మీ విద్యా నేపథ్యం, ఇంతవరకు సాధించిన అవార్డులు? పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీజిల్లా తారకేశ్వర్. 1998లో బీఎస్సీ పూర్తిచేశాను. ఆ తర్వాత పశ్చిమబెంగాల్‌లోని బురద్వాన్ యూనివర్సిటీలో ఎంఎస్సీ ఫిజిక్స్ చదివా. 1998 నుంచి 2003 వరకు బెంగళూరులో రామన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఫిజిక్స్‌లో లిక్విడ్ క్రిస్టల్‌పై పరిశోధన సాగించాను. ఆ తర్వాత 2003 నుంచి 2006 వరకు బిట్స్ పిలానీ క్యాంపస్‌లో ఫిజిక్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రీసెర్చర్‌గా పనిచేస్తున్నారు. ఇంతవరకు 40 జర్నల్స్ ప్రచురితమయ్యాయి. 2010లో లిక్విడ్ క్రిస్టల్ సొసైటీ అవార్డు, ఎర్లీ కెరీర్ అచీవ్‌మెంట్ అవార్డు, 2011లో సత్యమూర్తి మెమోరియల్ అవార్డు లభించాయి.
శాస్తవ్రేత్త అవాలనుకోవడానికి కారణం?చిన్నప్పటినుంచి ఫిజిక్స్ పట్ల ఇష్టం. అందుకే జీవితంలో సైంటిస్ట్ కావాలని నిర్ణయించుకున్నా. బెంగళూరులోని రామన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో పీహెచ్‌డీ చేస్తున్న సమయంలో మధుసూదన్ అనే శాస్తవ్రేత్త నాకు ఆదర్శంగా నిలిచారు.
ప్రస్తుతం ఏ అంశాలపై మీరు రీసెర్చ్ చేస్తున్నారు? మీ పరిశోధనల వలన సామాన్య మానవాళికి కలిగే మేలు? ఫిజిక్స్‌లో సాఫ్ట్ కండెక్ట్ మేటర్ అనే అంశంపై పరిశోధనలు చేస్తున్నాను. ప్రధానంగా సినిమా ప్రొజెక్టర్లు, టీవీలు, ల్యాప్ టాప్‌లు,సెల్‌ఫోన్లు తయారీలో భాగంగా ఈ సాధనాల డిస్‌ప్లే(ఎలక్ట్రానిక్ విజువల్ డిస్‌ప్లే) క్లారిటీగా కనిపించడం కోసం లిక్విడ్ క్రిస్టల్‌ను వాడుతున్నారు. దీనిపై ప్రస్తుతం పరిశోధన జరుగుతోంది. దీనిద్వారా ఈ సాధనాల డిస్‌ప్లేలో నాణ్యతతోపాటు మరింత క్లారిటీగా డిస్‌ప్లేలు తయారుచేయడానికి నా పరిశోధన దోహదపడుతుంది.
సైన్స్ విద్యార్థులకు భవిష్యత్తులో ఎలాంటి అవకాశాలుంటాయి? ఫిజిక్స్ రంగం ఏవిధంగా మారబోతోంది?
సైన్స్ రంగంలో ఫిజిక్స్‌కు అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. ఫిజిక్స్‌లో పరిశోధనలు ప్రోత్సహించడానికి, పరిశోధనలు చేయడానికి పేరున్న సంస్థలు దేశంలో ప్రస్తుతం సీఐఎస్‌ఆర్, ఐఐఎస్‌టీ వంటివి మినహా ఎక్కువ లేవు. వీటి సంఖ్య పెరిగితేనే ఈ రంగంలో కొత్తపరిశోధనలు, ఆవిష్కరణలు చేయడానికి వీలవుతుంది. ముఖ్యంగా ఫిజిక్స్‌లోని బయోఫిజిక్స్, సాఫ్ట్‌మెటల్, బయోటెక్నాలజీ విభాగాల్లో మంచి అవకాశాలు రానున్నాయి.
సైన్స్ రీసెర్చ్‌లో అడుగుపెట్టేవారి సంఖ్య తక్కువగా ఉంటోంది. సైన్స్‌లో పరిశోధనల వైపు ఎక్కువ మందిని ఆకర్షించాలంటే ఏం చేయాలి? విద్యార్థులను సైన్స్ పరిశోధన వైపు ఆకర్షించాలంటే.. కాలేజీ స్థాయి నుంచే అధ్యాపకులు, తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించాలి. వాస్తవానికి సమస్య కాలేజీల్లోనే ఉంది. నాణ్యమైన అధ్యాపకులు లేకపోవడంతో సబ్జెక్టును లోతుగా అవగాహన చేసుకోవడంలో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సైన్స్ విద్యార్థి ఇంటర్‌స్థాయి నుంచే తరగతి గదితోపాటు ల్యాబ్‌లో ఎక్కువసేపు సమయం గడపాలి. కాని ఇప్పుడు చాలామంది విద్యార్థులు థియరీకే పరిమితం అవుతున్నారు. ప్రాక్టికల్ నాలెడ్జ్ మొక్కుబడిగా మారిపోయింది. ఇంటర్ నుంచే విద్యార్థులు సొంతంగా ఆలోచించడం అలవాటు చేయాలి.
అమెరికా వంటి దేశాలతో పోల్చినప్పుడు శాస్తస్రాంకేతిక రంగాల్లో భారత వెనుకబాటుకు కారణం? శాస్తస్రాంకేతిక రంగాల్లో భారత్ వెనుకబడిపోయిందని చెప్పడం సమంజసం కాదు. ప్రస్తుతం పరిశోధన రంగంలో భారత్ క్రమేణా పురోగతి సాధిస్తోంది. మిగతా దేశాలతో పోల్చితే బేసిక్ సైన్స్ రీసెర్చ్‌లో మనమే ముందంజలో ఉన్నాం. అంతేకాదు.. సైన్స్ పరిశోధనకు సంబంధించి మన దేశం నుంచి ఇప్పటికే అనేక జర్నల్స్ ప్రచురితమయ్యాయి. సైన్స్ రంగంలో కొత్త ఆవిష్కరణలు చేయాలన్నా.. కొత్త పరికరాలు సష్టించాలన్నా.. శాస్తవ్రేత్తలకు పరిశ్రమలతో కలిసి పనిచేసే అవకాశం రావాలి. ఒకరకంగా ఇండస్ట్రీలు, శాస్తవ్రేత్తలు కలిసి పనిచేస్తే సమద్ధికరమైన ఆవిష్కరణలు ఎన్నో చేయవచ్చు. అయితే భారత్‌లో వివిధ పరిశ్రమలు, ప్రభుత్వం, సంస్థల నుంచి పరిశోధనకు సంబంధించి ప్రోత్సహం కొంత తక్కువే. దీన్ని అధిగమించగలిగితే సమస్య ఉత్పన్నంకాదు.
సైన్స్ పరిశోధనల్లో చెప్పుకోదగ్గ ఆవిష్కరణలు మన దేశంలో జరగడం లేదెందుకు? బ్రై న్ డ్రై న్ ఆపడమెలా?విదేశాలతో పోల్చితే ఇక్కడ పరిశోధనలు చేయాలనుకునే వారికి సౌకర్యాలు, ప్రోత్సాహం తక్కువగా ఉంటోంది. విదేశాల్లో రీసెర్చ్‌రంగంలో ఉన్నవారికి అడుగడుగునా ప్రభుత్వం, పారిశ్రామిక సంస్థలు ప్రోత్సాహం కల్పిస్తున్నాయి. అక్కడ ఏ ఫార్ములా కనుగొన్నా బయట ప్రపంచంలోకి రావడానికి ఎంతో సమయం పట్టదు. ఇక్కడ అలా కాదు. ఆర్థిక సమస్యలు, ప్రోత్సహలేమి సైన్స్ రంగంలో ఆవిష్కరణలకు అడ్డుపడుతున్నాయి. దేశంలో ప్రతిభావంతులైన విద్యార్థులు పరిశోధన రంగంలో ఉన్నారు. వీరికి ఉద్యోగభద్రత ఎంతైనా అవసరం. ఇది ఉంటేనే స్వేచ్ఛగా ఎవరైనా పరిశోధనలపై దష్టిపెట్టగలరు. అంతేకాదు.. సైన్స్ అండ్ టెక్నాలజీ బడ్జెట్‌ను ప్రభుత్వం పెంచాలి. అప్పుడే ఫలితాలొస్తాయి. బ్రెయిన్ డ్రై న్ అరికట్టాలంటే... రీసెర్చ్‌కు తగ్గ మౌలిక సదుపాయాలు, ల్యాబ్స్, నిర్ణయాలు, ఆలోచనల్లో స్వేచ్ఛ, అడ్మినిస్ట్రేషన్, మానిటరింగ్ వంటి పలు సౌకర్యాలు, సమస్యలు తొలగిస్తే సైంటిస్టులకు స్వేచ్చగా పనిచేసుకునే వీలుంటుంది. అప్పుడే వీరు ముందుకొస్తారు.

కంపెనీల్లో ఖాళీలున్నా.. ఉద్యోగాలు దొరక్క విద్యార్థుల ఎదురుచూపులు? కారణం? పరిష్కారం? ఏ దేశవిద్యా విధానంలోనైనా అక్కడి కంపెనీలకు, క్యాంపస్‌లు, కాలేజీలకు మధ్య ముందుచూపుతో కూడిన ఆరోగ్యకరమైన అవగాహన అవసరం. అలా అయితేనే పరిశ్రమలకు కావలసిన మానవ వనరులను తయారుచేయడానికి వీలవుతుంది. కాని ఇక్కడ కాలేజీలకు, క్యాంపస్‌లకు పరిశ్రమలు ఎవరిదారి వారిదే అన్నట్లు వ్యవహరిస్తున్నాయి. ఒకరి అవసరాలు ఒకరు తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదు. కంపెనీల అవసరాలు కాలేజీలకు చెప్పడం లేదు. కాలేజీల కరికులం, కోర్సు రూపకల్పన, కంపెనీల అవసరాలు తీర్చేవిధంగా ఉండడంలేదు. ఈ లోపం ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్తు మీద ప్రభావం చూపుతోంది. ప్రస్తుత విద్యావిధానంలో ల్యాబ్ అంటే ఏంటి? అందులో చేసిన ప్రాక్టీస్ పరిశోధన ఏంటి? అని ఏ విద్యార్థిని అడిగినా మొహం తేలేసే పరిస్థితి ఉంది. దీనికి కారణం.. కాలేజీలో కనీసం ల్యాబ్‌లు, నాణ్యమైన అధ్యాపకులు లేకపోవడమే. కనీసం డిగ్రీ స్థాయిలోనైనాసరే ప్రాక్టికల్ నాలెడ్జ్ నేర్పే విధానం సమర్థవంతంగా అమలుచేస్తేనే ప్రయోజనం ఉంటుంది.
సైన్స్ విద్యలో నాణ్యత పెంచాలంటే ఎలాంటి సంస్కరణలు అవసరం?
సైన్స్ అంటే కేవలం పుస్తకాలు చదవడమే కాదు. సబ్జెక్టును అర్థం చేసుకోవాలి. ఆలోచించాలి. అన్వయించాలి. ల్యాబ్స్‌లో పరీక్షించాలి? ఇవన్నీ చేయాలంటే కాలేజీల్లో విద్యార్థులకు తగిన మౌలికసదుపాయాలు కల్పించాలి. ల్యాబ్‌సౌకర్యాలు ఉండాలి. ప్రభుత్వ,ప్రై వేటు కాలేజీలు కలిసి కూర్చుని పరిశ్రమల ప్రతినిధుల సమక్షంలో కరికులం రూపకల్పన చేయాలి. ఇది జరిగితేనే సైన్స్‌కు,ై సెన్స్ చదువుకు సార్థకత.

పరిశోధన రంగాన్ని కెరీర్‌గా ఎంచుకోవాలనుకునే విద్యార్థులకు మీ సలహా?
కచ్చితంగా సైన్స్‌పై ఆసక్తి ఉండాలి. ఇది లేకుండా ఏదో అవకాశం వస్తుందనే ఉద్దేశంతో ఈ రంగంలోకి అడుగుపెడితే ఎంతో విలువైన సమయం వథా అవుతుంది. ఒకటికిపదిసార్లు ఆలోచించుకోవాలి. సైన్స్ సబ్జెక్టుపై ఆసక్తి, సహనం, కొత్త ఆవిష్కరణలు చేయాలన్న సంకల్పం ఉన్నవాళ్లే ఈ రంగంలో విజేతలవుతారు. అందుకే స్పష్టమైన లక్ష్యంతో రీసెర్చ్‌లోకి అడుగుపెట్టినవాళ్లు సక్సెస్ సాధించడం సాధ్యమే.

పరిశోధన రంగంలో పనిచేస్తున్న వారికి మీ సలహా?హార్డ్‌వర్క్.. ఏ రంగంలోనివారికైనా ఈ సూత్రం వర్తిస్తుంది. పట్టుదలగా పనిచేయడం, అంకితభావం, సహనం.. ఇవన్నీ ఉంటే సక్సెస్‌కు దగ్గరవుతారు. రీసెర్చ్‌లో అనుకున్నవెంటనే ఫలితాలురావు. కొన్నిసార్లు ఏళ్ల శ్రమ వథాగా పోవచ్చు. అలాంటప్పుడే ఆత్మవిశ్వాసంతో పనిచేయగలగాలి. అప్పుడే విజయం వరిస్తుంది.
మీ జీవిత లక్ష్యం?
సైంటిస్ట్‌గా సామాన్యమానవాళికి ఉపయోగపడేలా ఆవిష్కరణలు చేయాలి. ముఖ్యంగా బయోఫిజిక్స్‌లో ఎవరూ చేయనివిధంగా పరిశోధనలుచేసి దేశానికి పేరుతేవడమే లక్ష్యం!!
సైంటిస్ట్‌గా సామాన్యమానవాళికి ఉపయోగపడేలా ఆవిష్కరణలు చేయాలి. ముఖ్యంగా బయోఫిజిక్స్‌లో ఎవరూ చేయనివిధంగా పరిశోధనలుచేసి దేశానికి పేరుతేవడమే లక్ష్యం!!
No comments:
Post a Comment