Wednesday, 18 July 2012

20న నిట్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి

వరంగల్‌లోని నిట్‌లో 2012-13 విద్యా సంవత్సరం బీటెక్, ఎంటెక్, పీహెచ్‌డీ మొదటి సెమిస్టర్‌కు సంబంధించి.. విద్యార్థులు ఈ నెల 20వ తేదీన రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని నిట్ అకడమిక్ డీన్ టి.రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. రూ.500 ఆలస్య రుసుముతో ఈ నెల 21 నుంచి 27వ తేదీ వరకు సంబంధిత హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్‌లో, రూ.2వేల ఆలస్య రుసుముతో 28 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు డీన్ అకడమిక్ వద్ద రిజిస్టేషన్ చేసుకోవచ్చని సూచించారు.

అక్టోబర్ 3 నుంచి తెలుగు వర్సిటీ దూరవిద్య పరీక్షలు

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ దూరవిద్య కేంద్ర వార్షిక పరీక్షలు అక్టోబర్ 3 నుంచి 21వ తేదీ వరకు జరుగుతాయని రిజిస్ట్రార్ ఆచార్య కె.ఆశీర్వాదం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఆగస్టు 9 లోగా ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. పరీక్ష దరఖాస్తు ఫారం, టైమ్‌టేబుల్ విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో ఉంటుందన్నారు. వివరాలకు 040-23241923 నంబరును సంప్రదించవచ్చు.

నిమ్స్‌సెట్-2012

వివిధ కోర్సుల్లో ప్రవేశానికి నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(నిమ్స్)దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. కోర్సులు..
- బీఎస్సీ(నర్సింగ్)
కోర్సు కాలపరిమితి: నాలుగేళ్లు
సీట్ల సంఖ్య: 100
- బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ
కోర్సు కాలపరిమితి: నాలుగున్నరేళ్లు
సీట్ల సంఖ్య: 50
అర్హత: బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతతో పాటు ఎంసెట్‌లో అర్హత.
వయసు: డిసెంబర్ 31, 2012 నాటికి 17 నుంచి 25 ఏళ్లు
- మాస్టర్ ఇన్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్
కోర్సు కాలపరిమతి: రెండున్నరేళ్లు
సీట్ల సంఖ్య: 20
అర్హత: మెడికల్/ నాన్ మెడికల్ విభాగంలో డిగ్రీ
వయసు: డిసెంబర్ 31, 2012 నాటికి 20 నుంచి 30 ఏళ్లు.
దరఖాస్తులు: వెబ్‌సైట్‌లో లభిస్తాయి.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఆగస్ట్ 4, 2012
పూర్తి వివరాలకు వెబ్‌సైట్  www.nims.edu.in  చూడొచ్చు.

లీడర్‌షిప్‌ క్వాలిటీస్‌.. మేక్స్‌ డిఫరెన్స్‌-ఐఐఎం, బెంగళూరు మార్కెటింగ్‌ విభాగం ప్రొఫెసర్‌ మిథిలేశ్వర్‌ ఝా


మేనేజ్‌మెంట్‌ విద్యార్థులకు కెరీర్‌ లక్ష్యాల గురించి స్పష్టత.. సబ్జెక్టుపై పట్టు.. మార్కెట్‌ పరిస్థితులు, కంపెనీల గురించి అవగాహన.. అన్నింటికంటే ముఖ్యంగా నాయకత్వ లక్షణాలుండాలి. దాంతోపాటు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ెురుగుపరచుకుంటే కెరీర్‌లో ముందుకు దూసుకుపోవచ్చు అంటున్నారు ఐఐఎం, బెంగళూరు మార్కెటింగ్‌ విభాగం ప్రొఫెసర్‌ మిథిలేశ్వర్‌ ఝా. క్యాట్‌ ఫలితాలు వెలువడ్డాయి.. కటాఫ్‌లు తెలిసాయి. ఇక మిగిలింది గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూలే..!దేశంలోనే ప్రతిష్టాత్మక బిజినెస్‌ స్కూల్స్‌ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనే జ్‌మెంట్‌లలో అడ్మిషన్‌ ప్రక్రియకు సర్వసిద్ధమవుతున్న నేపథ్యంలో... మేనేజ్‌మెంట్‌ కెరీర్‌పై ఐఐఎం ప్రొఫెసర్‌ ఝాతో ప్రత్యేక ఇంటర్వ్యూ...

గ్రామీణ ప్రాంత విద్యార్థులు మేనేజ్‌మెంట్‌ రంగంలో రాణించాలంటే?గ్రామీణ ప్రాంత మేనేజ్‌మెంట్‌ విద్యార్థులు అవకాశాల్లో తాము వెనుకబడిపోతున్నామని ఆందోళన చెందడం సరికాదు. కంపెనీల అవసరాలు గుర్తించి అందుకుతగ్గట్టుగా తమనుతాము మార్చుకుంటే.. ఎవరైనా కెరీర్‌లో సక్సెస్‌ సాధించవచ్చు. వాస్తవానికి మన దేశంలోని మేనేజ్‌మెంట్‌ రంగంలో.. కంపెనీల అవసరాలు, కాలేజీల కరిక్యులం మధ్య మిస్‌మ్యాచ్‌ కారణంగా విద్యార్థులు ఎక్కువగా నష్టపోతున్నారు. మిగతా బిజినెస్‌ స్కూళ్లతో పోల్చితే.. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం)లు ఎప్పటికప్పుడు పరిశ్రమలతో కలిసి పనిచేస్తుండడం, వారి అవసరాలమేరకు సిలబస్‌ను మార్చుతూ.. విద్యార్థులను తీర్చిదిద్దుతుండడం వల్లనే వాటికి మంచి ఆదరణ లభిస్తోంది. దేశంలోని ఇతర బిజినెస్‌ స్కూళ్లు, యూనివర్సిటీలు కూడా పరిశ్రమల అవసరాలకు తగ్గట్లు విద్యార్థులను తీర్చిదిద్దితే ఈ రంగంలో వారికి ఉజ్వల కెరీర్‌ సొంతమవుతుంది.

దేశంలో మేనేజ్‌మెంట్‌ విద్య భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? మేనేజ్‌మెంట్‌ అభ్యర్థులకు అవకాశాలు అపారం. దేశంలోని చిన్నాపెద్దా అన్ని కంపెనీలకు మేనేజ్‌మెంట్‌ నిపుణుల అవసరం ఉంది. చిన్నచిన్న కంపెనీల మొదలు భారీస్థాయి కంపెనీల వరకు మార్కెటింగ్‌, ఫైనాన్స్‌, హెచ్‌ఆర్‌, రిటైల్‌ వంటి విభాగాల్లో పెద్దఎత్తున ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. టెలికం, రిటైల్‌, బీపీవో రంగాల్లో నైపుణ్యం, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఉన్న విద్యార్థులు అయిదంకెల జీతాలతో కెరీర్లో దూసుకుపోవచ్చు.

మేనేజ్‌మెంట్‌ కాలేజీల్లో బోధనలో నాణ్యత సరిగాలేక విద్యార్థులు నష్టపోతున్నారు. పరిష్కారం? మేనేజ్‌మెంట్‌ విద్యలో నాణ్యత లోపించడానికి కాలేజీలు ఎడాపెడా పుట్టుకురావడం ఒకటే కారణం కాదు. నాణ్యతలేని ప్రొఫెసర్లు తరగతి గదుల్లో బోధిస్తుండడంతో మేనేజ్‌మెంట్‌ విద్యలో నాణ్యత తీసికట్టుగా మారుతోంది.
విద్యార్థులకు భవిష్యత్తులో మంచి అవకాశాలు రావాలన్నా.. నాణ్యమైన విద్యార్థులు తయారుకావాలన్నా.. నిపుణులైన అధ్యాపకుల అవసరం ఎంతో ఉంది.

మేనేజ్‌మెంట్‌ విద్యలో నాణ్యతకు ఎలాంటి సంస్కరణలు అవసరం? ఎంబీఏలో మార్కెటింగ్‌, ఫైనాన్స్‌, హెచ్‌ఆర్‌... ఇలా ఏ విభాగమైనా కీలకమైందే. ఈ రంగంలో పనిచేసేవారికి నాయకత్వ లక్షణాలతోపాటు ఎలాంటి పరిస్థితుల్లోనైనా పనిచేయగల మానసిక బలం అవసరం. అందుకే మేనేజ్‌మెంట్‌ విద్యలో మొదటి ఏడాది ఫస్ట్‌ సెమిస్టర్‌ నుంచే నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ నేర్పేవిధంగా ప్రాక్టికల్‌ ఎక్స్‌పోజర్‌ కల్పించాలి. అసలే సబ్జెక్టు నాలెడ్జ్‌ చాలా నాసిరకంగా అందుతోంది. అందుకే ఓవైపు కాలేజీలు వేటికవే బోధనలో నాణ్యతకు పెద్దపీట వేయాలి. నిపుణులైన అధ్యాపకులు, పరిశ్రమ నిపుణులతో తరగతులు నిర్వహించాలి. అదేవిధంగా కాలేజీల్లో అన్నిరకాల మౌలిక సదుపాయాలు కల్పించాలి.

పూర్తిస్థాయి నైపుణ్యంగల విద్యార్థిగా తయారుకావాలంటే? 
లెర్న్‌ కాన్సెప్ట్స్‌, డవలప్‌ కాన్ఫిడెన్స్‌, ప్రాక్టీస్‌, ఎక్స్‌పోజర్‌ టు ప్రాక్టీస్‌ ప్రాజెక్ట్స్‌, మేనేజ్‌మెంట్‌ నాలెడ్జ్‌ వంటివన్నింటిని విద్యార్థులు ఔపోసన పట్టాలి. ఫస్ట్‌ ఇయర్‌ ఫస్ట్‌సెమిస్టర్‌ నుంచే సబ్జెక్టుపై పట్టుతోపాటు ఇంగ్లిష్‌ నాలెడ్జ్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, లీడర్‌షిప్‌ క్వాలిటీస్‌ అలవర్చుకోవాలి. ఎందుకంటే... ప్రస్తుతం మేనేజ్‌మెంట్‌ విద్యార్థుల స్కిల్స్‌పై కంపెనీలు ఎక్కువగా ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఉంటున్నాయి. అలాంటి వారికే తమ సంస్థలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నయి. అందుకే ముందునుంచే
విద్యార్థులు ఈ లక్షణాలు అలవర్చుకోవాలి. గ్రామీణప్రాంత కాలేజీల్లో చదువుకునే విద్యార్థులు తమకు సౌకర్యాలు లేవనే కారణంతో చదువులో వెనకబడితే నష్టపోయేది వారే. అందుకే పట్టుదలతో కష్టపడాలి. ఇంటర్నెట్‌లో ఎంబీఏ సబ్జెక్టులపై
నిపుణుల అందించే సమాచారం విస్తతంగా ఉంది. ఆయా సమాచారాన్ని ఉపయోగించుకొని మార్కెట్‌కు అవసరమైన స్కిల్స్‌ను అందిపుచ్చుకోవచ్చు.

క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌లో కంపెనీలు విద్యార్థుల నుంచి ఎలాంటి లక్షణాలు ఆశిస్తున్నాయి? మేనేజ్‌మెంట్‌ కంపెనీ ఏదైనాసరే విద్యార్థులకు ఉద్యోగాలిచ్చేముందు క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లలో విద్యార్థిని అన్ని విభాగాల్లో పూర్తిస్థాయిలో పరీక్షిస్తున్నాయి. ఇండిపెండెంట్‌ థింకింగ్‌, లీడర్‌షిప్‌ క్వాలిటీస్‌, నాలెడ్జ్‌, హౌటుహ్యాండిల్‌ ద కాన్ల్ఫిక్ట్స్‌, సబ్జెక్టు నాలెడ్జ్‌, టోలరెన్స్‌... ఇలా అన్ని విషయాల్లో విద్యార్థుల మనోబలం, ఆత్మవిశ్వాసం, వే ఆఫ్‌ స్పీకింగ్‌ వంటివన్నింటిని పరిగణనలోకి తీసుకుంటారు. ఎందుకంటే.. ఒక సక్సెస్‌ఫుల్‌ మేనేజ్‌మెంట్‌ స్టూడెంట్‌కు ఈ లక్షణాలుంటేనే జాబ్‌, ఆ తర్వాత కెరీర్లో ఎదుగుదల ఉంటుంది.

పరిశ్రమల్లో లక్షలాది ఉద్యోగాలు ఒకవైపు... అవకాశాలు దొరక్క విద్యార్థుల అవస్థలు మరోవైపు.. దీనికి కారణం? పరిశ్రమలకు ఏం కావాలో ప్రస్తుతం అది విద్యార్థులకు నేర్పించడంలేదు. ఒకరకంగా చెప్పాలంటే.. కాలేజీల్లో బోధన.. పరిశ్రమల అవసరాలకు మధ్య గ్యాప్‌ ఎక్కువగా ఉంటోంది. అందుకే కంపెనీల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల్లోకి స్కిల్స్‌లేని
అభ్యర్థులను తీసుకోవడానికి కంపెనీలు ఇష్టపడడంలేదు. చివరకు సరైన అభ్యర్థులు దొరక్క అలానే నెట్టుకొస్తున్నాయి. అందుకే మేనేజ్‌మెంట్‌ విద్య చదువుకునే సమయంలోనే విద్యార్థులు భవిష్యత్తులో చేయబోయే ఉద్యోగానికి సంబంధించి నైపుణ్యం సంపాదించాలి. అంతేకాదు.. ఇంజనీరింగ్‌ కాలేజీలు పరిశ్రమలతో ఒప్పందం చేసుకుని తక్షణమే కరిక్యులం మార్చుకోవడం కొంత కష్టం కావచ్చు. కాని మేనేజ్‌మెంట్‌ విద్యలో పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వారితో
ఒప్పందానికి రావడం కాలేజీలకు పెద్ద కష్టంకాదు. కాలేజీలు ఎప్పుడూ కంపెనీలతో టచ్‌లో ఉంటేనే అంతిమంగా విద్యార్థుల కెరీర్‌ బాగుంటుంది.

మేనేజ్‌మెంట్‌ విద్యార్థులకు మీరిచ్చే సలహా? లెర్న్‌, అబ్జర్వ్‌, స్కిల్స్‌, లాంగ్వేజ్‌.. ఈ నాలుగు సూత్రాలు పాటించే ఏ మేనేజ్‌మెంట్‌ విద్యార్థి అయినాసరే ఎంబీఏ, ఎంసీఏ ఎందులోనైనా సులువుగా విజయం సాధించవచ్చు. కేవలం పేరొందిన కాలేజీలో సీటు వస్తే ప్లేస్‌మెంట్‌ వస్తుందనే భ్రమను తొలగించుకోవాలి. బాగా చదివే విద్యార్థి అయినాసరే చాలాసార్లు ఉద్యోగ ప్రయత్నంలో వెనకబడొచ్చు. అందుకే సబ్జెక్టును ఔపోసన పట్టడం, కమ్యునికేషన్‌ స్కిల్స్‌, ఎదుటివారికి మన భావాలు చక్కగా కమ్యునికేట్‌ చేయగలగడం... ఇవన్నీ నేర్చుకుంటే మేనేజ్‌మెంట్‌ కెరీర్‌లో సులువుగా పైకి ఎదగవచ్చు. ప్రస్తుతం ఇండస్ట్రీలో పనిచేస్తున్న ఎక్కువమందిలో ఈ లక్షణాలులేక ఇప్పటికీ అదే పొజిషన్‌లో ఉంటున్నారు.

ఐఐఎంలకు, ఇతర బిజినెస్‌ స్కూల్స్‌కు మధ్య వ్యత్యాసం? ఐఐఎం బెంగళూరు ప్రత్యేక ఏమిటి? ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం)లు ప్రత్యేక విద్యాసంస్థలు. మేనేజ్‌మెంట్‌ రంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులు గమనించడం, కంపెనీల అవసరాలను గుర్తించడం, వాటికి తగ్గట్టుగా ఏటా సిలబస్‌ను మార్చుకుంటూ
ముందుకు వెళ్తుండడంతో దేశంలో ఐఐఎంలు విజయపథంలో నడుస్తున్నాయి. పైగా ఇవి అటానమస్‌ వ్యవస్థలు కావడంతో మార్పులు సులువుగా చేసుకుంటూ... అనుకున్న లక్ష్యాలు సాధించడానికి మార్గం ఏర్పడుతోంది. అంతేకాదు.. పారిశ్రామిక రంగంలోని ప్రముఖ కంపెనీలను క్యాంపస్‌కు ఆహ్వానించడం, వారిని బోర్డు మెంబర్లుగా చేసి కంపెనీల అవసరాలను గుర్తించి వారితో పనిచేస్తుండడంతో ఐఐఎంల నుంచి నాణ్యమైన బిజినెస్‌ స్టూడెంట్లు తయారవుతున్నారు. మామూలు మేనేజ్‌మెంట్‌ విద్యాసంస్థలు ఇవేం చేయలేకపోయినా, అందులో సగం ప్రయత్నం చేసినా చాలు.

గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీల్లో మేనేజ్‌మెంట్‌ కోర్సు చదివే విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు రావడం కష్టంగా ఉంటోంది. అలాంటి విద్యార్థులకు మీరిచ్చే సలహా? సబ్జెక్టుపై పట్టు.. క్లియర్‌ ఎబౌట్‌ కెరియర్‌.. మార్కెట్లో ప్రముఖ కంపెనీలపై అవగాహన, ఆత్మవిశ్వాసం, లీడర్‌షిప్‌ ఎబిలిటీస్‌, కమ్యునికేషన్‌ స్కిల్స్‌... ఇవన్నీ ఉంటే చదివే కాలేజీ మంచిదైనా, చెడ్డదైనా జాబ్‌ గ్యారంటీ. నగరాల్లోని పేరొందిన కాలేజీల్లో మేనేజ్‌మెంట్‌ విద్యార్థులకు ఎప్పటికప్పుడు స్కిల్స్‌పై తరచుగా శిక్షణ ఇప్పిస్తుంటాయి. దీనివలన ఎంబీఏ, ఎంసీఏ చివర్లో ప్లేస్‌మెంట్లు సులువుగా దక్కించుకుంటారు. ఇదే పని గ్రామీణ వాతావరణంలో చదువుకునే విద్యార్థులు కొంత శ్రమించి చేస్తే పోటీలో మీరూ ముందుంటారు.

సైంటిస్టులకు స్వేచ్ఛనివ్వాలి!!-యువ సైంటిస్ట్‌ డాక్టర్‌ సురజిత్‌ ధార


సైన్స్‌ అంటే.. కేవలం పుస్తకాలు చదవడమే కాదు.. సబ్జెక్టును అర్థం చేసుకోవాలి. క్రియేటివ్‌గా ఆలోచించాలి. అన్వయించాలి. సైన్స్‌ రంగంలో ఫిజిక్స్‌కు అద్భుతమైన భవిష్యత్తు ఉంది. విద్యార్థులను పరిశోధనవైపు ఆకర్షించాలంటే.. కాలేజీ స్థాయి నుంచే అధ్యాపకులు, తల్లిదండ్రులు దష్టిసారించాలి. దేశంలో కొత్త ఆవిష్కరణలు చేయాలన్నా.. కొత్త పరికరాలు సష్టించాలన్నా.. శాస్తవ్రేత్తలకు పరిశ్రమలతో కలిసి పనిచేసే అవకాశం రావాలి. కాని ఇది జరగడం లేదు. సైంటిస్టులకు ఆర్థికంగా, పాలనాపరంగా, ఆలోచనపరంగా స్వేచ్ఛకల్పిస్తే... ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చంటున్నారు పశ్చిమ బెంగాల్‌కు చెందిన యువ సైంటిస్ట్‌ డాక్టర్‌ సురజిత్‌ ధార. ప్రస్తుతం హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో సైంటిస్ట్‌గా పనిచేస్తున్న ఆయన.. ఇటీవల 2011 డాక్టర్‌ ఎన్‌.ఎస్‌.సత్యమూర్తి యంగ్‌సైంటిస్ట్‌ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా సాక్షి ‘‘భవిత’’ సురజిత్‌ను ప్రత్యేక ఇంటర్వ్యూ చేసింది. ఆ వివరాలివే...
మీ విద్యా నేపథ్యం, ఇంతవరకు సాధించిన అవార్డులు? పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీజిల్లా తారకేశ్వర్‌. 1998లో బీఎస్సీ పూర్తిచేశాను. ఆ తర్వాత పశ్చిమబెంగాల్‌లోని బురద్వాన్‌ యూనివర్సిటీలో ఎంఎస్సీ ఫిజిక్స్‌ చదివా. 1998 నుంచి 2003 వరకు బెంగళూరులో రామన్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఫిజిక్స్‌లో లిక్విడ్‌ క్రిస్టల్‌పై పరిశోధన సాగించాను. ఆ తర్వాత 2003 నుంచి 2006 వరకు బిట్స్‌ పిలానీ క్యాంపస్‌లో ఫిజిక్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో రీసెర్చర్‌గా పనిచేస్తున్నారు. ఇంతవరకు 40 జర్నల్స్‌ ప్రచురితమయ్యాయి. 2010లో లిక్విడ్‌ క్రిస్టల్‌ సొసైటీ అవార్డు, ఎర్లీ కెరీర్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు, 2011లో సత్యమూర్తి మెమోరియల్‌ అవార్డు లభించాయి.

శాస్తవ్రేత్త అవాలనుకోవడానికి కారణం?
చిన్నప్పటినుంచి ఫిజిక్స్‌ పట్ల ఇష్టం. అందుకే జీవితంలో సైంటిస్ట్‌ కావాలని నిర్ణయించుకున్నా. బెంగళూరులోని రామన్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో పీహెచ్‌డీ చేస్తున్న సమయంలో మధుసూదన్‌ అనే శాస్తవ్రేత్త నాకు ఆదర్శంగా నిలిచారు.
ప్రస్తుతం ఏ అంశాలపై మీరు రీసెర్చ్‌ చేస్తున్నారు? మీ పరిశోధనల వలన సామాన్య మానవాళికి కలిగే మేలు? ఫిజిక్స్‌లో సాఫ్ట్‌ కండెక్ట్‌ మేటర్‌ అనే అంశంపై పరిశోధనలు చేస్తున్నాను. ప్రధానంగా సినిమా ప్రొజెక్టర్లు, టీవీలు, ల్యాప్‌ టాప్‌లు,సెల్‌ఫోన్లు తయారీలో భాగంగా ఈ సాధనాల డిస్‌ప్లే(ఎలక్ట్రానిక్‌ విజువల్‌ డిస్‌ప్లే) క్లారిటీగా కనిపించడం కోసం లిక్విడ్‌ క్రిస్టల్‌ను వాడుతున్నారు. దీనిపై ప్రస్తుతం పరిశోధన జరుగుతోంది. దీనిద్వారా ఈ సాధనాల డిస్‌ప్లేలో నాణ్యతతోపాటు మరింత క్లారిటీగా డిస్‌ప్లేలు తయారుచేయడానికి నా పరిశోధన దోహదపడుతుంది.

సైన్స్‌ విద్యార్థులకు భవిష్యత్తులో ఎలాంటి అవకాశాలుంటాయి? ఫిజిక్స్‌ రంగం ఏవిధంగా మారబోతోంది?
సైన్స్‌ రంగంలో ఫిజిక్స్‌కు అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. ఫిజిక్స్‌లో పరిశోధనలు ప్రోత్సహించడానికి, పరిశోధనలు చేయడానికి పేరున్న సంస్థలు దేశంలో ప్రస్తుతం సీఐఎస్‌ఆర్‌, ఐఐఎస్‌టీ వంటివి మినహా ఎక్కువ లేవు. వీటి సంఖ్య పెరిగితేనే ఈ రంగంలో కొత్తపరిశోధనలు, ఆవిష్కరణలు చేయడానికి వీలవుతుంది. ముఖ్యంగా ఫిజిక్స్‌లోని బయోఫిజిక్స్‌, సాఫ్ట్‌మెటల్‌, బయోటెక్నాలజీ విభాగాల్లో మంచి అవకాశాలు రానున్నాయి.
సైన్స్‌ రీసెర్చ్‌లో అడుగుపెట్టేవారి సంఖ్య తక్కువగా ఉంటోంది. సైన్స్‌లో పరిశోధనల వైపు ఎక్కువ మందిని ఆకర్షించాలంటే ఏం చేయాలి? విద్యార్థులను సైన్స్‌ పరిశోధన వైపు ఆకర్షించాలంటే.. కాలేజీ స్థాయి నుంచే అధ్యాపకులు, తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించాలి. వాస్తవానికి సమస్య కాలేజీల్లోనే ఉంది. నాణ్యమైన అధ్యాపకులు లేకపోవడంతో సబ్జెక్టును లోతుగా అవగాహన చేసుకోవడంలో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సైన్స్‌ విద్యార్థి ఇంటర్‌స్థాయి నుంచే తరగతి గదితోపాటు ల్యాబ్‌లో ఎక్కువసేపు సమయం గడపాలి. కాని ఇప్పుడు చాలామంది విద్యార్థులు థియరీకే పరిమితం అవుతున్నారు. ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ మొక్కుబడిగా మారిపోయింది. ఇంటర్‌ నుంచే విద్యార్థులు సొంతంగా ఆలోచించడం అలవాటు చేయాలి.
అమెరికా వంటి దేశాలతో పోల్చినప్పుడు శాస్తస్రాంకేతిక రంగాల్లో భారత వెనుకబాటుకు కారణం? శాస్తస్రాంకేతిక రంగాల్లో భారత్‌ వెనుకబడిపోయిందని చెప్పడం సమంజసం కాదు. ప్రస్తుతం పరిశోధన రంగంలో భారత్‌ క్రమేణా పురోగతి సాధిస్తోంది. మిగతా దేశాలతో పోల్చితే బేసిక్‌ సైన్స్‌ రీసెర్చ్‌లో మనమే ముందంజలో ఉన్నాం. అంతేకాదు.. సైన్స్‌ పరిశోధనకు సంబంధించి మన దేశం నుంచి ఇప్పటికే అనేక జర్నల్స్‌ ప్రచురితమయ్యాయి. సైన్స్‌ రంగంలో కొత్త ఆవిష్కరణలు చేయాలన్నా.. కొత్త పరికరాలు సష్టించాలన్నా.. శాస్తవ్రేత్తలకు పరిశ్రమలతో కలిసి పనిచేసే అవకాశం రావాలి. ఒకరకంగా ఇండస్ట్రీలు, శాస్తవ్రేత్తలు కలిసి పనిచేస్తే సమద్ధికరమైన ఆవిష్కరణలు ఎన్నో చేయవచ్చు. అయితే భారత్‌లో వివిధ పరిశ్రమలు, ప్రభుత్వం, సంస్థల నుంచి పరిశోధనకు సంబంధించి ప్రోత్సహం కొంత తక్కువే. దీన్ని అధిగమించగలిగితే సమస్య ఉత్పన్నంకాదు.
సైన్స్‌ పరిశోధనల్లో చెప్పుకోదగ్గ ఆవిష్కరణలు మన దేశంలో జరగడం లేదెందుకు? బ్రై న్‌ డ్రై న్‌ ఆపడమెలా?విదేశాలతో పోల్చితే ఇక్కడ పరిశోధనలు చేయాలనుకునే వారికి సౌకర్యాలు, ప్రోత్సాహం తక్కువగా ఉంటోంది. విదేశాల్లో రీసెర్చ్‌రంగంలో ఉన్నవారికి అడుగడుగునా ప్రభుత్వం, పారిశ్రామిక సంస్థలు ప్రోత్సాహం కల్పిస్తున్నాయి. అక్కడ ఏ ఫార్ములా కనుగొన్నా బయట ప్రపంచంలోకి రావడానికి ఎంతో సమయం పట్టదు. ఇక్కడ అలా కాదు. ఆర్థిక సమస్యలు, ప్రోత్సహలేమి సైన్స్‌ రంగంలో ఆవిష్కరణలకు అడ్డుపడుతున్నాయి. దేశంలో ప్రతిభావంతులైన విద్యార్థులు పరిశోధన రంగంలో ఉన్నారు. వీరికి ఉద్యోగభద్రత ఎంతైనా అవసరం. ఇది ఉంటేనే స్వేచ్ఛగా ఎవరైనా పరిశోధనలపై దష్టిపెట్టగలరు. అంతేకాదు.. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ బడ్జెట్‌ను ప్రభుత్వం పెంచాలి. అప్పుడే ఫలితాలొస్తాయి. బ్రెయిన్‌ డ్రై న్‌ అరికట్టాలంటే... రీసెర్చ్‌కు తగ్గ మౌలిక సదుపాయాలు, ల్యాబ్స్‌, నిర్ణయాలు, ఆలోచనల్లో స్వేచ్ఛ, అడ్మినిస్ట్రేషన్‌, మానిటరింగ్‌ వంటి పలు సౌకర్యాలు, సమస్యలు తొలగిస్తే సైంటిస్టులకు స్వేచ్చగా పనిచేసుకునే వీలుంటుంది. అప్పుడే వీరు ముందుకొస్తారు.
కంపెనీల్లో ఖాళీలున్నా.. ఉద్యోగాలు దొరక్క విద్యార్థుల ఎదురుచూపులు? కారణం? పరిష్కారం? ఏ దేశవిద్యా విధానంలోనైనా అక్కడి కంపెనీలకు, క్యాంపస్‌లు, కాలేజీలకు మధ్య ముందుచూపుతో కూడిన ఆరోగ్యకరమైన అవగాహన అవసరం. అలా అయితేనే పరిశ్రమలకు కావలసిన మానవ వనరులను తయారుచేయడానికి వీలవుతుంది. కాని ఇక్కడ కాలేజీలకు, క్యాంపస్‌లకు పరిశ్రమలు ఎవరిదారి వారిదే అన్నట్లు వ్యవహరిస్తున్నాయి. ఒకరి అవసరాలు ఒకరు తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదు. కంపెనీల అవసరాలు కాలేజీలకు చెప్పడం లేదు. కాలేజీల కరికులం, కోర్సు రూపకల్పన, కంపెనీల అవసరాలు తీర్చేవిధంగా ఉండడంలేదు. ఈ లోపం ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్తు మీద ప్రభావం చూపుతోంది. ప్రస్తుత విద్యావిధానంలో ల్యాబ్‌ అంటే ఏంటి? అందులో చేసిన ప్రాక్టీస్‌ పరిశోధన ఏంటి? అని ఏ విద్యార్థిని అడిగినా మొహం తేలేసే పరిస్థితి ఉంది. దీనికి కారణం.. కాలేజీలో కనీసం ల్యాబ్‌లు, నాణ్యమైన అధ్యాపకులు లేకపోవడమే. కనీసం డిగ్రీ స్థాయిలోనైనాసరే ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ నేర్పే విధానం సమర్థవంతంగా అమలుచేస్తేనే ప్రయోజనం ఉంటుంది.
సైన్స్‌ విద్యలో నాణ్యత పెంచాలంటే ఎలాంటి సంస్కరణలు అవసరం? 
సైన్స్‌ అంటే కేవలం పుస్తకాలు చదవడమే కాదు. సబ్జెక్టును అర్థం చేసుకోవాలి. ఆలోచించాలి. అన్వయించాలి. ల్యాబ్స్‌లో పరీక్షించాలి? ఇవన్నీ చేయాలంటే కాలేజీల్లో విద్యార్థులకు తగిన మౌలికసదుపాయాలు కల్పించాలి. ల్యాబ్‌సౌకర్యాలు ఉండాలి. ప్రభుత్వ,ప్రై వేటు కాలేజీలు కలిసి కూర్చుని పరిశ్రమల ప్రతినిధుల సమక్షంలో కరికులం రూపకల్పన చేయాలి. ఇది జరిగితేనే సైన్స్‌కు,ై సెన్స్‌ చదువుకు సార్థకత.

పరిశోధన రంగాన్ని కెరీర్‌గా ఎంచుకోవాలనుకునే విద్యార్థులకు మీ సలహా? 
కచ్చితంగా సైన్స్‌పై ఆసక్తి ఉండాలి. ఇది లేకుండా ఏదో అవకాశం వస్తుందనే ఉద్దేశంతో ఈ రంగంలోకి అడుగుపెడితే ఎంతో విలువైన సమయం వథా అవుతుంది. ఒకటికిపదిసార్లు ఆలోచించుకోవాలి. సైన్స్‌ సబ్జెక్టుపై ఆసక్తి, సహనం, కొత్త ఆవిష్కరణలు చేయాలన్న సంకల్పం ఉన్నవాళ్లే ఈ రంగంలో విజేతలవుతారు. అందుకే స్పష్టమైన లక్ష్యంతో రీసెర్చ్‌లోకి అడుగుపెట్టినవాళ్లు సక్సెస్‌ సాధించడం సాధ్యమే.

పరిశోధన రంగంలో పనిచేస్తున్న వారికి మీ సలహా?హార్డ్‌వర్క్‌.. ఏ రంగంలోనివారికైనా ఈ సూత్రం వర్తిస్తుంది. పట్టుదలగా పనిచేయడం, అంకితభావం, సహనం.. ఇవన్నీ ఉంటే సక్సెస్‌కు దగ్గరవుతారు. రీసెర్చ్‌లో అనుకున్నవెంటనే ఫలితాలురావు. కొన్నిసార్లు ఏళ్ల శ్రమ వథాగా పోవచ్చు. అలాంటప్పుడే ఆత్మవిశ్వాసంతో పనిచేయగలగాలి. అప్పుడే విజయం వరిస్తుంది.

మీ జీవిత లక్ష్యం? 
సైంటిస్ట్‌గా సామాన్యమానవాళికి ఉపయోగపడేలా ఆవిష్కరణలు చేయాలి. ముఖ్యంగా బయోఫిజిక్స్‌లో ఎవరూ చేయనివిధంగా పరిశోధనలుచేసి దేశానికి పేరుతేవడమే లక్ష్యం!!

యువ శాస్త్రవేత్తలకు అద్భుత అవకాశాలు-సైంటిస్ట్ సతీష్‌రెడ్డి

అగ్ని 5 క్షిపణి తయారీకి రేయింబవళ్లు పనిచేశాం. దేశం కోసం పనిచేయడం ఎవరికైనా గర్వకారణం. డీఆర్‌డీవోలో 7వేలకుపైగా సైంటిస్టులు దేశం కోసం యజ్ఞం చేస్తుంటారు. భారతదేశం ఇతర ప్రపంచ దేశాల సరసన నిలబడబోతుందనే నిజం పరిశోధన శాలలో ఉత్సాహాన్ని నింపింది. దేశం గర్వించదగ్గ క్షిపణి శాస్త్రవేత్తగా ఎదుగుతానని ఏనాడు అనుకోలేదు. ఇంజనీరింగ్ విద్యార్థులు ఉద్యోగం కంటే పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వాలి. దేశంలో యువ శాస్త్రవేత్తలకు అద్భుతమైన భవిష్యత్తు ఉంది అంటున్నారు దేశానికి గర్వకారణమైన అగ్ని5 ఖండాంతర క్షిపణి తయారీలో నేవిగేషన్ విభాగం డెరైక్టర్‌గా అత్యంత కీలకపాత్ర పోషించిన రాష్ట్రానికి చెందిన సైంటిస్టు సతీష్‌రెడ్డి. 2011 సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గ్రహీత ఆయనతో సాక్షి భవిత ప్రత్యేక ఇంటర్వ్యూ... 

అగ్ని5 క్షిపణి ప్రయోగం విజయం మీకు ఎలాంటి అనుభూతినిచ్చింది? అగ్ని5 క్షిపణి ప్రయోగం దేశ చరిత్రలో మైలురాయి. జాతి యావత్తు గర్వించదగ్గ రోజు. ప్రతి భారతీయుడు ఉద్విగ్న క్షణాలకు లోనైన సందర్భమది. ముఖ్యంగా మా శాస్త్రవేత్తల బృందం ఆనందానికి అవధుల్లేవు. అగ్ని5 సక్సెస్ అయ్యాక శాస్త్రవేత్తలంతా చిన్నపిల్లల్లా కేరింతలు కొట్టారు. క్షిపణి ప్రయోగంలో ఐదు దేశాల సరసన భారత్ సగర్వంగా తలెత్తుకు నిలిచిన రోజది. ఎందుకంటే.. క్షిపణి తయారీకి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం బారత్‌కు అందకుండాకొన్ని దేశాలు అడ్డుకున్నా... మనం సొంతంగా ఈ ఘనతను సాధించడం సాధారణ విషయం కాదు. అగ్ని5 ప్రయోగం ద్వారా అందివచ్చిన టెక్నాలజీ... భవిష్యత్తులో అనేక అత్యాధునిక క్షిపణుల తయారీకి ఉపయోగపడుతుంది. నేను అగ్ని5లో నేవిగేషన్ వ్యవస్థకు డెరైక్టర్‌గా పనిచేశా. క్షిపణి విజయవంతంగా దూసుకెళ్లడంలో నావిగేషన్ వ్యవస్థ చాలా కీలకం. క్షిపణిని ప్రయోగించిన తర్వాత అసలది అనుకున్న దిశలోనే ప్రయాణిస్తుందా? లేదా లక్ష్యానికి దూరంగా వెళ్తుందా? అనేది నేవిగేషన్ ద్వారానే తెలుస్తుంది. ప్రతి సెకెన్లో వందోవంతులో క్షిపణి ఎక్కడుంది? ఎంత వేగంతో ప్రయాణిస్తుంది? వంటి వివరాలన్నీ నావిగేషన్ వ్యవస్థ ద్వారానే తెలుసుకోవడానికి వీలవుతుంది. ప్రపంచంలో క్షిపణి నేవిగేషన్ టెక్నాలజీ కేవలం 4 దేశాలకు మాత్రమే ఉంది. ఇప్పుడు ఆ ఘనతను మనం సాధించాం. 

డీఆర్‌డీవోలో పరిశోధనల తీరు ఎలా ఉంటుంది.. సైంటిస్టుల పనివిధానం వివరిస్తారా? 
దేశంలో డీఆర్‌డీవోకు మొత్తం 52 ల్యాబ్‌లున్నాయి. ఇక్కడ సైనికుల ఆహార అవసరాల నుంచి శత్రువులను ఎలా ఎదుర్కోవాలనే విషయం వరకూ... నిత్యం రకరకాల విషయాలపై పరిశోధనల యజ్ఞం జరుగుతూనే ఉంటుంది. ప్రస్తుతం డీఆర్‌డీవోలో 7,500 మంది సైంటిస్టులు పనిచేస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరుల్లోనే కీలకమైన రీసెర్చ్ విభాగాలున్నాయి. డీఆర్‌డీవో వ్యవస్థలో అత్యంత కీలకమైన క్షిపణుల తయారీ ల్యాబ్ హైదరాబాద్‌లో ఉంది. ఆ తర్వాత బెంగళూరులోని ఏరోనాటికల్ ల్యాబ్ కీలకమైనది. ఇవేకాకుండా సైనికులు హిమాలయాలు, ఇతర సరిహద్దు ప్రాంతాల్లో భారీ ఆయుధ సామగ్రి బరువులతో సుదీర్ఘ సమయం నడుస్తారు. దాంతో వారు శారీరకంగా త్వరగా అలసిపోతున్నారు. వారికోసం అతి తక్కువ బరువుతో.. ఎక్కువ శక్తినిచ్చే ఆహారాన్ని ప్రస్తుతం డీఆర్‌డీఏ తయారు చేస్తోంది. అలాగే హిమాలయ పర్వతప్రాంతాల్లో సైనికులకు అవసరమైన కూరగాయలను పండించడంతోపాటు అక్కడ దొరికే ఔషధ మొక్కలతో వివిధ వ్యాధులకు మందులు కనుక్కోవడంపై కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. 

క్షిపణి తయారీకి ఎన్నేళ్లుపడుతుంది? దానివెనుక కృషి ఎలా ఉంటుంది?
ఒక క్షిపణిని డిజైన్ చేసి, దానికి టెక్నాలజీ రూపొందించి, విజయవంతంగా ప్రయోగించి సైన్యానికి అందివ్వడానికి ఇవ్వడానికి 15 ఏళ్లు పట్టేది. కఠోరశ్రమ, సాధనతో ఈ సుదీర్ఘ వ్యత్యాసాన్ని డీఆర్‌డీవో గణనీయంగా తగ్గించింది. అసలు ఎలాంటి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ లేకుండా.. జీరో స్థాయి నుంచి క్షిపణిని తయారుచేయడానికి ఇప్పుడు 5ఏళ్లు పడుతుంది. కనీస టెక్నాలజీ ఉంటే నాలుగేళ్లకే క్షిపణని సిద్ధం చేయొచ్చు. క్షిపణి తయారీ ఒక యజ్ఞం లాంటిది. దీని తయారీకి కనీసం 300 నుంచి 500 మంది సైంటిస్టులు, ఇతర విభాగాల నిపుణులు అవసరం ఉంటుంది. 

డీఆర్‌డీవో నుంచి ఇంకా కొత్త ఆవిష్కరణలేవైనా ఆశించవచ్చా? 
మన దేశంపై శత్రుదేశాలు దాడిచేయడానికి ప్రయోగించే క్షిపణులను గుర్తించి మధ్యలోనే వాటిని నాశనం చేసే ఎయిర్ డిఫెన్స్ సిస్టంను డీఆర్‌డీవో అభివృద్ధి చేస్తోంది. తక్కువ ఎత్తులో ప్రయాణించే క్రూయేజ్‌మిషన్లు, అన్‌మ్యాన్‌డ్ ఎయిర్ వెహికల్స్(యూఏవీ), అడ్వాన్స్‌డ్ టార్పెడ్స్‌ను భవిష్యత్తులో అందుబాటులోకి తీసుకురానుంది. 

ఇంజనీరింగ్ విద్యార్థులకు భవిష్యత్తులో ఎలాంటి అవకాశాలున్నాయి?ఇంజనీరింగ్ అంటే.. సాఫ్ట్‌వేర్ ఒకటే అనుకుంటున్నారు చాలామంది. వీటికిమించి ఎన్నో గొప్ప అవకాశాలున్నాయి. బీటెక్ పూర్తై వాళ్లకు డీఆర్‌డీవో ఏటా 500 నుంచి 1,000 మంది వరకు కొత్త సైంటిస్టులను తీసుకుంటుంది. గడచిన 7, 8 ఏళ్లలో ఎందరో ఐఐటీ విద్యార్థులు డీఆర్‌డీవోలో చేరారు. పైగా ఇంజనీరింగ్ విద్యార్థులు ఈ రంగంలో ఎన్నో విజయాలు సాధిస్తున్నారు. కీలకమైన ఎయిర్ డిఫెన్స్ తయారీలో యువ ఇంజనీర్లదే కీలకపాత్ర. అందుకే దీన్ని యువ ఇంజనీర్లకు అంకితమిచ్చారు. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్(ఆర్‌అండ్‌డీ), ఐఐసీటీ, ఎన్‌జీఆర్‌ఐ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో ఇంజనీరింగ్ విద్యార్థులకు లక్షల్లో అవకాశాలున్నాయి. ఇవికాకుండా బోధన రంగంలో, ప్రాజెక్టు వర్కుల్లో ఎన్నో అవకాశాలు వరించనున్నాయి.

సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌కు వెళ్లడం కోసమే ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్లు ఎక్కువిప్పుడు! ఈ పరిస్థితిలో ఇంజనీర్లను రీసెర్చ్‌వైపు ఆకర్షించాలంటే ఏం చేయాలి? 
ఈ పరిస్థితికి ఎవరినీ తప్పుపట్టలేం. ఎందుకంటే.. వాస్తవానికి బేసిక్ సైన్స్‌పై రీసెర్చ్ బాగా తగ్గిపోయింది. ఈ సమస్య అన్ని దేశాల్లోను ఉంది. దేశంలో ఏదో ఒకమూల రీసెర్చ్ ఫలితాలు ఎప్పటికప్పుడు వెలుగులోకి వస్తుంటేనే.. విద్యార్థులకు రీసెర్చ్‌పై ఆసక్తి పెరుగుతుంది. ఏదైనా కొత్తది పుట్టుకొస్తేనే ఆ రంగంపై ఆసక్తి పెరుగుతుంది. ఇప్పుడు అగ్ని5 విజయవంతం కావడంతో డీఆర్‌డీవో, సైంటిస్టులన్నా, రీసెర్చ్ అన్నా ఆసక్తిపెంచుకునే వాళ్ల సంఖ్య పెరుగుతోంది.

సైంటిస్టులకు ప్రభుత్వం ప్రోత్సాహం సరిపోతుందా? ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? కేంద్ర ప్రభుత్వం ఇటీవల సైంటిస్టులకు ప్రోత్సాహకాలు భారీగా పెంచింది. అందులోభాగంగా ప్రత్యేక అలవెన్సులు పెంచింది. ఇది మంచి పరిణామం. అదేవిధంగా చేసిన పనిని బట్టి కూడా గుర్తింపు ఇస్తున్నారు. ఇది వారిలో ఉత్తేజాన్ని పెంచి మంచి పరిశోధనలు చేయడానికి దారితీస్తుంది.

పరిశోధన రంగాన్ని కెరీర్‌గా సక్సెస్ సాధించాలంటే? మిగిలిన కెరీర్లతో పోల్చితే ప్రస్తుతం పరిశోధన రంగం అద్భుతంగా ఉంది. ఆర్‌అండ్‌డీ ఆవశ్యకతను గుర్తించిన ప్రభుత్వం ఇప్పుడిప్పుడే సైంటిస్టులకు అనేక ప్రోత్సాహకాలిస్తుంది. ఈ రంగంలో వృత్తి సంతృప్తి ఎక్కువ. దేశానికి మనవల్ల ప్రయోజనం కలగబోతుందనే విషయం అడుగడుగునా ఉత్తేజాన్ని నింపుతుంది. సైంటిస్ట్ కెరీర్ ఎంచుకుంటే సక్సెస్ కాలేమని, పరిశోధనల్లో ఫలితాలకు అనేక ఏళ్లు పడుతుందనే అపప్రద ఉంది. మంచి సమస్య ఎంచుకుని దానిపై పరిశోధన చేస్తే తక్షణమే మంచి ఫలితాలొస్తాయి. దీన్ని విస్మరిస్తే ఫలితాలు రావడానికి ఎక్కువ సమయం పడుతుంది. లక్ష్యాలు ఏర్పాటు చేసుకోండి. వాటిని సాధించడానికి అవిరళ కృషిచేయండి. విజయాలు ముంగిట వాలుతాయి.

డీఆర్‌డీవోలో పనిచేయాలనుకునే రీసెర్చ్ విద్యార్థులకు మీ సలహా? 
డీఆర్‌డీవోలో పనిచేసే అవకాశం రావడమంటే భారతదేశ రక్షణ విభాగంలో పనిచేసే అవకాశం వచ్చినట్టే. దేశం కోసం పనిచేయడానికి మార్గం ఏర్పరచుకున్నట్టే. ఇక్కడ జూనియర్ సైంటిస్ట్‌గా చేరితే ఆలోచన విధానం, దేశం కోసం ఏదో ఒకటి సాధించాలన్న తపన కచ్చితంగా పెరుగుతుంది.
మీ విద్యా, కుటుంబ నేపథ్యం? 
మాది నెల్లూరు జిల్లా, ఆత్మకూరు మండలం, మహిమలూరులో వ్యవసాయ కుటుంబం. 1978-80లో ఇంటర్ పూర్తిచేశాను. 1980 నుంచి 1984 వరకు అనంతపురం జేఎన్‌టీయూలో ఈసీఈలో బీటెక్ చదివాను. 1985లో డీఆర్‌డీవోలో చేరా. కాలేజీ రోజుల నుంచే నాకు దేశభక్తి ఎక్కువ. మా స్నేహితులంతా ఇంజనీరింగ్ పూర్తిచేసి విదేశాల్లో సెటిలయ్యారు. నాకు మాత్రం దేశం విడిచి వెళ్లాలనిపించేదికాదు.

సైంటిస్టు కావాలని ఎందుకనుకున్నారు?చిన్నప్పటి నుంచీ ఇంజనీరింగ్ అంటే చాలా ఇష్టం. బీటెక్ పూర్తయ్యాక సైంటిస్ట్‌నవుతానని ఏనాడు అనుకోలేదు. దేశం యావత్తు గర్వించే క్షిపణి తయారీలో భాగస్వామినవుతానని కలలో కూడా ఊహించలేదు. కాకతాళీయంగానే సైంటిస్ట్‌నయ్యా. ఉద్యోగం కోసం ఇస్రో, డీఆర్‌డీవో, అటమిక్ ఎనర్జీ ఈ మూడు సంస్థలకు దరఖాస్తు చేశా. చివరకు డిఫెన్స్‌రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్‌డీవో)లో జాబ్ వచ్చింది. ఇక్కడకు వచ్చాక సైంటిస్ట్ గొప్పతనమేంటో తెలిసింది. అప్పటినుంచి ఎంతగానో కష్టపడి పనిచేశా. చివరకు ఈ స్థాయికి వచ్చాను.

ఇప్పటివరకు సాధించిన అవార్డులు?
1999లో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి చేతులమీదుగా యువశాస్త్రవేత్త అవార్డు, 2007లో ప్రధాని మన్మోహన్ నుంచి పెర్ఫార్‌మెన్స్ ఎక్స్‌లెన్స్ అవార్డు, 2011లో రక్షణ మంత్రి ఆంటోని నుంచి సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నాను. ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ ఫెలోషిప్ అవార్డుకు ఎంపికయ్యారు.

కెరీర్లో మీరు బాగా గర్వపడిన సందర్భం? 
2006లో ఒక క్షిపణిని ప్రయోగించినప్పుడు అందులో ఏకకాలంలో నాలుగు క్షిపణి నేవిగేషన్ వ్యవస్థలను ఉంచి ప్రయోగం చేశాం. ఈ నాలుగూ చాలా యాక్టివ్‌గా పనిచేశాయి. ఇది నాకు గర్వకారణం. ఎందుకంటే.. నేను చేసిన ప్రయోగం వలన బయటదేశాల నుంచి నేవిగేషన్ వ్యవస్థలను కొనుగోలుచేసే పరిస్థితి తప్పుతుంది. అంతేకాకుండా.. ఆయా దేశాలిచ్చే టెక్నాలజీ కోసం మనం ఎదురు చూడనవసరం లేదు. ఈ ప్రయోగం విజయవంతమవడంతో విదేశీమారక ద్రవ్య నిల్వలు వెచ్చించి టెక్నాలజీ కొనుక్కునే పరిస్థితి నుంచి బయటపడ్డాం.

డీఆర్‌డీవోలో మాజీ రాష్ట్రపతి కలాంతో పనిచేశారు కదా? ఆయన్నుంచి ఏం నేర్చుకున్నారు? 12ఏళ్లపాటు అబ్దుల్ కలాంతో కలిసి పనిచేశా. నిజంగా ఇది గర్వకారణం. దేశం గర్వించే వ్యక్తితో అంతకాలం పనిచేసే అవకాశం అదృష్టంగా భావిస్తాం. అతి సాధారణంగా, ఎలాంటి బేషజాలు లేకుండా కష్టపడి పనిచేస్తూ యువరక్తానికి అవకాశాలిచ్చే మహోన్నత వ్యక్తి ఆయన. యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహించడంలో ఆయనకు ఆయనేసాటి. నా ఆదర్శ వ్యక్తుల్లో కలాం ఒకరు.

ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచుకోవాలి - DRDO RAC Chairman D.N.Reddy


కొన్ని వర్సిటీలకే డీఆర్‌డీఓ పరిశోధన ప్రాజెక్టులు వస్తున్నాయి. మిగతా కాలేజీలనూ ప్రోత్సహిస్తే రీసెర్చ్ విద్యార్థులకు ప్రయోజనం ఉంటుంది కదా?  
ఏదైనా వర్సిటీ తన వద్దనున్న వనరులు, పరిశోధనాసక్తి వివరాలతో ముందుకువస్తే.. ప్రతిభ ఆధారంగా ప్రాజెక్టులు ఇవ్వడానికి సిద్ధమే. వాస్తవానికి ఐఐటీ, ఐఐఐటీల్లో ఫ్యాకల్టీకి బోధనభారం కొంత తక్కువగా ఉంటుండటంతో రీసెర్చ్‌లో రాణిస్తున్నారు. అందుకే వారికి వరుస ప్రాజెక్టులు లభిస్తున్నాయి.
మిగతా వర్సిటీల్లోని ప్రొఫెసర్లకు బోధన బాధ్యతలు ఎక్కువ. పైగా సాధారణ వర్సిటీలు, కాలేజీల్లో బోధన సిబ్బంది ఎక్కువ శాతం తాత్కాలిక ప్రొఫెసర్లే. పూర్తిస్థాయి సిబ్బంది కలిగిన వర్సిటీలు ఉంటే ప్రాజెక్టులివ్వడానికి మేం సిద్ధమే.

ఏటా 200 మంది యువ సైంటిస్టులకు ఉద్యోగాలిస్తామని డీఆర్‌డీఓ చెబుతోంది. దేశంలో లక్షల సంఖ్యలో ఉన్న ఇంజనీరింగ్, సైన్స్ అభ్యర్థులకు 200 పోస్టులు చాలా తక్కువ కదా?
ఏటా 500కుపైగా యువ శాస్త్రవేత్తలను తీసుకోవాలనుకుంటున్నాం. కానీ అనుమతులు 200కు మించి రావడంలేదు. ఆర్థికభారం దృష్ట్యా ఈ సంఖ్యను పెంచడం కష్టమవుతోంది. ఇకపై ఈ సంఖ్యను పెంచడానికి ప్రయత్నిస్తాం.

దేశంలో ఏటా ఉన్నత విద్యలో చేరుతున్నవారు కేవలం 15 శాతమే. దీన్ని యూజీసీ పేర్కొన్నట్లు 22 శాతానికి పెంచడం సాధ్యమేనా?
ప్రయత్నిస్తే అసాధ్యమేమీ కాదు. కేవలం ప్రభుత్వ వర్సిటీలతోనే చేయాలంటే కష్టం. ప్రైవేటు యూనివర్సిటీల పాత్ర కూడా ముఖ్యమే. దేశంలో మొత్తం 110కిపైగా ప్రైవేటు వర్సిటీలున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ వర్సిటీలు కలిసి పనిచేస్తే.. ఉన్నత విద్యలో చేరేవారి సంఖ్యను పెంచడంతోపాటు పరిశోధన రంగానికి కూడా ఊతమివ్వొచ్చు.

చాలా వర్సిటీల్లో బోధన ప్రమాణాలు అంతంతమాత్రంగా ఉన్నాయి. మరోవైపు వచ్చే పదేళ్లలో వేయి వర్సిటీల ఏర్పాటును యూజీసీ లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల ప్రమాణాలు మరింత దిగజారతాయి కదా!
దేశంలో పెరుగుతున్న సామాజిక, పరిశోధన అవసరాలకు అనుగుణంగా వర్సిటీలను పెంచాలి. ఏటా పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యకు ప్రస్తుతమున్న వర్సిటీలు సరిపోవడంలేదు. డిమాండ్‌కు అనుగుణంగా కొత్త వర్సిటీల స్థాపన తప్పనిసరి. కానీ నాణ్యత దిగజారకుండా చూసుకోవాలి.
మౌలిక వసతులు లేకుండా.. కొత్త వర్సిటీలు స్థాపిస్తే ప్రమాణాలు దిగజారి విద్యార్థులు నష్టపోతారు. అందుకే ప్రతి వర్సిటీ 5 ఏళ్ల భవిష్యత్తు ప్రణాళికను సిద్ధం చేసుకొని.. బోధన, ఆర్థికపరంగా అంచనాలు రూపొందించుకొని రంగంలోకి దిగాలి. అప్పుడేప్రమాణాలు పడిపోకుండా ఉన్నత విద్యను అందించొచ్చు.

నాణ్యమైన బోధనలేక చాలా వర్సిటీల్లో రీసెర్చ్‌లో చేరడానికి విద్యార్థులే జంకుతున్నారు. వర్సిటీల్లో పరిశోధనలను ప్రోత్సహించాలంటే ఏంచేయాలి?
వర్సిటీల్లో రీసెర్చ్‌ను ప్రోత్సహించడానికి యూజీసీ 28 పథకాలు అమలుచేస్తున్నా వర్సిటీలు వీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంలేదు. ఏటా కాలేజీలు, వర్సిటీలకు ఇస్తున్న నిధుల్లో 50 శాతం మాత్రమే ఖర్చవుతుండగా.. మిగతా సొమ్మంతా యూజీసీకే తిరిగి వస్తోంది.
స్టేట్ వర్సిటీల్లో ప్రొఫెసర్లు, ఇతర బోధన సిబ్బంది జీతభత్యాలను రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలి. ఆయా ప్రభుత్వాలు ఈ పోస్టులను భర్తీచేయడంలేదు. దాంతో ప్రొఫెసర్లు లేక పరిశోధన కుంటుపడుతోంది. దీనివల్ల విద్యార్థులు పరిశోధనను కెరీర్‌గా ఎంచుకోవడానికి జంకుతున్నారు.

వర్సిటీల్లో కాలంచెల్లిన కోర్సులు.. కంపెనీల అవసరాలకు ఉపయోగపడని సిలబస్ అమలవుతుండడంతో విద్యార్థులు నష్టపోతున్నారనే అభిప్రాయం ఉంది?
ఇంజనీరింగ్ కాలేజీల్లో సిలబస్, కోర్సుల ఆధునికీకరణ కనీసస్థాయిలోనైనా జరుగుతోంది. ఆర్ట్స్, సైన్స్ కాలేజీల్లో కొత్త కోర్సుల రూపకల్పన, ఉపాధినిచ్చే సిలబస్‌ను ప్రవేశపెట్టే దిశగా ఒక్క అడుగూ పడడంలేదు. ఈ విషయాన్ని యూజీసీ కూడా గుర్తించింది. ప్రతి వర్సిటీలో నాణ్యమైన, సమర్థత కలిగిన ప్రొఫెసర్లుంటే విద్యార్థులకు ఉపాధి కష్టాలు ఉండవు. రాష్ట్రాల్లోని వర్సిటీల్లో 40 శాతానికిపైగా ప్రొఫెసర్ల కొరత ఉంది. దాంతో కాంట్రాక్టు ప్రొఫెసర్లతో కాలం నెట్టుకొస్తున్నాయి. ఇప్పటికైనా ప్రొఫెసర్ పోస్టులను భర్తీచేస్తే.. విద్యార్థులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచవచ్చు.

దేశంలో ఇంజనీరింగ్, ఆర్ట్స్, సైన్స్ కళాశాలల్లో ప్రొఫెసర్ల కొరత తీవ్రంగా ఉంది. ఇది కలవరపర్చే విషయం. దీన్ని యూజీసీ ఎలా ఎదుర్కోబోతోంది?
కొత్త ఇంజనీరింగ్ కాలేజీల ఏర్పాటు ఒక్కసారిగా పెరిగిపోవడంతో ప్రొఫెసర్ల కొరత తలెత్తింది. దేశంలో ఇప్పుడున్న అవసరాలకు ఏటా 10వేల మంది పీహెచ్‌డీ చేయాల్సి ఉండగా.. కేవలం 1,000 మంది మాత్రమే పీహెచ్‌డీ చేస్తున్నారు. దాంతో కొత్తగా అధ్యాపకులు తయారుకావడంలేదు. అంతేకాకుండా ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి చక్కని ఉద్యోగాలు లభిస్తున్నాయి. దాంతో వారు ఉన్నత విద్యవైపు వెళ్లడం లేదు. విద్యార్థులను పీహెచ్‌డీ వైపు ఆకర్షిస్తే ఫ్యాకల్టీ కొరత ఉండదు.

వర్సిటీల మధ్య కోర్సులు, ప్రొఫెసర్ల మార్పిడి కనీసస్థాయిలో కూడా జరగడం లేదనే అభిప్రాయముంది?
చాలా వర్సిటీలు పక్కనున్న మంచి వర్సిటీలను గుర్తించకుండా.. ఇతర దేశాలకువెళ్లి అక్కడి వర్సిటీలతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. ఎక్కువ ఖర్చుతో ప్రొఫెసర్లను దిగుమతి చేసుకుంటున్నాయి. ఇది సరికాదు. ప్రతి వర్సిటీ సహచర యూనివర్సిటీలతో కలిసి కోర్సులు, ప్రొఫెసర్ల మధ్య మార్పిడి జరిగేలా ఆయా వీసీలు చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో యూజీసీ నుంచి కూడా మరింత జాగ్రత్తపడతాం.

మన రాష్ట్రంలో చాలా వర్సిటీల నాణ్యత తీసికట్టుగా ఉంటోంది. పరీక్షల నిర్వహణ, కొత్తకోర్సుల రూపకల్పన వరకు నత్తనడక, మొక్కుబడి వ్యవహారమే? ఈ పరిస్థితికి కారణం?
వర్సిటీల పనిదినాల సంఖ్య బాగా తగ్గిపోతుండడంతో..ఆ ప్రభావం సిలబస్‌పై పడుతోంది. మనరాష్ట్రంలో ఒక్కసారే 5కుపైగా కొత్త వర్సిటీలు స్థాపించారు. తర్వాత వాటికి నిధులు ఇవ్వడంలోను, బోధన సిబ్బందిని నియమించడంలో నిర్లక్ష్యాన్ని చూపడం కూడా సమస్యలకు దారితీస్తోంది.
దాంతో పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన, ఇతర పాలనా వ్యవహారాలు నాసిరకంగా మారి విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలో నెడుతున్నాయి. అందుకే సరిగా పనిచేయని వర్సిటీలపై నిఘా పెట్టి..అవసరమైతే వాటి అనుమతులను రద్దుచేసేందుకు త్వరలో ట్రిబ్యునల్, మాల్‌ప్రాక్టీస్ బిల్లులను తేవడానికి యూజీసీ ప్రయత్నాలు చేస్తోంది

దేశంలో 110కిపైగా ప్రైవేటు యూనివర్సిటీలుంటే.. మనరాష్ర్టంలో ఒక్కటీ లేదు. కారణం?
ఉన్నత విద్య అవసరాలను ప్రభుత్వ వర్సిటీలొక్కటే తీర్చలేవు. అందుకే ప్రైవేటు, డీమ్డ్, స్టేట్ వర్సిటీల అవసరాలు పెరిగాయి. ఇప్పటివరకు 116 కొత్త ప్రైవేటు వర్సిటీల ఏర్పాటు అనుమతులు యూజీసీ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి.
ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన దరఖాస్తులు ఎక్కువే ఉన్నాయి. ఇప్పటివరకు దేశంలోని 18 రాష్ట్రాల్లో 110కిపైగా ప్రైవేటు వర్సిటీలుండగా.. మరో 5రాష్ట్రాల్లో ఒక్క ప్రైవేటు వర్సిటీ స్థాపన జరగలేదు. వీటికి అనుమతినివ్వాల్సిందే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే.

కోర్సులు పూర్తి చేసుకొని వచ్చేవారిలో నాణ్యత లోపిస్తుండటంతో.. ఉద్యోగాలివ్వడానికి కంపెనీలు నిరాకరిస్తున్నాయి. అలాంటప్పుడు విద్యార్థులకు ప్రత్యామ్నాయ మార్గమేంటి?
ఈ పరిస్థితికి వర్సిటీలనే తప్పుబట్టాలి. నైపుణ్యాలు విద్యార్థుల్లో పెరగాలంటే ముందు సిలబస్ మార్చాలి. కాలేజీలు, వర్సిటీల పని దినాలు పెరగాలి. బోధనలో కొత్త మార్పులు తెచ్చి విద్యార్థులు క్లాస్‌రూంకు వచ్చేలా చేయాలి. ప్రాజెక్టు వర్కులు పెంచి పరిశ్రమలతో అనుసంధానం కచ్చితంగా చేసి తీరాలి. ఉద్యోగానికి అవసరమైన లక్షణాలు కాలేజీలో ఉండగానే నేర్చుకునేలా ప్రొఫెసర్లు ప్రణాళిక రూపొందించాలి. కోర్సు ఏదైనా.. క్షేత్రస్థాయి నైపుణ్యం లభించేలా చేయాలి. ఇలా చేస్తే ప్రముఖ కాలేజీ విద్యార్థులకు వచ్చే జాబ్ ఆఫర్లు కచ్చితంగా సాధారణ వర్సిటీ, కాలేజీ విద్యార్థులకు వస్తాయి. సౌకర్యాలు లేని కాలేజీలో విద్యార్థులే సొంతంగా తమ నైపుణ్యాలు పెంచుకోవడానికి ఇంటర్నెట్ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి.

యూజీసీ సభ్యుడిగా వర్సిటీలు, కాలేజీలకు మీరిచ్చే సలహా?
అవసరమైనంత మంది ప్రొఫెసర్లను, నిధులను సమకూర్చుకోవాలి.అవసరాలకనుగుణంగా సిలబస్‌లో మార్పులు చేయాలి. కంపెనీలతో కలిసి వారి అవసరాలకు తగ్గట్లు పాఠ్యాంశాల్లో మార్పులు చేయాలి. ఇది జరిగితే విద్యార్థికి ఉపాధి సమస్య తలెత్తదు. ఐఐటీ, ముంబై కంప్యూటర్ కోర్సులకు, ఐఐఎం, బెంగళూరు మేనేజ్‌మెంట్ విద్యకు పెట్టింది పేరు. ఇలా ప్రతి యూనివర్సిటీ ఫోకస్డ్ ఏరియాలో దృష్టిపెట్టి రాణించాలి. ప్రతి అవసరానికి ప్రభుత్వ నిధులకోసం ఎదురుచూస్తే వర్సిటీ నాణ్యతను ఫణంగా పెట్టినట్టే. సొంతంగా నిధుల సమీకరణకు యత్నించాలి.

యూజీసీ-యూనివర్సిటీలు-రాష్ట్రాల ఉన్నతవిద్యా మండలి.. ఈ మూడింటికి మధ్య సమన్వయం ఉండడంలేదు. ఇది ఉన్నత విద్య ప్రమాణాలపై ప్రభావం చూపడం లేదంటారా?
సమన్వయలోపం మాట నిజమే. ఈ సమస్యకు పరిష్కారం సరైన నాయకత్వం. సమస్యల్లా నాయకత్వ లోపమే. అన్నిచోట్లా ఇప్పుడు బోధనతో సంబంధంలేని నిపుణులను వర్సిటీలు, ఉన్నతవిద్యామండలి ఉన్నతాధికారులుగా నియమిస్తుండడంతో..ప్రణాళికలేమితో ఈ వ్యవస్థలు నడుస్తున్నాయి.

దేశంలో విదేశీ వర్సిటీలతో మనకు కలిగే మేలేంటి?
అమెరికా, ఐరోపా దేశాల్లోని వర్సిటీలు విద్యార్థుల్లో క్షేత్రస్థాయి నైపుణ్యం పెంపొందించేందుకు కరిక్యులంలో పెద్దపీట వేస్తాయి. దాంతో అక్కడ స్టూడెంట్- జాబ్ సక్సెస్‌రేట్ చాలా ఎక్కువ. ఇటువంటి వర్సిటీలు మన దేశంలో ఏర్పాటైతే విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటుంది.
అంతేకాకుండా విదేశీ వర్సిటీల పోటీని తట్టుకోవడానికి.. ఇక్కడ వర్సిటీలు తమ పంథా మార్చుకుని విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తాయి.

యూనివర్సిటీలు, వాటి పరిధిలోని కాలేజీల మధ్య సమన్వయలోపం తీవ్రంగా ఉంది. ఈ పరిస్థితిని మార్చడమెలా?
యూనివర్సిటీలు, వాటిపరిధిలోని కాలేజీల మధ్య సమన్వయం తీసుకురావలసిన బాధ్యత ఉన్నత విద్యామండలిది. ఆ తర్వాత వైస్‌ఛాన్సలర్లది. వైస్ ఛాన్సలర్ల నియామకంలో బోధన అనుభవం ఉన్నవారికి పెద్దపీట వేస్తే వర్సిటీలు, కాలేజీల్లో ప్రమాణాలు పెరుగుతాయి. ఇది అంతిమంగా వర్సిటీ పనితీరును మెరుగుపర్చడానికి ఉపయోగపడుతుంది.

విద్యార్థులకు మీరిచ్చే సలహా? టెక్నాలజీ రోజురోజుకు విస్తరిస్తోంది. పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే.. దాన్ని ఔపోసనపట్టాల్సిందే. అందుకే వృత్తిఏదైనా.. ప్రాక్టికల్ నాలెడ్జ్‌ను వృద్ధిచేసుకోవాలి. అందరిలా ఏదో ఉద్యోగం చేసుకుపోదాం..! అనుకుంటే కెరీర్ గ్రాఫ్ ఆగిపోయినట్లే. ఎవరైతే సృజనాత్మకంగా ఆలోచిస్తారో.. వారికే మార్కెట్లో ఉద్యోగాలు వరిస్తాయి!!