో కెరీర్ ప్రారంభించి, ఉన్నత విద్యనభ్యసిస్తే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు. బీఈడీ/ఎంఈడీ చేసి స్కూల్ అసిస్టెంట్‌గా ప్రమోషన్ పొందొచ్చు. సీనియూరిటీతో మండల విద్యాధికారి, డిప్యూటీ డీఈవో స్థాయికీ చేరుకోవచ్చు. పీజీ పూర్తిచేస్తే.. జూనియర్ లెక్చరర్ స్థాయికి చేరుకోవచ్చు.

టెట్ తప్పనిసరి: గతంలో మాదిరిగా కేవలం ఉపాధ్యాయ శిక్షణ కోర్సు పూర్తి చేస్తే సరిపోదు. దాంతోపాటు రాష్ట్ర స్థాయిలో టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్), కేంద్ర స్థాయిలోని కేంద్రీయ విద్యాలయాలు, జవహార్ నవోదయ విద్యాలయాలు మొదలైన పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా నియమితులవ్వాలంటే .. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటీఈటీ) స్కోర్ తప్పనిసరి. టెట్ మార్కులకు టీచర్స్ ఎంపిక ప్రక్రియలో 20 శాతం వెయిటేజీ లభిస్తుంది. ఈ రెండు పరీక్షల స్కోర్‌కు ఏడేళ్ల వ్యాలిడిటీ ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఉపాధ్యాయ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే బీఎడ్/డీఎడ్/ భాషా పండితులకు టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి.

రెండు పేపర్లుగా ఉండే టెట్..పేపర్-1: ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించాలనుకునే టీచర్లు ఈ పేపర్ రాయాలి.
పేపర్ -2: ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు బోధించాలనుకునే టీచర్లు ఈ పేపర్ రాయాలి.
టెట్‌లో జనరల్ కేటగిరీ అభ్యర్థులు 60 శాతం, బీసీ అభ్యర్థులు 50 శాతం, పీహెచ్‌సీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 40 శాతం మార్కులు సాధిస్తే ఉత్తీర్ణులైనట్లే. సీటీఈటీలో 60 శాతం మార్కులు పొందితే ఉత్తీర్ణత సాధించినట్లు.

కావలసిన లక్షణాలు:
  1. విషయాన్ని ప్రభావవంతంగా వివరించే కమ్యూనికేషన్ స్కిల్స్
  2. మూస ధోరణి కాకుండా విభిన్న పద్ధతుల్లో బోధించడం
  3. ప్రయోగాలకు ప్రాధాన్యం ఇవ్వడం
  4. పాజిటివ్ దృక్పథం కలిగి ఉండడం
  5. సబ్జెక్ట్ పరంగా వస్తున్న మార్పులను గమనించడం
  6. ఆర్గనైజింగ్ స్కిల్స్
  7. ఉన్నత విద్య ద్వారా ప్రతిభను మరింత మెరుగుపరుచుకోవడం
  8. సమయస్ఫూర్తి కలిగి ఉండడం

కెరీర్ గైడెన్స్.. అకౌంటింగ్ టెక్నీషియన్

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెన్సీ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) రూపొందించిన నూతన కోర్సు ‘అకౌంటింగ్ టెక్నీషియన్ సర్టిఫికేషన్ కోర్స్(ఏటీసీ)’. అకౌంటింగ్ నిర్వహణలో విద్యార్థులకు పరిపూర్ణ అవగాహన కల్పించి... ఉద్యోగ సాధనలో వారిని విజేతలుగా నిలిపే లక్ష్యంతోనే ఈ కోర్సుకు ఐసీఏఐ రూపకల్పన చేసింది. సర్వీస్ ట్యాక్స్, వ్యాట్, బిజినెస్ లా, కంపెనీ లా తదితర వ్యాపార సంబంధ అంశాలన్నిటిపై నా ఈ కోర్సు సమయంలో శిక్షణ ఇస్తారు. 
సీఏ(చార్టర్డ్ అకౌంటెన్సీ)ను కెరీర్‌గా ఎంచుకున్న విద్యార్థి.. పదో తరగతి పూర్తికాగానే కామన్ ప్రొఫిషియెన్సీ టెస్ట్(సీపీటీ)కు పేరు నమోదు చేసుకోవాలి. ఇంటర్మీడియెట్‌తోపాటు సీపీటీకి హాజరై.. అందులోనూ ఉత్తీర్ణత సాధిస్తే తొలి దశ ముగిసినట్లే. అలా సీపీటీ పూర్తి చేసిన విద్యార్థులు... ఇంటిగ్రేటెడ్ ప్రొఫెషనల్ కాంపిటెన్సీ ఎగ్జామినేషన్ (ఐపీసీసీ)కి పేరు నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత తొమ్మిది నెలల స్టడీ కోర్స్, 35 గంటల ఓరియెంటేషన్ కోర్సు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ట్రైనింగ్ పూర్తి చేసుకోవాలి. ఈ ప్రక్రియ ముగి శాక.. ఐపీసీసీ గ్రూప్1 పరీక్షకు హాజరుకావాలి. ఇవి ప్రతి ఏటా మే, నవంబర్‌లలో ఉంటాయి. గ్రూప్1లో ఉత్తీర్ణత సాధించి.. ఒక ఏడాది ఆర్టికల్‌షిప్‌ను కూడా పూర్తి చేసుకుంటే అకౌంటింగ్ టెక్నిషియన్‌గా గుర్తింపు వస్తుంది. ఆ తర్వాత విద్యార్థి ఆసక్తిని బట్టి.. ఐపీసీసీ గ్రూప్-2లో చేరొచ్చు.అందులోనూ విజయం సాధిస్తే.. ఐపీసీసీ ఫైనల్ కోర్సులో ప్రవేశించవచ్చు. ఇది పూర్తయ్యాక.. చార్ట ర్డ్ అకౌంటెంట్‌గా స్థిరపడొచ్చు.

సీఏ పూర్తికాకపోయినా:అకౌంటింగ్ టెక్నిషియన్ కోర్సుకు ప్రత్యేక కరిక్యులం, సిలబస్ లేదు. సీఏ కోర్సుతోనే దీన్ని అనుసంధానం చేశారు. ఇలా సీఏ తో అనుసంధానం చేయడం వల్ల.. ఐపీసీసీ ఉత్తీర్ణత సాధించలేక పోయినా.. అకౌంటింగ్ టెక్నిషియన్ సర్టిఫికెట్ సంపాదించుకునే అవకాశం లభిస్తుంది. ఫలితంగా ఉద్యోగ వేటలో ఇతరుల కంటే ముందుండొచ్చు. సీఏ కోర్సుకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ ప్రొఫెషనల్ కాంపిటెన్సీ కోర్సు- ఐపీసీసీ (గతంలో ఇంటర్మీడియెట్, పీఈ, పీసీసీల స్థానంలో ఈ కొత్త స్కీంను ప్రవేశపెట్టారు) లోని గ్రూప్1లో ఉత్తీర్ణత పొంది... గుర్తింపు పొందిన చార్టర్డ్ అకౌంటెంట్ వద్ద ఆర్టికల్‌షిప్ పూర్తిచేస్తే.. అకౌంటింగ్ టెక్నిషియన్‌గా సర్టిఫికెట్ పొందవచ్చు. 

కోర్సు స్వరూపం:ఐపీసీసీ గ్రూప్1 లో మొత్తం నాలుగు పేపర్లుంటాయి. గ్రూప్2లో మూడు పేపర్లుంటాయి. గ్రూప్1లో... మొదటి పేపర్ అకౌంటిం గ్; రెండో పేపర్‌లో బిజినెస్ లా, కంపెనీ లా, బిజినెస్ ఎథిక్స్, కమ్యూనికేషన్స్; మూడో పేపర్‌లో కాస్ట్ అకౌంటెన్సీ, ఫైనాన్స్ మేనేజ్‌మెంట్; నాలుగో పేపర్‌లో ఇన్‌కమ్‌ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, వ్యాట్ ఉంటాయి. ఈ నాలుగు పేపర్లలో ఉత్తీర్ణత సాధిస్తే.. అకౌం టింగ్ టెక్నిషియన్ కోర్సు పూర్తవుతుంది. ఐపీసీసీ దిశగా తొలి అంకం ముగుస్తుంది.

ఇతర అంశాలపైనా శిక్షణ:కేవలం అకడమిక్ సబ్జెక్టులే కాకుండా.. ఉద్యోగ సాధనలో అవసరమయ్యే ఇతర అంశాలపైనా శిక్షణనిచ్చేవిధంగా ఐసీఏఐ కరిక్యులం రూపొందించింది. ఈ క్రమంలో 35 గంటల ఓరియెంటేషన్ కోర్సు ఉంటుంది. ఇందులో పర్సనాలిటీ డెవలప్‌మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఆఫీస్ ప్రొసీజర్స్, బిజినెస్ ఎన్విరాన్‌మెంట్, జనరల్, కమర్షియల్ నాలెడ్జ్ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు. దాంతోపాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ట్రైనింగ్ ప్రోగ్రాంలో.. కంప్యూటర్‌కు సంబంధించిన ప్రాథమిక అంశాలు, ఆఫీస్ డాక్యుమెంటేషన్ తదితర అంశాలపై సాంకేతిక శిక్షణనిస్తారు. 

ఇప్పటికే పీసీసీ కోర్సులో పేరు నమోదు చేసుకున్న విద్యార్థి... ఐపీసీసీకి మారొచ్చు. www.icai.org నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకొని నిర్దేశిత ఫీజుతో పీసీసీ నుంచి ఐపీసీసీకి మార్పు కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఉదాహరణకు 2009, నవంబరులో ఐపీసీసీ పరీక్షలు రాయాలనుకున్న పీసీసీ విద్యార్థి... 2009, జనవరి 31లోపు ఐసీఏఐకి దరఖాస్తు చేసుకోవాలి. అదేవిధంగా 2010, మే పరీక్షల కోసం... 2009, జులై 31లోపు దరఖాస్తు చేసుకోవాలి. 

పీసీసీ విధానంలో ఎంతకాలం ఆర్టికల్స్ అసిస్టెంట్‌గా పనిచేశారనే విషయంతో సంబంధం లేకుండా.. ఐపీసీసీకి మారిన విద్యార్థి కనీసం 9 నెలల స్టడీ కోర్సు పూర్తిచేయాలి. దాంతోపాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ట్రైనింగ్ కూడా చేయాలి. ఆ తర్వాతే గ్రూప్ 1, గ్రూప్ 2లకు హాజరయ్యేందుకు వీలుంటుంది. 

ఎంతో అనువైంది:ఐపీసీసీ (ఇంటిగ్రేటెడ్ ప్రొఫెషనల్ కాంపిటెన్సీ ఎగ్జామినేషన్), ఏటీసీ (అకౌంటింగ్ టెక్నిషియన్ సర్టిఫికేషన్) విధానాలు విద్యార్థులకు ఎంతో అనువైనవి. గతంలో మూడున్నరేళ్లున్న ఆర్టికల్‌షిప్... ఇప్పుడు మూడేళ్లే. ఐపీసీసీ గ్రూప్ 2లో పేరు నమోదు చేసుకోగానే.. ఆర్టికల్‌షిప్ కోసం పేరు నమోదు చేసుకోవచ్చు. గత విధానం ప్రకారం...పీఈ-2, పీసీసీ కోర్సుల్లో ప్రవేశించిన విద్యార్థులు కూడా కొత్త విధానంలోకి మారేందుకు అవకాశం ఉంది. కేవలం అకౌంటింగ్ కోర్సు మాత్రమే కాకుండా.. మరెన్నో షార్ట్‌టర్మ్ కోర్సులను కూడా ఐసీఏఐ నిర్వహిస్తోంది. కార్పొరేట్ గవర్నెన్స్, హెచ్‌ఆర్‌డీ, ఇన్వెస్టిగేషన్ అండ్ డిటెక్షన్, మెర్జర్స్ అండ్ అమాల్గమేషన్స్, స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ వాటిలో కొన్ని.

అవకాశాలు:ఆడిటర్లుగా, టాక్స్ కన్సల్టెంట్లుగా, ఫైనాన్షియల్ కన్సల్టెంట్లుగా, పనిచేయొచ్చు. బ్యాంకింగ్, ఫారిన్ ఎక్స్‌ఛేంజ్ మార్కెట్‌లలో కన్సల్టెన్సీలుగా పని చేసే అవకాశం ఈ కోర్సు పూర్తి చేసిన వారికి లభిస్తుంది. 

ఎప్పుడైనా రిజిస్ట్రేషన్:ఐపీసీసీ/ఏటీసీ కోర్స్‌లకున్న మరో ప్రత్యేకత ఏడాదిలో ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం. జనవరి 31లోపు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు అదే సంవత్సరం నవంబర్‌లో జరిగే పరీక్షకు... జూన్ 30లోపు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ తర్వాతి ఏడాది మేలో జరిగే పరీక్షకు హాజరయ్యే అవకాశం కల్పిస్తారు. రిజిస్ట్రేషన్‌కు, పరీక్షకు మధ్య తొమ్మిది నెలల స్టడీ కోర్సును పూర్తిచేయాలనే ఉద్దేశంతోనే ఈ వ్యవధిని తప్పనిసరిగా నిర్ణయించారు. 
మరిన్ని వివరాలకు www.icaihyd.org 
  • గతంలోని ఇంటర్ పీఈ-2, పీసీసీ స్థానంలో ఐపీసీసీ ప్రవేశం
  • ఐపీసీసీ గ్రూప్-1 ఉత్తీర్ణత సాధిస్తే.. అకౌంటింగ్ టెక్నిషియన్ కోర్స్ సర్టిఫికెట్
  • ఐపీసీసీ గ్రూప్-1, 2, ఏటీసీ (మూడు కలిపి) ఫీజు రూ. పదివేలు
  • ఆర్టికల్ షిప్ కోసం అదనంగా మరో రెండు వేల రూపాయలు.
  • ఏడాది పొడవునా రిజిస్ట్రేషన్ సదుపాయం
  • ప్రతి ఏటా రెండుసార్లు పరీక్షలు
  • పేరు నమోదు.. పరీక్ష తేదీకి మధ్య తొమ్మిది నెలల వ్యవధి తప్పనిసరి
  • జూన్ 30 లోపు నమోదు చేసుకుంటే తదుపరి ఏడాది మే పరీక్షలకు.. ఫిబ్రవరి 28లోపు నమోదు చేసుకుంటే అదే ఏడాది నవంబర్ పరీక్షలకు హాజరయ్యే అవకాశం

కెరీర్‌కు టికెట్.. ఎయిర్ టికెటింగ్

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. దీంతో పలు ఫ్లైట్స్ షెడ్యూల్స్, ఎయిర్ టారిఫ్, టూర్ ప్లానింగ్ సంబంధిత వివరాల కోసం నేడు చాలా మంది ట్రావెల్ ఏజెన్సీలను ఆశ్రయిస్తున్నారు. విదేశీ పర్యాటకుల సంఖ్య పెరుగుతుండటం కూడా ఈ ట్రావెల్ ఏజెన్సీల ప్రాముఖ్యాన్ని పెంచుతోంది. దీంతో ఎయిర్ టికెటింగ్ కోర్సు చేసిన అభ్యర్థులకు డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది.

కోర్సు స్వరూపంఒక్క మాటలో చెప్పాలంటే.. ఎయిర్ టికెటింగ్ కోర్సు చేసిన వారు టూర్ గైడ్‌గా వ్యవహరిస్తారని చెప్పొచ్చు. ఈ కోర్సులో విమాన టికెట్ల ను రిజర్వ్ చేయడం నుంచి హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ సంబంధిత అంశాలను బోధిస్తారు. సాధారణంగా ఇందులో మూడు మాడ్యూల్స్ ఉంటాయి. మొదటి మాడ్యూల్-ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్ అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్. ఇందులో ప్రయాణానికి సంబంధించి ఉపయో గించే జియోగ్రాఫికల్ కోడ్స్, ట్రావెల్ ఫార్మాలిటీస్, టికెట్ల రిజర్వేషన్ విధానాలు, ట్రావెల్ ఏజెన్సీ మేనేజ్‌మెంట్ వంటి అంశాలుంటాయి. రెండో మాడ్యూల్- కంప్యూటరైజ్డ్ రిజర్వేషన్ సిస్టమ్. దీనిలో టైమ్ టేబుల్ చెక్, విమానాల లభ్యత, క్రియేటింగ్ పీఎన్‌ఆర్, హోటల్ రిజర్వేషన్ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఇక.. కోర్సులో కీలక విభాగమైన కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ మాడ్యూల్‌లో కస్టమర్లతో వ్యవహరించే విధానం, రెజ్యుమె ప్రిపరేషన్, ఇంటర్వ్యూ టెక్నిక్స్,సేల్స్ అండ్ మార్కెటింగ్ ప్రిన్సిపల్స్ వంటి అంశాలుంటాయి.

అర్హత: కొన్ని సంస్థలు పదో తరగతి అర్హతతో సర్టిఫికెట్ కోర్సును.. మరికొన్ని సంస్థలు 10+2/ఇంటర్ అర్హతతో ఎయిర్ టికెటింగ్ కోర్సు కు సంబంధించి డిగ్రీ, డిప్లొమా కోర్సులు అందిస్తున్నాయి. కాల వ్యవధి ఆయా కోర్సులను బట్టి 2 నుంచి 6 నెలలు లేదా ఏడాది పాటు ఉంటుంది.

కావాల్సిన స్కిల్స్: కేవలం స్వదేశీ ప్రయాణికులే కాకుండా అంతర్జాతీయ ప్రయాణికుల తో మాట్లాడాల్సి ఉంటుంది. కాబట్టి ఇంగ్లిష్ లాంగ్వేజ్ స్కిల్ (మాట్లా డడం, రాయడం) తప్పనిసరి. మ్యాథమెటిక్స్‌లో ప్రాథమిక అంశాల పై పట్టు.. పలు రకాల వ్యక్తులతో మాట్లాడాల్సి ఉంటుంది కాబట్టి చక్కని కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం కూడా ఎంతో. కేవలం టికెట్ల ను బుక్ చేయడమే కాకుండా ఒక ట్రావెల్ గైడ్‌గా వ్యవహరించాల్సి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన టూర్ షెడ్యూల్ ప్లాన్ చేసే సామర్థ్యం ఉండాలి.

అవకాశాలుప్రస్తుతం విమానయాన రంగంలోకి పలు సంస్థలు ప్రవేశిస్తున్నాయి. దీంతో అవకాశాలు పుష్కలంగా లభిస్తున్నాయి. కోర్సు పూర్తి చేసిన వారికి వివిధ ఎయిర్‌లైన్ కంపెనీలు, ట్రావెల్ ఏజెన్సీల్లో ఉద్యోగాలు లభిస్తాయి. ట్రావెల్ ఏజెన్సీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, ట్రాఫిక్ అసిస్టెంట్, రెవెన్యూ అకౌంటెంట్స్ వంటి అవకాశాలుంటాయి. అంతే కాకుండా వివిధ ఎయిర్‌లైన్ సంస్థల్లో ఎయిర్‌లైన్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూ టివ్స్, గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఎగ్జిక్యూటివ్స్, చెక్-ఇన్ అండ్ టికెటింగ్ విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి.

ఆఫర్ చేస్తోన్న సంస్థలు- క్యువోనీ అకాడెమీ -వెబ్‌సైట్: www.kuoniacademy.co.in
- (ఈ ఇన్‌స్టిట్యూట్‌కు హైదరాబాద్‌తోపాటు దేశవ్యాప్తంగా 18 ట్రైనింగ్ సెంటర్లున్నాయి.)
- ట్రేడ్-వింగ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ముంబై)-
వెబ్‌సైట్: www.onlinetraveledu.com
- ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ అకాడెమీ -వెబ్‌సైట్: www.airlinesacademy.com
- ఎవలాన్ అకాడెమీ ఆఫ్ ఏవియేషన్(చెన్నై)- వెబ్‌సైట్: www.avalonacademy.in
- అడ్వెంచెర్ స్కూల్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ -అబిడ్స్, హైదరాబాద్.వెబ్‌సైట్: www.adventuretourstravels.com

కెరీర్ గైడెన్స్.. ఈవెంట్ మేనేజ్‌మెంట్

నేటి కార్పొరేట్ యుగంలో బర్త్ డే పార్టీ నుంచి మ్యారేజ్ ఫంక్షన్ వరకు అదిరిపో యే విధంగా నిర్వహించాలనుకునే వారి వరకు ఠక్కున గుర్తొచ్చే పదం.. ఈవెంట్ మేనేజ్‌మెంట్.. ఎడ్యుకేషన్ ఈవెంట్స్ నుంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఈవెంట్స్ వరకు.. కార్పొరేట్ నుంచి ప్రొడక్ట్ మార్కెటింగ్-ప్రమోషనింగ్, సెమినార్లు, వర్క్‌షాప్స్, సినిమా అవార్డుల ప్రదానం.. ఇలా అనేక కార్యక్రమాలను నేటి కార్పొరేట్ యుగానికనుగుణంగా.. డిజైన్ చేయడానికి.. చాలా మంది ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలను ఆశ్రయిస్తున్నారు. దీంతో సంబంధిత రంగంలో కోర్సు పూర్తి చేసిన వారికి.. నేటి కార్పొరేట్ ప్రపంచం రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతుంది. ఈ నేపథ్యంలో ఉపాధి అవకాశాలకు వేదికగా మారిన ‘ఈవెంట్ మేనేజ్‌మెంట్’ కెరీర్ ప్రాస్పెక్టస్‌పై ఫోకస్..

మన దేశంలో గత కొంత కాలంగా ఈవెంట్ మేనేజ్‌మెంట్ పరిశ్రమ ప్రొఫెషనల్, ఆర్గనైజ్డ్ సెక్టార్‌గా రూపుదిద్దుకుంది. దీంతో ఈవెంట్ మేనేజ్‌మెంట్ టాప్ కెరీర్స్‌లో ఒకటిగా నిలుస్తోంది. ప్రస్తుత కార్పొరేట్ ప్రపంచంలో.. మార్కెటింగ్ విభాగంలో ఈవెంట్ మేనేజ్‌మెంట్‌ది కీలక పాత్ర. ఎడ్యుకేషన్, ఫ్యాషన్ షోస్, ఎంటర్‌టైన్‌మెంట్, ప్రొడక్ట్ లాంచింగ్ వంటి తదితర విభాగాల్లో.. ఈవెంట్లను నిర్వహించడం ద్వారా డెరైక్ట్ మార్కెటింగ్‌కు అవకాశం ఉండడంతోపాటు కావల్సినంత పబ్లిసిటీ లభిస్తుండడంతో ఈ తరహా కార్పొరేట్-ప్రమోషనింగ్ ఈవెంట్స్ నిర్వహించడానికి చాలా సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. అంతేకాకుండా మ్యారేజెస్, బర్త్‌డే, గెట్ టూ గెదర్, ఫండ్ రైజింగ్ ఈవెంట్స్ వంటి సోషల్ ఈవెంట్స్‌లో కూడా ఈవెంట్ మేనేజ్‌మెంట్ కీలక పాత్ర వహిస్తుంది.

ప్రవేశం: మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, నెట్‌వర్కింగ్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులు ఈవెంట్ మేనేజ్‌మెంట్‌ను ప్రొఫెషన్‌గా ఎంచుకోవచ్చు. ఇందుకు సంబంధించి దేశంలో పలు ఇన్‌స్టిట్యూట్‌లు సర్టిఫికెట్ నుంచి డిప్లొమా, పీజీ డిప్లొమా, అడ్వాన్స్‌డ్ డిప్లొమా, ఎంబీఏ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. వీటిలో డిప్లొమాకు 10+2 లేదా ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. పీజీ డిప్లొమా/ఎంబీఏ కోర్సుకు మాత్రం గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ తప్పనిసరి.

కావల్సిన స్కిల్స్:ఈ రంగంలో రాణించాలంటే కొన్ని ప్రత్యేక స్కిల్స్ తప్పనిసరి. సృజనాత్మకత, విభిన్నంగా ఆలోచించడం, సమయస్ఫూర్తి అవసరం. అంతేకాకుండా విభిన్న వర్గాలకు చెందిన వ్యక్తులు, కార్పొరేట్ సంస్థలతో సంప్రదింపులు, చర్చలు సాగించాల్సి ఉంటుంది కాబట్టి ఇంగ్లిష్ భాషపై మంచి పట్టు ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్‌తోపాటు నాయకత్వ లక్షణాలు తప్పనిసరి. ముఖ్యంగా ఈవెంట్ నిర్వహణలో బడ్జెట్ కు సంబంధించి అప్రమత్తంగా వ్యవహరించాలి కాబట్టి సదరు స్కిల్స్ కూడా ఉండాలి. రిస్క్ మేనేజ్‌మెంట్ స్కిల్స్, ఈవెంట్‌ను విజయవంతం చేసే క్రమంలో ప్రచారాన్ని కల్పించడానికి మీడియా మేనేజ్‌మెంట్ స్కిల్స్ వంటి అంశాలు కూడా అవసరమే.

కోర్సు స్వరూపం:ఈవెంట్ మేనేజ్‌మెంట్ ఎడ్యుకేషన్‌లో.. సంబంధిత పరిశ్రమ ఆశిస్తున్న స్కిల్స్, టెక్నిక్స్‌ల్లో అభ్యర్థి పరిపూర్ణత సాధించే విధంగా క్లాస్ అండ్ ప్రాక్టికల్ ఓరియెంటెడ్‌గా కోర్సు స్వరూపం ఉంటుంది. ఇందుకోసం నాలుగు రకాల లెర్నింగ్ మెథడ్స్‌ను ఉపయోగించి బోధిస్తారు. అవి.. క్లాస్ రూం సెషన్, గెస్ట్ లెక్చరర్స్-కేస్ స్టడీ, ప్రాక్టికల్ ట్రై నింగ్, ఇన్నోవేటివ్-ఇంటరాక్టివ్ లెర్నింగ్ టెక్నాలజీ. క్లాస్ రూం సెషన్‌లో.. రెగ్యులర్ లెక్చరర్స్‌తోపాటు ఒక ఈవెంట్‌కు సంబంధించి ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను కూడా అభ్యర్థులు రూపొందించాలి. అంతేకాకుండా సదరు రంగంలో ప్రస్తుతం చోటు చేసుకుంటున్న మార్పులపై అవగాహన కల్పించడానికి వర్క్‌షాప్స్ నిర్వహిస్తారు. గెస్ట్ లెక్చరర్స్-కేస్ స్టడీలో.. సంబంధిత రంగంలోని ప్రముఖలతో గెస్ట్ లెక్చరర్స్ ఇప్పిస్తారు. క్లాస్ రూంలో చర్చించిన అంశాలను మరింత విశ్లేషణతో కూడిన కేస్ స్టడీ రిపోర్ట్‌ను తయారు చేయాలి. ఇందువల్ల అభ్యర్థికి ఒక ఈవెంట్ నిర్వహణలో ఇమిడి ఉండే విభాగాలపై అవగాహన వస్తుంది. ప్రాక్టికల్ ట్రైనింగ్‌లో..లైవ్ ఈవెంట్స్ నిర్వహణలో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తా రు. ఇన్నోవేటివ్-ఇంటరాక్టివ్ లెర్నింగ్ టెక్నాలజీలో.. వివిధ రకాలు గా..ఎడ్యుకేషన్ వికీస్, బ్లాగ్స్, స్లైడ్ షో, యూ ట్యూబ్, ఇంటర్నెట్ తదితర మాధ్యమాల ద్వారా సంబంధితరంగంపై అవగాహన కల్పిస్తారు.

కరిక్యులం:నేటి కార్పొరేట్ రంగ అవసరాలకనుగుణంగా కోర్సు కరిక్యులం ఉంటుంది. ఇందులో ఈవెంట్ బ్రాండింగ్, రైటింగ్, యాన్ ఈవెంట్ బ్రీఫ్, ప్రొడక్షన్, సంబంధిత టెక్నికల్ అంశాలు, సెలబ్రిటీ/ఆర్టిస్ట్ మేనేజ్‌మెంట్, టైప్స్ ఆఫ్ మీడియా, క్రియేటివిటీ ఇన్ ఈవెంట్స్, ఈవెంట్ స్పాన్సర్‌షిప్, పబ్లిక్ రిలేషన్స్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్ అండ్ ప్రమోషన్స్, వెడ్డింగ్ ప్లానింగ్, అవార్డ్స్ ఫంక్షన్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, సోషల్ ఈవెంట్స్ ఆర్గనైజింగ్ తదితర అంశాలు ఉంటాయి.

ఈవెంట్స్-స్పెషలైజేషన్స్:ఈవెంట్ మేనేజ్‌మెంట్ అంటే స్థూలంగా పబ్లిసిటీ లేదా ఒక సంస్థ/ప్రొడక్ట్/సంబంధిత విభాగానికి బ్రాండింగ్ ఇమేజ్ ఇవ్వడం. కానీ గత కొంత కాలంగా ప్రమెషన్ ఈవెంట్సే కాకుండా మ్యారేజ్ వంటి సోషల్ ఈవెంట్స్ కూడా.. ఇందులో చోటు సంపాదించుకున్నాయి. దాంతో ఉపాధి అవకాశాలు కూడా విస్తృతమయ్యాయి. అవి..
  • సోషల్ ఈవెంట్స్: మ్యారేజెస్, బర్త్‌డే పార్టీస్, గెట్ టూ గెదర్, సోషల్ గ్యాదరింగ్, ఫండ్ రైజింగ్ ఈవెంట్స్..
  • ఎడ్యుకేషనల్ ఈవెంట్స్: ఎడ్యుకేషనల్ ఫెయిర్స్, కాలేజ్/వర్సిటీ యాన్వల్/వెల్‌కం/ఫ్రెషర్స్ డే ఫంక్షన్స్, పిక్నిక్ /హాలీడే ప్రోగ్రామ్స్, స్పోర్ట్స్ మీట్..
  • కార్పొరేట్ ఈవెంట్స్: మీటింగ్స్, సెమినార్స్, కాన్ఫరెన్సెస్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, అవార్డ్స్ ఫంక్షన్స్..
  • ఎగ్జిబిషన్స్ అండ్ ఫెయిర్స్: ప్రాపర్టీ ఎగ్జిబిషన్స్, ఎక్స్‌పోర్ట్ ఎగ్జిబిషన్స్, ఎలక్ట్రానిక్ ఫెయిర్, జాబ్స్ ఫెయిర్, ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ ఫెయిర్స్..
  • ఎంటర్‌టైన్‌మెంట్ ఈవెంట్స్: మూవీ ప్రమోషన్స్, సెలబ్రిటీ నైట్స్, మ్యూజిక్ రిలీజ్, అవార్డ్స్, ఫ్యాషన్ షోస్, బ్యూటీ కాంటెస్ట్, స్టేజ్ షోస్..
  • మార్కెటింగ్-ప్రమోషన్స్: యాడ్ క్యాంపెయిన్, ప్రొడక్ట్ లాంచింగ్, రోడ్ షోస్, ప్రమోషన్ యాక్టివిటీస్, షాపింగ్ ఫెస్టివల్..
అవకాశాలు:
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాస్పిటాలిటీ, ఈవెంట్ మేనేజ్‌మెంట్ రంగం హవా నడుస్తోంది. మన దేశంలో పరిస్థితులు కూడా దీనికి భిన్నంగా లేవు. దేశంలో హాస్పిటాలిటీ, ఈవెంట్ మేనేజ్‌మెంట్ పరిశ్రమ మల్టీ మిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంది. ఒక అంచనా ప్రకారం.. ఈ రంగం దేశ జీడీపీకి 5.3 శాతం ఆదాయాన్ని సమకూరుస్తోంది. ఈ నేపథ్యంలో ఈవెంట్ మేనేజ్‌మెంట్‌లో అవకాశాలకు ఎటువంటి కొదవలేదని చెప్పొచ్చు. ఈ రంగంలో ప్రొఫెషనల్ డిగ్రీ ఉన్న అభ్యర్థులకు ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు, కార్పొరేట్ హౌసెస్, స్టార్ హోటల్స్, రేడియో స్టేషన్స్, రిసార్ట్స్, క్లబ్స్, అడ్వర్‌టైజింగ్ ఏజెన్సీలు, షాపింగ్ మాల్స్, పబ్లిక్ రిలేషన్ ఏజెన్సీలు, మీడియా హౌసెస్, మూవీ/టీవీ ప్రొడక్షన్ హౌసెస్, ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్, ట్రావెల్ అండ్ టూరిజం కంపెనీలు, మ్యూజిక్ పరిశ్రమ, స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ కంపెనీలు, ఫ్యాషన్ హౌసెస్‌లలో వివిధ హోదాల్లో అవకాశాలు ఉంటాయి. అనుభవం ఆధారంగా సొంతంగా ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీని కూడా స్థాపించుకోవచ్చు.

ఎంట్రీ లెవల్:ఈ రంగంలో ప్రొఫెషనల్ డిగ్రీ ఉన్న అభ్యర్థులు.. సంస్థను బట్టి వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. వీరు సాధారణంగా కెరీర్ ప్రారంభంలో.. జూనియర్ ఈవెంట్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేయాలి. తర్వాత స్కిల్స్, అనుభవం ఆధారంగా సీనియర్ ఈవెంట్ ఎగ్జిక్యూటివ్, ఈవెంట్ కో-ఆర్డినేటర్, ఈవెంట్ అసిస్టెంట్ వంటి వివిధ హోదాల్లో స్థిర పడొచ్చు. ఈ హోదాల్లో చూపిన ప్రతిభ ఆధారంగా ఈ రంగంలో ఉన్నత స్థానమైన.. ఈవెంట్ మేనేజర్, ఈవెంట్ డెరైక్టర్ స్థాయికి కూడా చేరుకొవచ్చు. 

వేతనాలు: సాధారణ మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్లతో పోల్చితే.. ఈవెంట్ మేనేజ్‌మెంట్ అభ్యర్థులకు వేతనాలు ఎక్కువ అని చెప్పొచ్చు. ప్రారంభంలో జూనియర్ ఈవెంట్ ఎగ్జిక్యూటివ్‌కు నెలకు రూ.15-20 వేల వరకు వేతనం లభిస్తుంది. తర్వాత ప్రతిభ, అనుభవం, హోదాను బట్టి నెలకు దాదాపు రూ. 30-50 వేల వరకు సంపాదించవచ్చు. ఈవెంట్ మేనేజర్/ఈవెంట్ డెరైక్టర్ స్థాయికి చేరుకుంటే నెలకు దాదాపు రూ. 2-4 లక్షల వరకు అందుకోవచ్చు. 

టాప్ రిక్రూటర్స్: విజ్‌క్రాఫ్ట్, లాక్మే, ఫిల్మ్‌ఫేర్ మీడి యా హౌస్, పర్సెప్ట్ డీ మార్క్, సీఎన్‌బీసీ, డీఎన్‌ఏ నెట్‌వర్క్, సర్వీస్ ఇంటర్నేషనల్, 360 డిగ్రీస్, హెల్ప్ ఏజ్ ఇండియా, ఇంటర్‌ఫేస్, రెడ్ ఈవెంట్స్, లైట్ అండ్ రిఫ్‌లెక్షన్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఫుడ్ ఆర్ట్, ఈవెంట్ క్రాఫ్టర్, షోమేకర్స్ ఇండియా, ఓపస్ మీడియా, ఈవెంట్ గురు, నక్షత్ర, గ్లోబల్ నెక్సస్, ఇంటర్‌ఫేస్ తదితర సంస్థలు.

ఆఫర్ చేస్తోన్న సంస్థలు-కోర్సులుది ఇన్‌స్టిట్యూట్ నేషనల్ అకాడెమీ ఆఫ్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్.
  • ఎంబీఏ(ఈవెంట్ మేనేజ్‌మెంట్)
  • బీబీఏ (ఈవెంట్ మేనేజ్‌మెంట్)
  • డిప్లొమా, పీజీ డిప్లొమా (ఈవెంట్ మేనేజ్‌మెంట్)
    www.naemd.com
  • ఏపీజే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్-న్యూఢిల్లీ.
    కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ కార్పొరేట్ కమ్యూనికేషన్, పబ్లిక్ రిలేషన్స్ అండ్ ఈవెంట్ మేనేజ్‌మెంట్
    వెబ్‌సైట్: www.apeejay.edu
  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లెర్నింగ్ అండ్ అడ్వాన్స్‌డ్ డెవలప్‌మెంట్-గుర్గాంవ్
    కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ అండ్ పబ్లిక్ రిలేషన్స్
    వెబ్‌సైట్: www.inlead.in
  • మాస్‌కో మీడియా-నోయిడా
    కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ అండ్ కార్పొరేట్ కమ్యూనికేషన్
    వెబ్‌సైట్: www.masscomedia.com
  • నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఈవెంట్ మేనేజ్‌మెంట్-ముంబై
    కోర్సు: పీజీ డిప్లొమా/డిప్లొమా ఇన్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ అండ్ పబ్లిక్ రిలేషన్స్
    వెబ్‌సైట్: www.niemindia.com
  • ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ఫ్యూచర్ మేనేజ్‌మెంట్-చండీగఢ్
    కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ ఈవెంట్ మేనేజ్‌మెంట్
    వెబ్‌సైట్: www.itftindia.com
  • అమిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ (అమిటీ యూనివర్సిటీ)-న్యూఢిల్లీ
    వెబ్‌సైట్: www.amity.edu/aiem