Monday, 28 May 2012

నీల్సన్ సర్వేలో ఓయూకు 6వ స్థానం

ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీ కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. ఇండియా టుడే-నీల్సన్ ఇటీవల  దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలపై నిర్వహించిన సర్వేలో ఉస్మానియా యూనివర్సిటీకి 6వ స్థానం లభించింది. విద్యా  ప్రమాణాలు, పరిశోధన, ఫ్యాకల్టీ, మౌలిక సదుపాయాలు, పబ్లికేషన్స్ తదితర అంశాల్లో యూనివర్సిటీల ప్రతిభను అంచనా  వేయడానికి ఇండియా టుడే ఈ సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా 160 యూనివర్సిటీలపై ఈ సర్వేను నిర్వహించగా టాప్‌టెన్‌లో నిలిచిన వర్సిటీల్లో ఓయూకు 6వ స్థానం లభించడం విశేషం. గతంలో రెండుసార్లు ఈ సర్వేను నిర్వహించగా..తొలిసారి ఓయూ 10వ స్థానంలో నిలవగా.. రెండోసారి సర్వేలో ఏడవ స్థానాన్ని పొందింది. ఉన్నత పరిశోధనలు, అత్యుత్తమ బోధన, మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన వల్ల ఓయూకు ఈ ఘనత దక్కిందని వర్సిటీ అధికారులు పేర్కొన్నారు. 
దీనిపై ఓయూ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఎస్.సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment