Wednesday, 18 July 2012

లీడర్‌షిప్‌ క్వాలిటీస్‌.. మేక్స్‌ డిఫరెన్స్‌-ఐఐఎం, బెంగళూరు మార్కెటింగ్‌ విభాగం ప్రొఫెసర్‌ మిథిలేశ్వర్‌ ఝా


మేనేజ్‌మెంట్‌ విద్యార్థులకు కెరీర్‌ లక్ష్యాల గురించి స్పష్టత.. సబ్జెక్టుపై పట్టు.. మార్కెట్‌ పరిస్థితులు, కంపెనీల గురించి అవగాహన.. అన్నింటికంటే ముఖ్యంగా నాయకత్వ లక్షణాలుండాలి. దాంతోపాటు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ెురుగుపరచుకుంటే కెరీర్‌లో ముందుకు దూసుకుపోవచ్చు అంటున్నారు ఐఐఎం, బెంగళూరు మార్కెటింగ్‌ విభాగం ప్రొఫెసర్‌ మిథిలేశ్వర్‌ ఝా. క్యాట్‌ ఫలితాలు వెలువడ్డాయి.. కటాఫ్‌లు తెలిసాయి. ఇక మిగిలింది గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూలే..!దేశంలోనే ప్రతిష్టాత్మక బిజినెస్‌ స్కూల్స్‌ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనే జ్‌మెంట్‌లలో అడ్మిషన్‌ ప్రక్రియకు సర్వసిద్ధమవుతున్న నేపథ్యంలో... మేనేజ్‌మెంట్‌ కెరీర్‌పై ఐఐఎం ప్రొఫెసర్‌ ఝాతో ప్రత్యేక ఇంటర్వ్యూ...

గ్రామీణ ప్రాంత విద్యార్థులు మేనేజ్‌మెంట్‌ రంగంలో రాణించాలంటే?గ్రామీణ ప్రాంత మేనేజ్‌మెంట్‌ విద్యార్థులు అవకాశాల్లో తాము వెనుకబడిపోతున్నామని ఆందోళన చెందడం సరికాదు. కంపెనీల అవసరాలు గుర్తించి అందుకుతగ్గట్టుగా తమనుతాము మార్చుకుంటే.. ఎవరైనా కెరీర్‌లో సక్సెస్‌ సాధించవచ్చు. వాస్తవానికి మన దేశంలోని మేనేజ్‌మెంట్‌ రంగంలో.. కంపెనీల అవసరాలు, కాలేజీల కరిక్యులం మధ్య మిస్‌మ్యాచ్‌ కారణంగా విద్యార్థులు ఎక్కువగా నష్టపోతున్నారు. మిగతా బిజినెస్‌ స్కూళ్లతో పోల్చితే.. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం)లు ఎప్పటికప్పుడు పరిశ్రమలతో కలిసి పనిచేస్తుండడం, వారి అవసరాలమేరకు సిలబస్‌ను మార్చుతూ.. విద్యార్థులను తీర్చిదిద్దుతుండడం వల్లనే వాటికి మంచి ఆదరణ లభిస్తోంది. దేశంలోని ఇతర బిజినెస్‌ స్కూళ్లు, యూనివర్సిటీలు కూడా పరిశ్రమల అవసరాలకు తగ్గట్లు విద్యార్థులను తీర్చిదిద్దితే ఈ రంగంలో వారికి ఉజ్వల కెరీర్‌ సొంతమవుతుంది.

దేశంలో మేనేజ్‌మెంట్‌ విద్య భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? మేనేజ్‌మెంట్‌ అభ్యర్థులకు అవకాశాలు అపారం. దేశంలోని చిన్నాపెద్దా అన్ని కంపెనీలకు మేనేజ్‌మెంట్‌ నిపుణుల అవసరం ఉంది. చిన్నచిన్న కంపెనీల మొదలు భారీస్థాయి కంపెనీల వరకు మార్కెటింగ్‌, ఫైనాన్స్‌, హెచ్‌ఆర్‌, రిటైల్‌ వంటి విభాగాల్లో పెద్దఎత్తున ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. టెలికం, రిటైల్‌, బీపీవో రంగాల్లో నైపుణ్యం, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఉన్న విద్యార్థులు అయిదంకెల జీతాలతో కెరీర్లో దూసుకుపోవచ్చు.

మేనేజ్‌మెంట్‌ కాలేజీల్లో బోధనలో నాణ్యత సరిగాలేక విద్యార్థులు నష్టపోతున్నారు. పరిష్కారం? మేనేజ్‌మెంట్‌ విద్యలో నాణ్యత లోపించడానికి కాలేజీలు ఎడాపెడా పుట్టుకురావడం ఒకటే కారణం కాదు. నాణ్యతలేని ప్రొఫెసర్లు తరగతి గదుల్లో బోధిస్తుండడంతో మేనేజ్‌మెంట్‌ విద్యలో నాణ్యత తీసికట్టుగా మారుతోంది.
విద్యార్థులకు భవిష్యత్తులో మంచి అవకాశాలు రావాలన్నా.. నాణ్యమైన విద్యార్థులు తయారుకావాలన్నా.. నిపుణులైన అధ్యాపకుల అవసరం ఎంతో ఉంది.

మేనేజ్‌మెంట్‌ విద్యలో నాణ్యతకు ఎలాంటి సంస్కరణలు అవసరం? ఎంబీఏలో మార్కెటింగ్‌, ఫైనాన్స్‌, హెచ్‌ఆర్‌... ఇలా ఏ విభాగమైనా కీలకమైందే. ఈ రంగంలో పనిచేసేవారికి నాయకత్వ లక్షణాలతోపాటు ఎలాంటి పరిస్థితుల్లోనైనా పనిచేయగల మానసిక బలం అవసరం. అందుకే మేనేజ్‌మెంట్‌ విద్యలో మొదటి ఏడాది ఫస్ట్‌ సెమిస్టర్‌ నుంచే నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ నేర్పేవిధంగా ప్రాక్టికల్‌ ఎక్స్‌పోజర్‌ కల్పించాలి. అసలే సబ్జెక్టు నాలెడ్జ్‌ చాలా నాసిరకంగా అందుతోంది. అందుకే ఓవైపు కాలేజీలు వేటికవే బోధనలో నాణ్యతకు పెద్దపీట వేయాలి. నిపుణులైన అధ్యాపకులు, పరిశ్రమ నిపుణులతో తరగతులు నిర్వహించాలి. అదేవిధంగా కాలేజీల్లో అన్నిరకాల మౌలిక సదుపాయాలు కల్పించాలి.

పూర్తిస్థాయి నైపుణ్యంగల విద్యార్థిగా తయారుకావాలంటే? 
లెర్న్‌ కాన్సెప్ట్స్‌, డవలప్‌ కాన్ఫిడెన్స్‌, ప్రాక్టీస్‌, ఎక్స్‌పోజర్‌ టు ప్రాక్టీస్‌ ప్రాజెక్ట్స్‌, మేనేజ్‌మెంట్‌ నాలెడ్జ్‌ వంటివన్నింటిని విద్యార్థులు ఔపోసన పట్టాలి. ఫస్ట్‌ ఇయర్‌ ఫస్ట్‌సెమిస్టర్‌ నుంచే సబ్జెక్టుపై పట్టుతోపాటు ఇంగ్లిష్‌ నాలెడ్జ్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, లీడర్‌షిప్‌ క్వాలిటీస్‌ అలవర్చుకోవాలి. ఎందుకంటే... ప్రస్తుతం మేనేజ్‌మెంట్‌ విద్యార్థుల స్కిల్స్‌పై కంపెనీలు ఎక్కువగా ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఉంటున్నాయి. అలాంటి వారికే తమ సంస్థలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నయి. అందుకే ముందునుంచే
విద్యార్థులు ఈ లక్షణాలు అలవర్చుకోవాలి. గ్రామీణప్రాంత కాలేజీల్లో చదువుకునే విద్యార్థులు తమకు సౌకర్యాలు లేవనే కారణంతో చదువులో వెనకబడితే నష్టపోయేది వారే. అందుకే పట్టుదలతో కష్టపడాలి. ఇంటర్నెట్‌లో ఎంబీఏ సబ్జెక్టులపై
నిపుణుల అందించే సమాచారం విస్తతంగా ఉంది. ఆయా సమాచారాన్ని ఉపయోగించుకొని మార్కెట్‌కు అవసరమైన స్కిల్స్‌ను అందిపుచ్చుకోవచ్చు.

క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌లో కంపెనీలు విద్యార్థుల నుంచి ఎలాంటి లక్షణాలు ఆశిస్తున్నాయి? మేనేజ్‌మెంట్‌ కంపెనీ ఏదైనాసరే విద్యార్థులకు ఉద్యోగాలిచ్చేముందు క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లలో విద్యార్థిని అన్ని విభాగాల్లో పూర్తిస్థాయిలో పరీక్షిస్తున్నాయి. ఇండిపెండెంట్‌ థింకింగ్‌, లీడర్‌షిప్‌ క్వాలిటీస్‌, నాలెడ్జ్‌, హౌటుహ్యాండిల్‌ ద కాన్ల్ఫిక్ట్స్‌, సబ్జెక్టు నాలెడ్జ్‌, టోలరెన్స్‌... ఇలా అన్ని విషయాల్లో విద్యార్థుల మనోబలం, ఆత్మవిశ్వాసం, వే ఆఫ్‌ స్పీకింగ్‌ వంటివన్నింటిని పరిగణనలోకి తీసుకుంటారు. ఎందుకంటే.. ఒక సక్సెస్‌ఫుల్‌ మేనేజ్‌మెంట్‌ స్టూడెంట్‌కు ఈ లక్షణాలుంటేనే జాబ్‌, ఆ తర్వాత కెరీర్లో ఎదుగుదల ఉంటుంది.

పరిశ్రమల్లో లక్షలాది ఉద్యోగాలు ఒకవైపు... అవకాశాలు దొరక్క విద్యార్థుల అవస్థలు మరోవైపు.. దీనికి కారణం? పరిశ్రమలకు ఏం కావాలో ప్రస్తుతం అది విద్యార్థులకు నేర్పించడంలేదు. ఒకరకంగా చెప్పాలంటే.. కాలేజీల్లో బోధన.. పరిశ్రమల అవసరాలకు మధ్య గ్యాప్‌ ఎక్కువగా ఉంటోంది. అందుకే కంపెనీల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల్లోకి స్కిల్స్‌లేని
అభ్యర్థులను తీసుకోవడానికి కంపెనీలు ఇష్టపడడంలేదు. చివరకు సరైన అభ్యర్థులు దొరక్క అలానే నెట్టుకొస్తున్నాయి. అందుకే మేనేజ్‌మెంట్‌ విద్య చదువుకునే సమయంలోనే విద్యార్థులు భవిష్యత్తులో చేయబోయే ఉద్యోగానికి సంబంధించి నైపుణ్యం సంపాదించాలి. అంతేకాదు.. ఇంజనీరింగ్‌ కాలేజీలు పరిశ్రమలతో ఒప్పందం చేసుకుని తక్షణమే కరిక్యులం మార్చుకోవడం కొంత కష్టం కావచ్చు. కాని మేనేజ్‌మెంట్‌ విద్యలో పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వారితో
ఒప్పందానికి రావడం కాలేజీలకు పెద్ద కష్టంకాదు. కాలేజీలు ఎప్పుడూ కంపెనీలతో టచ్‌లో ఉంటేనే అంతిమంగా విద్యార్థుల కెరీర్‌ బాగుంటుంది.

మేనేజ్‌మెంట్‌ విద్యార్థులకు మీరిచ్చే సలహా? లెర్న్‌, అబ్జర్వ్‌, స్కిల్స్‌, లాంగ్వేజ్‌.. ఈ నాలుగు సూత్రాలు పాటించే ఏ మేనేజ్‌మెంట్‌ విద్యార్థి అయినాసరే ఎంబీఏ, ఎంసీఏ ఎందులోనైనా సులువుగా విజయం సాధించవచ్చు. కేవలం పేరొందిన కాలేజీలో సీటు వస్తే ప్లేస్‌మెంట్‌ వస్తుందనే భ్రమను తొలగించుకోవాలి. బాగా చదివే విద్యార్థి అయినాసరే చాలాసార్లు ఉద్యోగ ప్రయత్నంలో వెనకబడొచ్చు. అందుకే సబ్జెక్టును ఔపోసన పట్టడం, కమ్యునికేషన్‌ స్కిల్స్‌, ఎదుటివారికి మన భావాలు చక్కగా కమ్యునికేట్‌ చేయగలగడం... ఇవన్నీ నేర్చుకుంటే మేనేజ్‌మెంట్‌ కెరీర్‌లో సులువుగా పైకి ఎదగవచ్చు. ప్రస్తుతం ఇండస్ట్రీలో పనిచేస్తున్న ఎక్కువమందిలో ఈ లక్షణాలులేక ఇప్పటికీ అదే పొజిషన్‌లో ఉంటున్నారు.

ఐఐఎంలకు, ఇతర బిజినెస్‌ స్కూల్స్‌కు మధ్య వ్యత్యాసం? ఐఐఎం బెంగళూరు ప్రత్యేక ఏమిటి? ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం)లు ప్రత్యేక విద్యాసంస్థలు. మేనేజ్‌మెంట్‌ రంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులు గమనించడం, కంపెనీల అవసరాలను గుర్తించడం, వాటికి తగ్గట్టుగా ఏటా సిలబస్‌ను మార్చుకుంటూ
ముందుకు వెళ్తుండడంతో దేశంలో ఐఐఎంలు విజయపథంలో నడుస్తున్నాయి. పైగా ఇవి అటానమస్‌ వ్యవస్థలు కావడంతో మార్పులు సులువుగా చేసుకుంటూ... అనుకున్న లక్ష్యాలు సాధించడానికి మార్గం ఏర్పడుతోంది. అంతేకాదు.. పారిశ్రామిక రంగంలోని ప్రముఖ కంపెనీలను క్యాంపస్‌కు ఆహ్వానించడం, వారిని బోర్డు మెంబర్లుగా చేసి కంపెనీల అవసరాలను గుర్తించి వారితో పనిచేస్తుండడంతో ఐఐఎంల నుంచి నాణ్యమైన బిజినెస్‌ స్టూడెంట్లు తయారవుతున్నారు. మామూలు మేనేజ్‌మెంట్‌ విద్యాసంస్థలు ఇవేం చేయలేకపోయినా, అందులో సగం ప్రయత్నం చేసినా చాలు.

గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీల్లో మేనేజ్‌మెంట్‌ కోర్సు చదివే విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు రావడం కష్టంగా ఉంటోంది. అలాంటి విద్యార్థులకు మీరిచ్చే సలహా? సబ్జెక్టుపై పట్టు.. క్లియర్‌ ఎబౌట్‌ కెరియర్‌.. మార్కెట్లో ప్రముఖ కంపెనీలపై అవగాహన, ఆత్మవిశ్వాసం, లీడర్‌షిప్‌ ఎబిలిటీస్‌, కమ్యునికేషన్‌ స్కిల్స్‌... ఇవన్నీ ఉంటే చదివే కాలేజీ మంచిదైనా, చెడ్డదైనా జాబ్‌ గ్యారంటీ. నగరాల్లోని పేరొందిన కాలేజీల్లో మేనేజ్‌మెంట్‌ విద్యార్థులకు ఎప్పటికప్పుడు స్కిల్స్‌పై తరచుగా శిక్షణ ఇప్పిస్తుంటాయి. దీనివలన ఎంబీఏ, ఎంసీఏ చివర్లో ప్లేస్‌మెంట్లు సులువుగా దక్కించుకుంటారు. ఇదే పని గ్రామీణ వాతావరణంలో చదువుకునే విద్యార్థులు కొంత శ్రమించి చేస్తే పోటీలో మీరూ ముందుంటారు.

No comments:

Post a Comment