అగ్ని 5 క్షిపణి తయారీకి రేయింబవళ్లు పనిచేశాం. దేశం కోసం పనిచేయడం ఎవరికైనా గర్వకారణం. డీఆర్డీవోలో 7వేలకుపైగా సైంటిస్టులు దేశం కోసం యజ్ఞం చేస్తుంటారు. భారతదేశం ఇతర ప్రపంచ దేశాల సరసన నిలబడబోతుందనే నిజం పరిశోధన శాలలో ఉత్సాహాన్ని నింపింది. దేశం గర్వించదగ్గ క్షిపణి శాస్త్రవేత్తగా ఎదుగుతానని ఏనాడు అనుకోలేదు. ఇంజనీరింగ్ విద్యార్థులు ఉద్యోగం కంటే పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వాలి. దేశంలో యువ శాస్త్రవేత్తలకు అద్భుతమైన భవిష్యత్తు ఉంది అంటున్నారు దేశానికి గర్వకారణమైన అగ్ని5 ఖండాంతర క్షిపణి తయారీలో నేవిగేషన్ విభాగం డెరైక్టర్‌గా అత్యంత కీలకపాత్ర పోషించిన రాష్ట్రానికి చెందిన సైంటిస్టు సతీష్‌రెడ్డి. 2011 సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గ్రహీత ఆయనతో సాక్షి భవిత ప్రత్యేక ఇంటర్వ్యూ...
అగ్ని5 క్షిపణి ప్రయోగం విజయం మీకు ఎలాంటి అనుభూతినిచ్చింది? అగ్ని5 క్షిపణి ప్రయోగం దేశ చరిత్రలో మైలురాయి. జాతి యావత్తు గర్వించదగ్గ రోజు. ప్రతి భారతీయుడు ఉద్విగ్న క్షణాలకు లోనైన సందర్భమది. ముఖ్యంగా మా శాస్త్రవేత్తల బృందం ఆనందానికి అవధుల్లేవు. అగ్ని5 సక్సెస్ అయ్యాక శాస్త్రవేత్తలంతా చిన్నపిల్లల్లా కేరింతలు కొట్టారు. క్షిపణి ప్రయోగంలో ఐదు దేశాల సరసన భారత్ సగర్వంగా తలెత్తుకు నిలిచిన రోజది. ఎందుకంటే.. క్షిపణి తయారీకి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం బారత్‌కు అందకుండాకొన్ని దేశాలు అడ్డుకున్నా... మనం సొంతంగా ఈ ఘనతను సాధించడం సాధారణ విషయం కాదు. అగ్ని5 ప్రయోగం ద్వారా అందివచ్చిన టెక్నాలజీ... భవిష్యత్తులో అనేక అత్యాధునిక క్షిపణుల తయారీకి ఉపయోగపడుతుంది. నేను అగ్ని5లో నేవిగేషన్ వ్యవస్థకు డెరైక్టర్‌గా పనిచేశా. క్షిపణి విజయవంతంగా దూసుకెళ్లడంలో నావిగేషన్ వ్యవస్థ చాలా కీలకం. క్షిపణిని ప్రయోగించిన తర్వాత అసలది అనుకున్న దిశలోనే ప్రయాణిస్తుందా? లేదా లక్ష్యానికి దూరంగా వెళ్తుందా? అనేది నేవిగేషన్ ద్వారానే తెలుస్తుంది. ప్రతి సెకెన్లో వందోవంతులో క్షిపణి ఎక్కడుంది? ఎంత వేగంతో ప్రయాణిస్తుంది? వంటి వివరాలన్నీ నావిగేషన్ వ్యవస్థ ద్వారానే తెలుసుకోవడానికి వీలవుతుంది. ప్రపంచంలో క్షిపణి నేవిగేషన్ టెక్నాలజీ కేవలం 4 దేశాలకు మాత్రమే ఉంది. ఇప్పుడు ఆ ఘనతను మనం సాధించాం.
డీఆర్డీవోలో పరిశోధనల తీరు ఎలా ఉంటుంది.. సైంటిస్టుల పనివిధానం వివరిస్తారా? దేశంలో డీఆర్డీవోకు మొత్తం 52 ల్యాబ్‌లున్నాయి. ఇక్కడ సైనికుల ఆహార అవసరాల నుంచి శత్రువులను ఎలా ఎదుర్కోవాలనే విషయం వరకూ... నిత్యం రకరకాల విషయాలపై పరిశోధనల యజ్ఞం జరుగుతూనే ఉంటుంది. ప్రస్తుతం డీఆర్డీవోలో 7,500 మంది సైంటిస్టులు పనిచేస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరుల్లోనే కీలకమైన రీసెర్చ్ విభాగాలున్నాయి. డీఆర్డీవో వ్యవస్థలో అత్యంత కీలకమైన క్షిపణుల తయారీ ల్యాబ్ హైదరాబాద్‌లో ఉంది. ఆ తర్వాత బెంగళూరులోని ఏరోనాటికల్ ల్యాబ్ కీలకమైనది. ఇవేకాకుండా సైనికులు హిమాలయాలు, ఇతర సరిహద్దు ప్రాంతాల్లో భారీ ఆయుధ సామగ్రి బరువులతో సుదీర్ఘ సమయం నడుస్తారు. దాంతో వారు శారీరకంగా త్వరగా అలసిపోతున్నారు. వారికోసం అతి తక్కువ బరువుతో.. ఎక్కువ శక్తినిచ్చే ఆహారాన్ని ప్రస్తుతం డీఆర్డీఏ తయారు చేస్తోంది. అలాగే హిమాలయ పర్వతప్రాంతాల్లో సైనికులకు అవసరమైన కూరగాయలను పండించడంతోపాటు అక్కడ దొరికే ఔషధ మొక్కలతో వివిధ వ్యాధులకు మందులు కనుక్కోవడంపై కూడా పరిశోధనలు జరుగుతున్నాయి.
క్షిపణి తయారీకి ఎన్నేళ్లుపడుతుంది? దానివెనుక కృషి ఎలా ఉంటుంది?ఒక క్షిపణిని డిజైన్ చేసి, దానికి టెక్నాలజీ రూపొందించి, విజయవంతంగా ప్రయోగించి సైన్యానికి అందివ్వడానికి ఇవ్వడానికి 15 ఏళ్లు పట్టేది. కఠోరశ్రమ, సాధనతో ఈ సుదీర్ఘ వ్యత్యాసాన్ని డీఆర్డీవో గణనీయంగా తగ్గించింది. అసలు ఎలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ లేకుండా.. జీరో స్థాయి నుంచి క్షిపణిని తయారుచేయడానికి ఇప్పుడు 5ఏళ్లు పడుతుంది. కనీస టెక్నాలజీ ఉంటే నాలుగేళ్లకే క్షిపణని సిద్ధం చేయొచ్చు. క్షిపణి తయారీ ఒక యజ్ఞం లాంటిది. దీని తయారీకి కనీసం 300 నుంచి 500 మంది సైంటిస్టులు, ఇతర విభాగాల నిపుణులు అవసరం ఉంటుంది.
డీఆర్డీవో నుంచి ఇంకా కొత్త ఆవిష్కరణలేవైనా ఆశించవచ్చా? మన దేశంపై శత్రుదేశాలు దాడిచేయడానికి ప్రయోగించే క్షిపణులను గుర్తించి మధ్యలోనే వాటిని నాశనం చేసే ఎయిర్ డిఫెన్స్ సిస్టంను డీఆర్డీవో అభివృద్ధి చేస్తోంది. తక్కువ ఎత్తులో ప్రయాణించే క్రూయేజ్మిషన్లు, అన్మ్యాన్డ్ ఎయిర్ వెహికల్స్(యూఏవీ), అడ్వాన్స్డ్ టార్పెడ్స్ను భవిష్యత్తులో అందుబాటులోకి తీసుకురానుంది.

| ఇంజనీరింగ్ విద్యార్థులకు భవిష్యత్తులో ఎలాంటి అవకాశాలున్నాయి?ఇంజనీరింగ్ అంటే.. సాఫ్ట్వేర్ ఒకటే అనుకుంటున్నారు చాలామంది. వీటికిమించి ఎన్నో గొప్ప అవకాశాలున్నాయి. బీటెక్ పూర్తై వాళ్లకు డీఆర్డీవో ఏటా 500 నుంచి 1,000 మంది వరకు కొత్త సైంటిస్టులను తీసుకుంటుంది. గడచిన 7, 8 ఏళ్లలో ఎందరో ఐఐటీ విద్యార్థులు డీఆర్డీవోలో చేరారు. పైగా ఇంజనీరింగ్ విద్యార్థులు ఈ రంగంలో ఎన్నో విజయాలు సాధిస్తున్నారు. కీలకమైన ఎయిర్ డిఫెన్స్ తయారీలో యువ ఇంజనీర్లదే కీలకపాత్ర. అందుకే దీన్ని యువ ఇంజనీర్లకు అంకితమిచ్చారు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్(ఆర్అండ్డీ), ఐఐసీటీ, ఎన్జీఆర్ఐ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో ఇంజనీరింగ్ విద్యార్థులకు లక్షల్లో అవకాశాలున్నాయి. ఇవికాకుండా బోధన రంగంలో, ప్రాజెక్టు వర్కుల్లో ఎన్నో అవకాశాలు వరించనున్నాయి. సాఫ్ట్వేర్ ఫీల్డ్‌కు వెళ్లడం కోసమే ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్లు ఎక్కువిప్పుడు! ఈ పరిస్థితిలో ఇంజనీర్లను రీసెర్చ్‌వైపు ఆకర్షించాలంటే ఏం చేయాలి? ఈ పరిస్థితికి ఎవరినీ తప్పుపట్టలేం. ఎందుకంటే.. వాస్తవానికి బేసిక్ సైన్స్‌పై రీసెర్చ్ బాగా తగ్గిపోయింది. ఈ సమస్య అన్ని దేశాల్లోను ఉంది. దేశంలో ఏదో ఒకమూల రీసెర్చ్ ఫలితాలు ఎప్పటికప్పుడు వెలుగులోకి వస్తుంటేనే.. విద్యార్థులకు రీసెర్చ్‌పై ఆసక్తి పెరుగుతుంది. ఏదైనా కొత్తది పుట్టుకొస్తేనే ఆ రంగంపై ఆసక్తి పెరుగుతుంది. ఇప్పుడు అగ్ని5 విజయవంతం కావడంతో డీఆర్డీవో, సైంటిస్టులన్నా, రీసెర్చ్ అన్నా ఆసక్తిపెంచుకునే వాళ్ల సంఖ్య పెరుగుతోంది. సైంటిస్టులకు ప్రభుత్వం ప్రోత్సాహం సరిపోతుందా? ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? కేంద్ర ప్రభుత్వం ఇటీవల సైంటిస్టులకు ప్రోత్సాహకాలు భారీగా పెంచింది. అందులోభాగంగా ప్రత్యేక అలవెన్సులు పెంచింది. ఇది మంచి పరిణామం. అదేవిధంగా చేసిన పనిని బట్టి కూడా గుర్తింపు ఇస్తున్నారు. ఇది వారిలో ఉత్తేజాన్ని పెంచి మంచి పరిశోధనలు చేయడానికి దారితీస్తుంది. పరిశోధన రంగాన్ని కెరీర్‌గా సక్సెస్ సాధించాలంటే? మిగిలిన కెరీర్లతో పోల్చితే ప్రస్తుతం పరిశోధన రంగం అద్భుతంగా ఉంది. ఆర్అండ్డీ ఆవశ్యకతను గుర్తించిన ప్రభుత్వం ఇప్పుడిప్పుడే సైంటిస్టులకు అనేక ప్రోత్సాహకాలిస్తుంది. ఈ రంగంలో వృత్తి సంతృప్తి ఎక్కువ. దేశానికి మనవల్ల ప్రయోజనం కలగబోతుందనే విషయం అడుగడుగునా ఉత్తేజాన్ని నింపుతుంది. సైంటిస్ట్ కెరీర్ ఎంచుకుంటే సక్సెస్ కాలేమని, పరిశోధనల్లో ఫలితాలకు అనేక ఏళ్లు పడుతుందనే అపప్రద ఉంది. మంచి సమస్య ఎంచుకుని దానిపై పరిశోధన చేస్తే తక్షణమే మంచి ఫలితాలొస్తాయి. దీన్ని విస్మరిస్తే ఫలితాలు రావడానికి ఎక్కువ సమయం పడుతుంది. లక్ష్యాలు ఏర్పాటు చేసుకోండి. వాటిని సాధించడానికి అవిరళ కృషిచేయండి. విజయాలు ముంగిట వాలుతాయి. డీఆర్డీవోలో పనిచేయాలనుకునే రీసెర్చ్ విద్యార్థులకు మీ సలహా? డీఆర్డీవోలో పనిచేసే అవకాశం రావడమంటే భారతదేశ రక్షణ విభాగంలో పనిచేసే అవకాశం వచ్చినట్టే. దేశం కోసం పనిచేయడానికి మార్గం ఏర్పరచుకున్నట్టే. ఇక్కడ జూనియర్ సైంటిస్ట్‌గా చేరితే ఆలోచన విధానం, దేశం కోసం ఏదో ఒకటి సాధించాలన్న తపన కచ్చితంగా పెరుగుతుంది. |
| మీ విద్యా, కుటుంబ నేపథ్యం? మాది నెల్లూరు జిల్లా, ఆత్మకూరు మండలం, మహిమలూరులో వ్యవసాయ కుటుంబం. 1978-80లో ఇంటర్ పూర్తిచేశాను. 1980 నుంచి 1984 వరకు అనంతపురం జేఎన్టీయూలో ఈసీఈలో బీటెక్ చదివాను. 1985లో డీఆర్డీవోలో చేరా. కాలేజీ రోజుల నుంచే నాకు దేశభక్తి ఎక్కువ. మా స్నేహితులంతా ఇంజనీరింగ్ పూర్తిచేసి విదేశాల్లో సెటిలయ్యారు. నాకు మాత్రం దేశం విడిచి వెళ్లాలనిపించేదికాదు. సైంటిస్టు కావాలని ఎందుకనుకున్నారు?చిన్నప్పటి నుంచీ ఇంజనీరింగ్ అంటే చాలా ఇష్టం. బీటెక్ పూర్తయ్యాక సైంటిస్ట్నవుతానని ఏనాడు అనుకోలేదు. దేశం యావత్తు గర్వించే క్షిపణి తయారీలో భాగస్వామినవుతానని కలలో కూడా ఊహించలేదు. కాకతాళీయంగానే సైంటిస్ట్నయ్యా. ఉద్యోగం కోసం ఇస్రో, డీఆర్డీవో, అటమిక్ ఎనర్జీ ఈ మూడు సంస్థలకు దరఖాస్తు చేశా. చివరకు డిఫెన్స్రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీవో)లో జాబ్ వచ్చింది. ఇక్కడకు వచ్చాక సైంటిస్ట్ గొప్పతనమేంటో తెలిసింది. అప్పటినుంచి ఎంతగానో కష్టపడి పనిచేశా. చివరకు ఈ స్థాయికి వచ్చాను. ఇప్పటివరకు సాధించిన అవార్డులు? 1999లో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి చేతులమీదుగా యువశాస్త్రవేత్త అవార్డు, 2007లో ప్రధాని మన్మోహన్ నుంచి పెర్ఫార్మెన్స్ ఎక్స్‌లెన్స్ అవార్డు, 2011లో రక్షణ మంత్రి ఆంటోని నుంచి సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నాను. ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ ఫెలోషిప్ అవార్డుకు ఎంపికయ్యారు. కెరీర్లో మీరు బాగా గర్వపడిన సందర్భం? 2006లో ఒక క్షిపణిని ప్రయోగించినప్పుడు అందులో ఏకకాలంలో నాలుగు క్షిపణి నేవిగేషన్ వ్యవస్థలను ఉంచి ప్రయోగం చేశాం. ఈ నాలుగూ చాలా యాక్టివ్‌గా పనిచేశాయి. ఇది నాకు గర్వకారణం. ఎందుకంటే.. నేను చేసిన ప్రయోగం వలన బయటదేశాల నుంచి నేవిగేషన్ వ్యవస్థలను కొనుగోలుచేసే పరిస్థితి తప్పుతుంది. అంతేకాకుండా.. ఆయా దేశాలిచ్చే టెక్నాలజీ కోసం మనం ఎదురు చూడనవసరం లేదు. ఈ ప్రయోగం విజయవంతమవడంతో విదేశీమారక ద్రవ్య నిల్వలు వెచ్చించి టెక్నాలజీ కొనుక్కునే పరిస్థితి నుంచి బయటపడ్డాం. డీఆర్డీవోలో మాజీ రాష్ట్రపతి కలాంతో పనిచేశారు కదా? ఆయన్నుంచి ఏం నేర్చుకున్నారు? 12ఏళ్లపాటు అబ్దుల్ కలాంతో కలిసి పనిచేశా. నిజంగా ఇది గర్వకారణం. దేశం గర్వించే వ్యక్తితో అంతకాలం పనిచేసే అవకాశం అదృష్టంగా భావిస్తాం. అతి సాధారణంగా, ఎలాంటి బేషజాలు లేకుండా కష్టపడి పనిచేస్తూ యువరక్తానికి అవకాశాలిచ్చే మహోన్నత వ్యక్తి ఆయన. యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహించడంలో ఆయనకు ఆయనేసాటి. నా ఆదర్శ వ్యక్తుల్లో కలాం ఒకరు. |
No comments:
Post a Comment