Friday, 6 April 2012

కేయూలో దూరవిద్య డిగ్రీ

దూరవిద్య విధానంలో బీఏ/బీకాం/బీబీఎం కోర్సుల్లో ప్రవేశానికి కాకతీయ విశ్వవిద్యాలయం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
అర్హత: ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణత.
ఎలాంటి విద్యార్హత లేనివారు జూన్‌ 30, 2012 నాటికి 18 ఏళ్లు పూర్తవడంతోపాటు ప్రవేశ పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. 2008 నుంచి 2011 మధ్య అర్హత పరీక్ష ఉత్తీర్ణులైన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తులు: రూ. 200 చెల్లించి స్టడీ సెంటర్లలో పొందొచ్చు. ‘రిజిస్ట్రార్‌, ఎస్‌డీఎల్‌సీఈ, కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్‌’ పేరిట వరంగల్‌లో చెల్లేలా తీసిన రూ.250 డీడీని పంపి దరఖాస్తులు పొందొచ్చు.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్‌ 4, 2012
ప్రవేశ పరీక్ష తేదీ: ఏప్రిల్‌ 22, 2012
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ www.sdlceku.ac.in చూడొచ్చు.

No comments:

Post a Comment