ఈనెల 31న నిర్వహించాల్సిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఎట్టకేలకు వాయిదా పడింది. జూన్ 1న టెట్‌ను నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. పెట్రోల్ చార్జీల పెంపును నిరసిస్తూ ఈనెల 31న బంద్‌కు వివిధ రాజకీయ పార్టీలు పిలుపునిచ్చిన నేపథ్యంలో టెట్ నిర్వహణపై కొంత గందరగోళం నెలకొంది. పరీక్ష రోజున బస్సులు తిరగకపోతే అభ్యర్థులు ఇబ్బందులు పడాల్సి ఉంటుందని, పరీక్షను వాయిదా వేయాలంటూ పలువురు అభ్యర్థులు ప్రభుత్వానికి విన్నవించారు.
దీంతో తర్జనభర్జన అనంతరం సోమవారం రాత్రి విద్యాశాఖ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. బంద్ పరిస్థితులపై అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తులను సెకండరీ విద్యా శాఖ మంత్రి పార్థసారథి దృష్టికి తీసుకెళ్లారు. పరీక్షను వాయిదా వేయకపోతే అనేక సమస్యలు ఎదురవుతాయన్న ఆలోచనతో టెట్‌ను ఒక రోజు వాయిదా వేయాలని నిర్ణయించినట్లు అనంతరం మంత్రి పార్థసారథి వెల్లడించారు.
No comments:
Post a Comment